వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రముఖ మైనది. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం అప్పట్లో గోల్కొండ నవాబు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా ఉండేది. ఇక్కడ రుషులు తపస్సు చేసుకునే వారని, దేవతామూర్తులు సంతరించేవారని పురాణాలు చెబుతున్నాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ఇక్కడి అనంతపద్మనాభస్వామిని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం సుమారు 1300 సంవత వ్సరాల పైనాటిదని చెబుతారు. విష్ణుపురాణంలో అనంతగిరి చరిత్ర ఉంది. అప్పట్లో అంతా దట్టమైన అడవి, కొండలు గుహలతో నిండి ఉండేది. ఇక్కడ మహామునులు, రుషులు తపస్సు ఆచరించేవారని ప్రతీతి ఉంది. రాక్షసులతో ముసు కుందుడనే రాజర్షి చాలా సంవత్స రాలు యుద్ధం చేసి వారిని ఓడించి తన అలసట తీర్చుకొనుటకు ఆహ్లాదకరమైన, సురక్షిత ప్రదేశమును, ప్రశాంతమైన స్థలాన్ని తెలపాలని దేవేంద్రుని కోరాడని కథనం.
అంతే కాకుండా తన ప్రశాతంతతను భంగం చేసిన వారిని తాను చూసిన వెంటనే తన చూపులకు భస్మమైపోవునట్లు వరం కోరాడు. దాంతో దేవేంద్రుడు ప్రసన్నుడై భూలోకమున అనంతగిరి క్షేత్రమున అలసట తీర్చుకొనుటకు స్థలాన్ని తెలిపి ముచుకుందుడు అడిగిన వరాన్ని ఇచ్చాడని కథనం.
అంతే కాకుండా తన ప్రశాతంతతను భంగం చేసిన వారిని తాను చూసిన వెంటనే తన చూపులకు భస్మమైపోవునట్లు వరం కోరాడు. దాంతో దేవేంద్రుడు ప్రసన్నుడై భూలోకమున అనంతగిరి క్షేత్రమున అలసట తీర్చుకొనుటకు స్థలాన్ని తెలిపి ముచుకుందుడు అడిగిన వరాన్ని ఇచ్చాడని కథనం.
దీంతో ముచుకుందుడు అనంతగిరి క్షేత్రానికి విచ్చేసి నిద్రపోయినట్లు చెబుతారు. ఇలా ఉండగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణ బలరాములు తమ శుత్రువైన కంసుని సంహరించి ద్వారకను పరిపాలిస్తుండంగా కాలయవనుడను రాక్షసుడు దండెత్తి ద్వారకను ముట్టడించి మధురా నగరాన్ని స్వాధీనం చేసుకొని ద్వారక ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుండగా శ్రీకృష్ణబలరాములు రాక్షసుని ఎలాగైనా సంహరించాలనే పథకం ప్రకారం రాక్షసునికి భయపడినట్లు నటిస్తు అనంతగిరి కొండ గుహల్లో నిద్రిస్తున్న ముచుకుందుడు ఉన్న ప్రాంతానికి తమ వెంట వచ్చే విధంగా పరుగుతీసి శ్రీ కృష్ణుడు తన ఉత్తరీయాన్ని నిద్రిస్తున్న ముచుకుందునిపై కప్పి అంతర్ధాన మవుతారు. శ్రీకృష్ణబలరాములను వెంటాడుతు వస్తున్న కాలయవనుడు ముచు కుందునే శ్రీకృష్ణునిగా భావించి నిద్రాభంగం కలిగించాడు. దీంతో కోపో ద్రిక్తుడైన ముచుకుందుడు కళ్లు తెరిచి చూడడంతో కాలయవనుడు భస్మం అయ్యాడని అంతలోనే శ్రీకృష్ణబలరాములు ప్రత్యక్షంకాగా ముచుకుందుడు ఆనందంతో వారి పాదాలను కడిగి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. శ్రీకృష్ణుని పాదాలను కడిగిన జలమే జీవనదిగా మారింది.
కలియగం ప్రారంభమున మహా విష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఃఫలం ఫలితంగా సాల గ్రామ రూపంలో అనంతపద్మనా భస్వామిగా అవతరించాడని చెబుతారు.
అనంతపద్మనాభస్వామి దేవాయలం పక్కనే భగీరథ గుండం ఉంది. ఈ గుండంలో స్నాన మాచరిస్తే ఆయురారోగ్యాలతోపాటు కోరిన కోరికలు తీరు తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎక్కడ ఎంత నీటి కరువు వచ్చిన ఈ గుండాలుమాత్రం నీటితో కళకళలాడుతూ ఉంటాయి.
మార్కండేయ తపోవనం
దేవాలయం పక్కనే మార్కండేయుడు తపస్సు చేసిన తపో వనం ఉంది. ఇక్కడ మార్కండుయుడు తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ శివసాక్షాత్కారం పొంది బ్రహ్మదేవుని ఆరాధించినట్లు కథనం ఉంది.
దేవాలయం పక్కనే మార్కండేయుడు తపస్సు చేసిన తపో వనం ఉంది. ఇక్కడ మార్కండుయుడు తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ శివసాక్షాత్కారం పొంది బ్రహ్మదేవుని ఆరాధించినట్లు కథనం ఉంది.
ఎత్తైన కొండల్లో ప్రకృతి రమణీయతకు నిలయం ఈ దేవాలయం. దేవాలయం ప్రాంగణంలో ఆహ్లాదకరంగా చక్కటి వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అనంతగిరిలో అనంతపద్మనాభస్వామి పెద్ద జాతర, చిన్న జాతరగా రెండు సార్లు జాతర జరుగుతుంద
చిన్న జాతర ఆషాఢమాసంలో 5 రోజులపాటు, పెద్ద జాతర కార్తీక మాసంలో 11 రోజులపాటు జరుగుతుంది.
No comments:
Post a Comment