* ప్రాణదేవుడు ... హనుమంతుడు......
* ఎంతటి కష్టాన్నైనా తొలగించే అంజని పుత్రుడు ....
.
.
అంజనేయస్వామి చరిత్ర చదివిన వారికి బ్రహ్మచర్య వ్రతపాలన, శీలరక్షణ, బలబుద్దుల వికాసము శ్రీరామచంద్రలవారియెడల భక్తి పూర్వకమైన దాస్య భావము మెదలైన మహత్తర గుణోపదేశము లభిస్తాయి. అంజనేయుని ప్రార్ధించిన భక్తులకు నెల్లప్పుడూ సంరక్షిస్తుంటాడు ఆస్వామి. భూత, ప్రేత రాక్షసాదులు ఆ స్వామినామాన్ని ఉచ్చరించినంత మాత్రమే పారిపోతాయి.
.
స్మరణ చేస్తేనే చాలు, ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక దౌర్భగ్య సంఘర్షణలో ఆస్వామి సహకారం లభిస్తుంది. ఆయనవల్ల తులసీదాసుకు రామదర్శనం లభించింది. ఆయన్ని ధ్యానిస్తే అలౌకికమైన సిద్దులు లభిస్తాయి. ఆ స్వామి బాలబ్రహ్మచారి. ఆయన పరాక్రమం ఆమోఘం.
.
అందుకే శ్రీ రామచంద్రుడు హనుమంతుని యశస్సు గురించి చెబుతూ, ``యుధ్దంలో ఆంజనేయుడు చూపించిన పరాక్రమాన్ని యముడు ఇంద్రుడు కుబేరుడు ఇతర లోకపాలకులెవరూ చూపలేరు. అన్నాడు.
.
శ్రీ రామచంద్రునికి గెలుపు లభించడంలో హనుమంతుని వంటి నిష్కానుపరాక్రమవంతుడి పాత్ర ఎంతోవుంది. హనుమంతుడు ఒక్కడు జీవించేవుంటే చాలు మనమంతా లేకుంటేనేం శ్రీరాముడికి తప్పక జయం లభిస్తుంది. అని యుధ్ధకాండలో అంటాడు. జాంబవంతుడు, ఆయనలో వుండే శ్రీరామభక్తి కారణంగానే ఆంజనేయుని స్మరణ అమోఘమైన ఫలాన్ని సాధిస్తుంది.
.
జీవితంలో సమస్యలెదురై క్లిష్టపరిస్థితిలో వున్నప్పుడు కార్యసాధనకై భక్తులు శ్రీరామసమేతుడైన ఆ రామభక్తుని స్మరిస్తే చాలు, భక్తజనవ శంకరుడైన హనుమంతుడు వెంటనే వారి కోరికలు తీరుస్తాడు.
.
శ్రీరామ నామాన్ని ఆంజనేయుడు తన జీవిత సర్వస్వంగా భావించాడు. హనుమంతుడు నలుడు,నీలుడు మెదలైన వానర వీరులకు శ్రీరామనామాన్ని ఉపదేశిస్తూ ``త్రాసులోని ఒక పళ్లెంలో సమస్త మహామంత్రాలను అనంత కోటి జ్జానధ్యాననాదిసాధనాఫలాలను ఉంచి, రెండవపళ్లెంలో కేవలం శ్రీ రామనామాన్ని ఉంచితేచాలు అవన్ని కలిసినా సరితూగవు''అంటాడు.
.
శ్రీరామనామాన్ని జపించేవారిపట్ల ఆంజనేయస్వామి తప్పక ప్రసన్నుడై వుంటాడు. అటువంటి వారిపట్ల వారికి తనుకల్పవృక్షమై సమస్త కోరికలను తప్పక తీరుస్తాడు.
``సమస్తరోగాములకు ఒకే ఒక దివ్యౌషథం కలదు. ఆదియే భగవన్నామం''
.
మనో నియంత్రణ ముఖ్యంఆధ్యాత్మిక అనేది ఎవరో అందిస్తే వచ్చేదికాదు.ఇతరులు ఎవరైనా ఒక మార్గం చూపగలరే గాని ఆ మార్గంలో గమ్యం చేరేందుకు మనబదులు నడవరు. మన అడుగులతో మనం నడవాల్సిందే.ఒకరి బదులుగా మరొకరు పరీక్ష రాయడం నేరమని విద్యార్థులకు తెలుసు. అదే విధంగా ఒకరికిబదులు మరొకరు ధ్యానం చేసినా ఫలితముండదు. ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యం కోరికల నుండి మనసును దూరం చేయడం అని పెద్దలు చెబుతారు. నిజమే, పదునుపోయిన కత్తి పండును కోసేందుకు పనికిరానట్టే, అనవసరపు ఆకర్షణలకు అల్లుకుపోయిన మనసు మంచి వైపు మళ్ళలేదు.కోరికల భౌతిక సుఖాలు, ఆకర్షణల నుండి మెదుడును, మనసును దూరం చేసినప్పుడే అది ఆధ్యాత్మిక మార్గాన్ని గ్రహించగలుగుతుంది. ఆలోచనలకు వేసిన మసకను తొలగించుకోవాలి. అలా తొలగించగలగినదే మననకు తొలగించుకోవాలి. అలా తొలగించినదే హనుమధ్ధ్యానం. ఆ ధ్యానంలో వున్న విశేషాన్ని తెలుసుకుంటే ఇక మిగిలిన ఆడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోతాయి.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment