నారాయణీ. ~ దైవదర్శనం

నారాయణీ.

దివ్యజలములు నివాసముగా గలది అని అర్ధము. దివ్యజలములనగా సృష్టి కాధారభూతమైన అనంత మైన తత్వము.అది నీలి తరంగమువలె అనంతమై యుండును.ఇవియే సృష్టికి మూలము. వీనిని నారములని కూడా పిలుతురు.వీని యందు తేలుచు నుండునది శ్రీదేవి కనుక నారాయణీ అయినది.నారాయణు డన్ననూ, నారాయణీ అన్ననూ ఒక్కటియే. పురాణములందు నారాయణని సహోదరి కనుక నారాయణి అనిరి. అట్లే శివునికి నారాయణు డను పేరు కలదు.అతని భార్య కనుక నారాయణి అని కూడా శ్రీమాత నందురు.

పద భేదము వలన తత్వ భేదము,అవగాహనా భేద ము కలుగరాదు.సృష్టి కతీతమగు జలములను నివాసముగా గల స్థితి ఇది. శ్రీ లక్ష్మిని ,పార్వతిని నారాయణీ అను నామముతో పిలుతురు.అట్లే విష్ణువుని శివుని గూడా నారాయణు డు అని పిలుతురు.నారముల నధిష్టించి యుందురు కనుక వీరు నారాయణు లు.(నారాయణ అనునది ఒక్కటియే.నారాయణు లనుట అవగాహన కలిగించుటకు)

నరులు కూడా నారముల నుండి వచ్చినవారే కనుక వారునూ శాశ్వతులే.నర అన్ననూ నారీ అన్ననూ ఒక్కటియే.నారాయణ నారాయణీ వలెనే.నర ,
నారీ పదము లేర్పడినవి. ఈ శబ్ధములాన్నిటి యందు మూల శబ్ధము నర శబ్ధము.ర అనగా నశించునది.నర అనగా నశింపనిది.

నారములు నశింపనివి అని సృష్టికి ముందు. లయమునకు వెనుక కూడా నుండును.కనుక నారాయణీ, నరులు( ఎప్పుడూ నుందురు.నారాయణు నకు,నరునకు వ్యత్యాసము అయినము అను శబ్ద మొకటియే (నర+అయినము= నారాయణము అయినము అనగా ఆరోహణము లేదా అవరోహణము.(దక్షిణ+అయినము,ఉత్తర+అయినము)నరులు సృష్టియందు అవరోహణము చెందుట ఆరోహణము చెందుట యుండును.నారాయణు డట్లు అవరోహణ,ఆరోహణ ములు లేక వాని నధిష్టించి నడిపించు వారుగ నుండును.శ్రీమాత పరముగ చెప్పునపుడు నారాయణి సృష్టి స్థితి లయములను గావించు చున్నదని తెలుపుదురు.అందరునుపూజించునది,పూజించ వలచినది నారాయణీ లేక నారాయణు లనే ఈ పూజనము తత్వపరము. 
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive