ఇతిహాసంలో కొలమనాలు. ~ దైవదర్శనం

ఇతిహాసంలో కొలమనాలు.


3 బెత్తెలు = 1 జేన
2 జేనలు = 1 మూర
2 మూరలు = 1 గజము (1 గజము = 3 అడుగులు / 1 అడుగు = 12 అంగుళాలు)
2 గజాలు = 1 బార
2 బారలు = 1 దండము
1000 దండములు = 1 క్రోసు
5 క్రోసులు = 1 యోజన / 1 ఆమడ (1 – యోజన 9.09 మైళ్లు, 14.62894 కిలో మీటర్లు)

ఇతిహాసాలలో ఈ కొలమనాలని వాడటం జరిగింది, ఉ|| ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని దూకాడు. అంటే సుమారు 1462 కి.మి.

సీతాదేవికి రాముడి గురించి హనుమంతుడు 4 మూరల పొడవు రాముడు అని చెప్తాడు, అంటే 8 అడుగులు(1 అంగుళము అంటే ఆధునిక కొలమానం ప్రకారం 1 ఇంచ్ కాదు 3/4 అంటే 1 ఇంచ్ కన్నా పెద్దది).

అదేవిదంగా విష్ణుపురాణం ఆధారంగా మనకు ఇంకా ఆశ్చర్య కరమైన కొలతలు తెలుస్తాయి. అణువు యొక్క పరిమాణాన్ని కూడా దానిలో చెప్పబండిది.

1 పరమాణు = 1 అణువు
1 పరసూక్ష్మ = 10 పరమాణు
1 త్రాసరేణు = 10 పరసూక్ష్మ
1 మహిరజ (ధూళి కణం) = 10 త్రాసరేణు
1 బాలగ్ర (జుట్టు కొన) = 10 మహిరజ
1 లిఖ్ష = 10 బాలగ్ర
1 యుక = 10 లిఖ్ష
1 యవోదర = 10 యుక
1 యవ = 10 యవోదర
1 అంగుళ = 10 యవ
1 పాద = 6 అంగుళ
1 వితస్తి = 2 పాద
1 హస్త = 2 వితస్తి
1 ధను = 4 హస్త
1 గవ్యతి = 2000 ధను
1 యోజన = 4 గవ్యతి

1 దండ = 2 నరిక = 6 అడుగులు (1.8 m)
1 అంగుళము అంటే ఆధునిక కొలమానం ప్రకారం 1 ఇంచ్ కాదు 3/4 అంటే 1 ఇంచ్ కన్నా పెద్దది.

మన పూర్వికులు వెంట్రుక,ధూళి, అణువు వంటి అతి చిన్న వాటిని కూడా కొలిచేవారు అంటే మనకు ఎంతో గర్వంగా ఉంది కదా, అలాంటి, శాస్త్ర విజ్ఞానాన్ని మనం మన ముందు తరాలవారికి అందించడమే మనం వాళ్ళకు చెయ్యగలిగే సత్కారం.

మీరు ఇకనుంచి ఎప్పుడైనా పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ చదివేటప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది అని ఆశిస్తు, వాటిని కేవలం ఆధ్యాతిమిక కోణంలో మాత్రమే కాకుండా, విజ్ఞాన శాస్త్రం దృష్ట్యా కూడా పరిశీలించాలని ప్రర్దిస్తున్నాం.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...