వైష్ణవ శిఖామణి రామానుజాచార్యులు 120 యేళ్లు పూర్ణాయుష్షుతో నేల నాలుగు చెరగులా ధర్మ ప్రభోధం చేసి 1137లో శిష్యులను దివ్యప్రబంధం గానము చేస్తుండగా పింగళ నామ సంవత్సరములో జన్మించిన రామానుజాచార్యులు మూడు పింగళ నామ సoవత్సరాలు చూసిన యోగిపుంగవుడు ..ఆయన విష్ణు సన్నిధి చేరుకోగానే ఆయన దివ్యశరీరాన్ని శ్రీరంగం లోని ఆలయములో భద్రపరిచారు. సంవత్సరానికి రెండుమార్లు ఆ శరీరానికి మేలిమి పచ్చకర్పూరము,మేలిమి కుంకుమ పూవు ఆ శరీరానికి అలదుతారు.ఎటువంటి రసాయనాలూ ఆ శరీరానికి అలదలేదు. ఆ శరీరానికి గోళ్లు అవీ ఇప్పటికీ ఉన్నాయని ఆలయ అర్చకులు చెబుతారు.శ్రీరంగములోని ఆలయములో ఉన్న రామానుజ సన్నిధి లో ఈ శరీరము ఇప్పటికీ ఉంది.ఇది రంగనాథులవారి ఆజ్ఞగా భావించి చేశారు.భక్తులందరూ దర్శించవచ్చు.మామూలుగా యతుల శరీరాలను ఇలా ఉంచరు, పైగా మన హైందవ శ్రీరంగం ఆలయములో.. రామానుజ సన్నిధి లో స్వామి వారి శరీరం గత 880యేళ్లుగా కూర్చునియున్నట్లు ఇప్పటికీ భద్రపరచబడియున్నది.
అలాగే ముస్లిం దండయాత్రలు సమయములో అత్యంత చాకచక్యముగా శ్రీరంగని ఉత్సవ విగ్రహాలను కాపాడిన దేవదాసి మాణిక్యం చనిపోయే ముందు శ్రీరంగడు ఇచ్చిన వరం ప్రకారం దేవదాసీల కుటుంబములో ఎవరైనా మరణిస్తే వారి శవ సంస్కారాలకు శ్రీరంగని ఆలయ వంటశాలలోని అగ్నిని ఆలయ బ్రాహ్మణులు తీసుకువెళ్లి సమర్పించే ఆచారం దేవదాసీ వ్యవస్థ ఉన్నన్నినాళ్లూ నిరాఘాటంగా కొనసాగింది.

No comments:
Post a Comment