వరాలనిచ్చే తల్లి లక్ష్మీదేవి..
లక్ష్మీదేవి మాత అనుగ్రహం వెనుక ఉన్నరహస్యాలు..!
లక్ష్మీదేవి కరుణా, కటాక్షాలు, అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే.. ఇంట్లో సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయనేది హిందువుల నమ్మకం. అందుకే.. ఆ సిరిసంపదల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు.
.
సిరిసంపదలను ప్రసాదించే లక్ష్మీదేవిని తామరపూలతో పూజించాలి. ఎందుకంటే, తామరపువ్వు లక్ష్మీదేవి స్థానం అవడం వల్ల, అమ్మవారిని తామరపూలతో పూజించి, పూజలోని కొన్ని పూలను ధనాన్ని భధ్రపరిచే చోట ఉంచటం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయని అంటారు.
.
మహాభారతంలో.. ఇంద్రుడు, మహాలక్ష్మీ గురించి ప్రస్తావించారు. అయితే తాను భూమిపై ఎక్కడ ఉంటాను, ఎలాంటి ఇంట్లో ఉంటాను, ఎలాంటివాళ్లను అనుగ్రహిస్తాను అనే విషయాలను.. లక్ష్మీదేవియే స్వయంగా.. ఇంద్రుడికి వివరించింది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం వెనక ఉన్న రహస్యాలు తెలుసుకుందామా..
.
* ఏ ఇంట్లో అయితే మనుషులు తక్కువగా మాట్లాడతారో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. అలాగే పెద్దవాళ్లను, తల్లిదండ్రులను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.
.
* ఏ ఇళ్లు అయితే నిత్యం శుభ్రంగా, పండుగ వాతావరణం కనిపించేలా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కరుణా కటాక్షాలు ఉంటాయి. ప్రతిరోజూ గుమ్మం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు అందంగా పసుపు, కుంకుమతో అలంకరించాలి.
.
* ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని.. ప్రతిరోజూ పూజించే వాళ్ల ఇంట్లో.. ఆ తల్లి అనుగ్రహం, కటాక్షం ఉంటుంది.
.
* ఏ ఇంట్లో అయితే.. అందమైన మహిళ, మరియు మంచి ఉద్ధేశ్యం కలిగిన మహిళ ఉంటుందో.. ఆ ఇంటిని ఎల్లవేళలా.. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.
.
* ఇంట్లోని వాళ్లు శుభ్రంగా ఉంటూ, మంచి బట్టలు ధరించడం, బద్ధకంతో లేకుండా ఉంటే.. ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం పొందుతారు.
.
* ఏ ఇంట్లో అయితే.. ఆ ఇంటి యజమాని కోపం, ఆవేశానికి దూరంగా ఉంటూ.. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తాడో.. ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుంది.
.
* సిరిసంపదలకు నిలువెత్తు నిదర్శనమైన ధాన్యాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి.. వాటిని ఏ ఇంట్లో అయితే బంగారం లాగా చూసుకుంటూ భద్రపరుచుకుంటారో.. ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుంది.
.
* మనుషులను స్వార్థం, అహంకారానికి దూరంగా ఉంటూ.. మానవత్వాన్ని నమ్ముతూ.. అందరితో సఖ్యంగా మెలిగే వాళ్ల ఇంట్లో లక్ష్మీ కరుణా కటాక్షాలు ఉంటాయి.
.
* ఏ ఇంట్లో అయితే తెల్లపావురాలను పెంచుకుంటారో, వాటిని ప్రేమగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీ దేవి అడుగుపెడుతుంది.
.
* అనారోగ్యంతో ఉన్న మహిళను మగవాళ్లు పట్టించుకోకపోతే, ఇతర మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.
.
* మనుషులు ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేవాళ్లు ఉండే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది. డబ్బు లేదు అన్న సమస్య దరిచేరదు.
.
* శరీరాన్ని, మనసుని స్వచ్ఛంగా, శుభ్రంగా పెట్టుకునే మనుషులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. చూశారుగా.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. మీకు ఉండాల్సిన లక్షణాలు, ఇంట్లో ఉండాల్సిన అలవాట్లు ఇవే.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment