పురుషార్ధప్రదా. ~ దైవదర్శనం

పురుషార్ధప్రదా.

పురుషార్ధములను ప్రసాధించునది శ్రీదేవి అని అర్ధము.

పురుసార్ధములు చతుర్విధములు .కామము,అర్ధము,ధర్మము,మోక్షము ఈ నాలుగింటిని పరిపూర్తి గావించి జీవులను పరిపూర్ణులను చేయడమే శ్రీమాత పని అర్ధ కామములు జీవులకు వారిలోని లోటు అసంపూర్ణతల వలన కలుగును రకరకములగు కోరికలు కలుగుటకు కారణము వానిని గూర్చిన పూర్ణానుభవము లేకపోవుటయే అనుభవమైన విద్య నిజమైన విద్య అనుభవము లోనికి రాని విద్య తృప్తి నివ్వదు జీవులకు తగు మాత్రము అనుభవ మందించుటకే జన్మ పరంపరలు.అనుభవము ద్వారా జీవునికి తప్పు ఒప్పులు తెలియును అట్లే తృప్తి నిచ్చువాటిలో తాత్కాలికము లేవి;శాశ్వతము లేవి కూడా తెలియును అసంతృప్తితో ముందుకు సాగుట వలన ప్రయోజనము లేదు కావుననే జీవులకు లక్షలాది పరజన్మ లేర్పాటు చేయబడినవి జీవులు అనుభవము చెందుచు పరిణామము దిశగా నడుచు చుందురు. క్రమముగా కామమును,అర్ధమును, ధర్మము అధ్యక్షతన నిర్వర్తించు కొనుట నేర్తురు ధర్మమున చేరుట పరిపూర్తి యగుచున్న కొలది మోక్షము దగ్గరగు చుండును. కర్మబంధము లేకుండుటయే మోక్షము
అది ధర్మా చరణముననే సిద్ధించును.

అర్ధ కామములను నిర్వర్తించుటలో ధర్మము ననుసరించు వారు. అనుసరించని వారుకూడా నుందురు. అందరును కలిసి జీవించుటలో ఘర్షణలు కూడా యుండును. అన్నియునూ జీవునికి అనుభవము నందించుటకే అన్ని అనుభవములూ పరిపూర్ణ మైనప్పుడు జీవునికి పరిపూర్ణత్వము లభించును. కావున శ్రీమాత సృష్టి విధానమున ఆమె కోరిన వారికి కోరునది ప్రసాదించును. కోరుటలోని తప్పుఒప్పులతో ఆమెకు సంబంధము లేదు. తప్పుల వలన కూడా ఫలితముల ద్వారా జీవులు నేర్చుకొనుచునే యుందురు. మహాత్ములైన వారు కూడా ప్రాధమిక దశలో తప్పులు చేసినవారే. శ్రీమాతకు అందరూ తనపిల్లలే ఎవరెవరు ఏవిధముగా నేర్ప వలెనో వారి వారి కట్లే నేర్పుచు నుండును. కావుననే కోరికలు కోరువారికి కోరికలు తీర్చుట, ధనార్జనమున నిమగ్నమైన వారి ప్రార్ధనలను మన్నించి ధనవంతులను చేయుట ధర్మము నర్ధించువారికి సత్పురుషుల ద్వారా ధర్మమును నేర్పుట, శిక్షణ నిచ్చుట, ఇత్యాధులన్ని శ్రీమాతయే చేయుచున్నది 
భగ్వధిత యందు శ్రీ కృష్ణుడు కూడా ఇదే విధముగ పలుకును. ఆర్తులు అర్ధార్ధులు జిజ్ఞాసువులు జ్ఞానులు  తనను గూర్చిన అన్వేషణలో జన్మ పరంపరలను సాగించు చున్నారని తెలిపెను.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive