సాంఖ్య యోగః 3 ~ దైవదర్శనం

సాంఖ్య యోగః 3

య ఏనం వేత్తి హంతారం
యశ్చైనం మన్యతే హతమ్‌,
ఉభౌ తౌ న విజానీతో
నాయం హంతి న హన్యతే.

ఎవడీయాత్మను చంపువానినిగ నెఱుంగునో లేక ఎవడు చంపబడువానినిగ భావించునో, వారిరువురును వాస్తవ మెరిగినవారు కాదు. యథార్థముగ ఈ యాత్మ దేనిని చంపుటలేదు, దేనిచేతను చంపబడుటలేదు.


న జాయతే మ్రియతే వా కదాచి
న్నాయం భూత్వా భవితావా న భూయః,
అజో నిత్యశ్శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే.

ఈ ఆత్మ ఎప్పుడును పుట్టుటలేదు. చచ్చుటలేదు. ఇదివరకు లేకుండ మరల క్రొత్తగా కలుగువాడుకాదు. (ఉండి మరల లేకుండువాడునుకాదు) ఈతడు జనన మరణములు లేనివాడు. శాశ్వతుడు. పురాతనుడు. శరీరము చంపబడినను ఈతడు చంపబడుటలేదు.


వేదావినాశినం నిత్యం
య ఏన మజ మవ్యయమ్‌,
కథం స పురుషః పార్థ
కం ఘాతయతి హంతికమ్‌.

ఓ అర్జునా! ఈయాత్మ నెవడు జననమరణములు లేనివానిగను, నాశరహితునిగను, నిత్యునిగను ఎరుగునో, అట్టివాడెట్లు ఒకనిని చంపించగలడు? తాను చంపగలడు?.


వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ.

చినిగిపోయిన పాతబట్టలను విడిచి మనుజుడు ఇతరములగు క్రొత్తబట్టల నెట్లుధరించుచున్నాడో, అట్లే, దేహియగు ఆత్మయు, శిథిలములైన పాత శరీరములను వదలి ఇతరములగు క్రొత్త శరీరములను ధరించుచున్నాడు.


నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః,
న చైనం క్లేదయాంత్యాపో
న శోషయతి మారుతః

ఈ ఆత్మను ఆయుధము లెవ్వియును ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి యెండింపజాలదు.


అచ్ఛేద్యోయమదాహ్యోయ
మక్లేద్యోశోష్య ఏవ చ,
నిత్యస్సర్వగతస్థ్సాణు
రచలోయం సనాతనః.

ఈ ఆత్మ ఛేదింపబడజాలడు, దహింపబడజాలడు, తడుపబడజాలడు, ఎండింపబడజాలడు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థితస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు.


అవ్యక్తోయమచింత్యోయ
మవికార్యోయ ముచ్యతే,
తస్మాదేవం విదిత్వైనం
నానుశోచితుమర్హసి.

ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముకానివాడు, మనస్సుచే చింతింప శక్యము కానివాడు, వికారములు బొందింపదగనివాడునని చెప్పబడుచున్నాడు. కావున ఈ ప్రకారముగ తెలిసికొని నీవు దుఃఖింపతగవు.


అథచైనం నిత్యజాతం
నిత్యం వా మన్యసే మృతమ్‌,
తథాపిత్వం మహాబాహో!
నైవం శోచితుమర్హసి.

ఓ అర్జునా! ఒకవేళ ఈ ఆత్మ (దేహముతో పాటు) నిరంతరము పుట్టుచు చచ్చుచు నుండువాడని తలంచినను అట్టి స్థితియందుగూడ నీ వీ ప్రకారము శోకించుట తగదు.


జాతస్య హి ధ్రువో మృత్యు
ర్ధ్రువం జన్మ మృతస్య చ,
తస్మాదపరిహార్యేర్థే
న త్వం శోచితు మర్హసి.

(ఒకవేళ నీవీయాత్మను చావు పుట్టుకలు కలవానినిగ తలంచెదవేని అత్తరి) పుట్టినవానికి చావుతప్పదు. చచ్చినవానికి పుట్టుక తప్పదు. తప్పనిసరియగు ఆ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List