నవగ్రహాలు మరికొన్ని విశేషాలు ~ దైవదర్శనం

నవగ్రహాలు మరికొన్ని విశేషాలు

ఒక్కో గ్రహానికి ఒక్కో వర్ణం ఉంటుంది. అవి వరసగా

తెలుపు వర్ణం :- శుక్రుడు, చంద్రుడు .

పసుపు వర్ణం :- గురువు.

ఎరుపు వర్ణం :- అంగారకుడు, సూర్యుడు.

ఆకుపచ్చ వర్ణము :- బుధుడు.

నలుపు వర్ణము :- శని.

పొగరంగు (దూమ్ర వర్ణం ):- రాహువు, కేతువు.

రాశులకు జాతులు ఉంటాయి. అవి వరుసగా

బ్రాహ్మణ జాతి :- గురువు, శుక్రుడు.

క్షత్రియులు :- సూర్యుడు, కుజుడు.

వైశ్యులు :- బుధుడు, చంద్రుడు.

శూద్రుడు :- శని.

చంఢాలుడు :- రాహువు.

సంకరుడు :- కేతువు.

శుభగ్రహాలు :- గురువు, శుక్రుడు, బుధుడు, చర ఋశిలో ఉన్న కేతువు.

పాపగ్రహాలు :- సూర్యుడు, కుజుడు, శని, పాపులతో చేరిన బుధుడు, స్థిర, ద్వస్వభావయుతుడైన కేతువు.

గ్రహములు ద్రవ్యములు:- సూర్యుడికి తామ్రము, చంద్రుడికి మణులు, కుజుడికి పగడము , బుధుడికి ఇత్తడి,కంచు.గురువుకు బంగారము, శుక్రుడికి వెండి, శనికి ఇనుము, సీసము.

శరీరభాగాలు గ్రహములు :- సూర్యుడు ఎముకలకు, చంద్రుడు నెత్తురుకు, బుధుడు చర్మము, శుక్రుడు రేతస్సు, గురువు మెదడు, శని నరములకు, కుజుడు మజ్జ.

పంచ భూతములు గ్రహములు :- అగ్నికి సూర్యుడు, కుజుడు. భూమికి బుధుడు.

సూర్యుడు తూర్పు దిక్కు, చంద్రుడు వాయవ్య దిక్కు, కుజుడు దక్షిణము, బుధుడు ఉత్తరము, గురువు ఈశాన్యము, శుక్రుడు ఆగ్నేయము, శని పశ్చిమము.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive