గ్రహాలలో శుభ, అశుభ గ్రహాలున్నాయి. ~ దైవదర్శనం

గ్రహాలలో శుభ, అశుభ గ్రహాలున్నాయి.

గురు. శుక్లపక్ష చంద్రుడు, శుక్రుడు, బుధువులు శుభ గ్రహాలు. సూర్యుడు, కుజుడు, శని, రాహు, కేతు, కృష్ణపక్ష చంద్రులు అశుభ గ్రహాలు. 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు. 1, 5, 9 స్థానాలు త్రికోణ స్థానాలు. పై స్థానాల్లో 11వ స్థానం శుభస్థానంగా వ్యవహరించబడుతుంది. 3, 6, 8, 12 స్థానాలతో పాటు శుక్రుడు 3, 8 స్థానాల్లో ఉంటే మరణం తటస్థిస్తుంది.ఈ స్థానాల్లో గ్రహాలుంటే సుమారైన ఫలాలు మాత్రమే లభిస్తాయి. అంతేగాక గ్రహాల దృష్టి కారణంగా యోగ ఫలాలు లభిస్తాయి. మరో సమయంలో అశుభ ఫలాలు జరుగుతాయి. సూర్యుడు, 3, 7, 10 స్థానాలను, చంద్రుడు 7వ స్థానం, కుజుడు 4, 7, 8 స్థానాలు, రాహు-కేతు 3, 7, 11 స్థానాలు , బుధుడు 7 స్థానం, గురు 5, 7, 9 స్థానాలు, శుక్రుడు 6, 7, 8, స్థానాలు, శని 3, 7, 10 స్థానాల దృష్టి ప్రభావం చేత యోగ ఫలాలను. అశుభ ఫలాలను అందజేస్తారు.యోగాలలో కొన్ని....గురుక్షేత్ర యోగం:గురు, చంద్రుడు, కలిసియుండటం ద్వారా ఏడో స్థానంలో దృష్టి కారణం చేత గురుక్షేత్రయోగం కలుగుతుంది. ఈ యోగంతో జాతకుడు భూమి, ఆభరణాలు కొనటం వంటివి చేస్తాడు. అంతేగాకుండా ఐశ్వర్యాలు లభిస్తాయి.తామర యోగం:చంద్రుని నాల్గోఇంట్లో చంద్రుడే ఆధిపత్యం వహించటంతో తామరయోగం కలుగుతుంది. దీని ఫలం వలన అనే శుభ కార్యాలు జరుగుతాయి.ధర్మకర్మాధిపతీ యోగం: 9వ స్థానంలో అధిపతిగా, పదో స్థానంలో ఆధీనుడుగా ఉంటే లేదా దృష్టి ప్రభావం చేత ఏర్పడే యోగం. ఈ యోగం వలన ఆభరణాలు, భూమి వంటి చేకూరుతాయి.నీచ భంగ దోషం:ఒక గ్రహం నీచంలో ఉంటే ఎలాంటి శుభప్రదాలకు ఆస్కారాలు ఉండవు. అయితే ఆ స్థానానికి ఆధిపత్య అధిపతి ఉచ్చస్థానంలో ఉంటే నీచస్థానం వైదొలగి యోగం చేకూరుతుంది. దీనినే నీచభంగ దోషమంటారు.గజకేసరి యోగం:గురు కేంద్రంలో చంద్రుడు, చంద్రుని కేంద్రంలో గురువుంటే గజకేసరియోగం కలుగుతుంది. ఈ యోగఫలం ఏనుగును చూసి సింహం పరిగెత్తెడి విధం. అంటే మంచి యోగాలను అందజేస్తుంది.మాలా యోగం:గ్రహాలు వరుసగా ఐదునుంచి ఆరువరకు ఉంటే మాలాయోగం జరుగుతుంది. దీనివలన వరుసగా ఫలాలు అభివృద్దులు లభించే అవకాశాలున్నాయి.చంద్ర మంగళయోగం:కుజ, చంద్రులు సంయుక్తంగా శుభస్థానంలో ఉంటే చంద్ర మంగళయోగం జరుగుతుంది. ఈ యోగాన్ని పొందిన జాతకులు భూములు, స్థలాలు వంటి నూతన వస్తువులను కొంటారు.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive