నరఘోశ నివారణ చేసుకునే విధానం. ~ దైవదర్శనం

నరఘోశ నివారణ చేసుకునే విధానం.

నరఘోశ ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం లేక మనః శాంతి: లేకపోవడం,ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండడం,అందరితో గొడవలు జరుగుతూ ఉండడం,అందరూ మనకి శత్రువులుగా మారడం,ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూఉండడం,ఏ పని కూడా విశేషంగా కలిసిరాకపోవడం,మీకు వందరూపాయలు రావలసినచోట పదిరూపాయలు మాత్రమే మీ చేతికి రావటం లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా నరఘోశకి మూలముగా చెప్పుకోవచ్చు.ఈ నరఘోష అనేదటువంటిది దాదాపుగా అందరికీ ఉంటుంది.ఈ నరఘోశ ఉన్నటువంటి వారు ఎవరైనా పైన ఉదహరించినటువంటి భాదలు పడేవారు నరసింహస్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి.అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచం తెచ్చుకొని నాగాసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజూ పెట్టుకుంటూ ఉండాలి.అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి.మగవారైతే కనుక ఎరుపురంగు మొలతాడును నడుముకు ధరించండి.అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపుదారాన్ని మొలతాడుగా కట్టి ఎడమఅరికాలుకు కాటుకబొట్టు పెడుతూఉండాలి.మగవారికి అయితే కుడివైపు అరికాలుకు కాటుక బొట్టు పెట్టాలి.కుంకుమబొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి.ఈ విధంగా చేయటం వలన ఈ యొక్క నరఘోశ,నరపీడ,అనేటటువంటివి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది.అదేవిధంగా మనం బయట కిరాణా దుఖాణాల్లో స్పటిక అని ఒకటి దొరుకుతుంది.కాస్త ఉప్పుగా పుల్లగా ఉంటుంది.అది తెచ్చుకుని ఒక ఎరుపురంగు బట్టలో కొంచెంపసుపు,కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వలన నరఘోశ అనేది తగ్గుతుంది.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive