ధన త్రయోదశి ప్రాముఖ్యత ~ దైవదర్శనం

ధన త్రయోదశి ప్రాముఖ్యత

ఆశ్వీయుజ మాసంలో కృష్ణ పక్షం లో వచ్చేటువంటి త్రయోదశికి ధన త్రయోదశి అని పేరు.

ధనత్రయోదశి రోజున చేయవలసిన పనులు ఏమిటి తెలుసుకుందాం.ఈ ధన త్రయోదశి అనేది యమధర్మరాజుకి ప్రీతికరమైన రోజు. ఆరోజున ఆయనను పూజించడం వలన మరియు  దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగించి నరకలోకప్రాప్తి లేకుండా చేస్తారు. ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలను లక్ష్మీదేవికి అలంకరించి పూజించాలి.

పూర్వకాలంలో హేమరాజు అనేటువంటి ఒక మహా రాజు ఉండేవాడు. ఆ మహారాజు కుమారుడు పేరు సులోచనుడు. ఆ సులోచనుడు యొక్క జాతకం ప్రకారం వివాహమైన నాలుగవ రోజు మృత్యు గండం ఉందని జ్యోతిష్యులు తెలియజేశారు.ఆ తర్వాత కొంత కాలానికి వివాహ వయస్సు వచ్చేసరికి వివాహం చేశారు. కానీ ఆ నాలుగో రోజు రానే వచ్చింది ఆరోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడు అని బాధపడ్డారు కానీ అదేమీ తెలియని ఆ రాకుమారి తన నగలన్నీ తీసి అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమ దీపం వెలిగించి గుమ్మం లో పెట్టింది.తనకు ఉన్న మృత్యు దోషం ప్రకారం ఆ యమధర్మరాజు 4వ రోజున రానే వచ్చారు సర్ప రూపంలో రాకుమారుడిని కాటు వేయడానికి.ఆ సర్పరూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు గుమ్మం లో పెట్టిన యమ దీపం మరియు లక్ష్మీదేవికి అలంకరించిన బంగారు నగల యొక్క కాంతి ని చూసి మైమరిచిపోయారు. ఈ లోపల సులోచనుడు యొక్క మృత్యు గండ సమయం దాటిపోయి మృత్యు గండం తొలగిపోయింది.

అందుకని యమ ప్రీత్యర్థం గుమ్మం సాయంకాలం గుమ్మంబయట యమ దీపం పెట్టి  దాని కింద  శ్రీముగ్గు వేసి గుమ్మానికి ఒకపక్కగా పెట్టి పూజించండి.లక్ష్మీదేవికి బంగారు నగలు అలంకరించి లక్ష్మీ పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.

ఈ యమ దీపం అనేది మట్టి ప్రమిదలో వత్తులు వేసి నువ్వుల నూనెతో చెయ్యాలి.
ఆ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగాపెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు చేకూరుతాయి.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive