అరుణాచలం దగ్గర లో మొదటిసారి గా కలశ పాకం అనే ఊరులో కనిపించారు.వారి పేరు,ఊరు,వయస్సు తెలియదు.ఏమి ఎక్కువగా మాట్లాడే వారు కాదు,ఎవరైన ఆహారం పెడితే తినేవారు,లేకపోతే లేదు.కూర్చుంటే కొన్ని నెలలు కూర్చునేవారు,తిరగడం మొదలు పెడితే కొన్ని నెలలు తిరిగేవారు..
*"బలోన్మత్త, పిశాచవత్"* అని 4 స్థితిలో వుండే మహానుభావులు అరుదు.వీరు అదే,1960 సంవత్సరం లో కలశ పాక్కనికి 2 km దూరంలో ఉన్న పూoడి గ్రామంలో ఒక అరుగు మీద కూర్చున్నారు.1979 నవంబర్ 3 న సమాధి అయ్యేంత వరకు లేవలేదు.తినిపిస్తే తినేవారు.ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు వీరి సన్నిధిలో ఉన్నపుడు జడలు కట్టిన తలతో, గోనెగుడ్డ కట్టుకున్న ఒక వృద్ధ సాధువు వీరి దర్శనం కు వచ్చి నుంచున్నారు. స్వామి వారిని కాసేపు నిశితంగా చూసారు.భరద్వాజ మాస్టర్ గారు తరువాత సాధువు ని కలుసుకొని వివరాలు అడిగారు.ఆ సాధువు ఎన్నో ఏళ్ళుగా హిమాలయ లలో యోగాభ్యాసం చేస్తూ ఉన్నానని,తన యోగం ఒక స్థితిలో ఆగిపోయింది, పై స్థాయి కి తీసుకెళ్లే వారికోసం అన్వేషణ చేశాను, ఒక అవధూత కనిపడి పూoడిలో స్వామి ని దర్శనం చేసుకోమని,అంటే స్వామి దగ్గరకు వచ్చి వారి దర్శనం తోనే తనకు ఆ స్థితి కలిగింది అని చెప్పారు మాస్టర్ గారితో.ఇలా ఎందరో సాధకులకు దివ్యజ్ఞానం ప్రసాదించారు. అరుణాచలం చుట్టూ 30 మైళ్ళ దూరంలోని వారికి ముక్తి లభిస్తుంది అనేది ఇప్పటి కి సత్యం.
🌟🔥🌟🔥🌟🔥🌟
No comments:
Post a Comment