యోగులు - అవధూతలు. ~ దైవదర్శనం

యోగులు - అవధూతలు.


సమకాలీన మహానుభావులు...కారణజన్ములైన మహాపురుషులు యోగులు సిద్ధులు ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్దిష్టకార్యం కోసం భూమిపై అవతరిస్తారు. తమ కర్తవ్యం పూర్తికాగానే వెళ్ళిపోతారు. ఒకే కాలంలో ఇటువంటి మహాపురుషులు సమీపంలో ఉన్నా సుదూరంలో ఉన్నా ఒకరు చేసేపని ఇంకొకరు ఎరుగుదురు. పరస్పరం తటస్థపడినపుడు హృదయాల తో కన్నులతో మౌనభాషలో మాట్లాడుకుంటారు. ఒకరినొకరు సంభావించుకుంటారు. సొరకాయల స్వామికి సమకాలీనులైన మహాపురుషులు కొందరు వారికంటే ముందు, కొందరు వారి తరువాత తమతమ దేహాలు చాలించినవారున్నారు. కొందరు స్వామివారిని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది మహితాత్ములైన వారున్నారు.

ఈ గ్రంథం ప్రథమ ద్వితీయభాగాల్లో కన్నుకుట్టిస్వామి మద్రాసు మహమ్మదీయయోగి, చట్టపరదేశి, కాశీస్వామి, శివరాజయోగి రాజమ్మాళ్, భగవంత గురువులు, మేడం బ్లావటిస్కీ, కర్నల్ ఆల్కాట్ ప్రభృతుల ప్రసక్తి వచ్చింది. తిరుచురాపల్లి మండలంలో మహామహిమోపేతులుగా ప్రసిద్ధికెక్కిన తాయుమానవర్లు కూడ సొరకాయల స్వామికి సమకాలీనులే. కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళే పుత్తూరులో కట్టించిన సత్రం లెక్కల్లో స్వామివారి ప్రస్తావన ఉండడం చేత వారు క్రీ.శ. 1700 ప్రాంతంలో జన్మించి, 1902 సంవత్సరంలో సమాధి చెందటం చేత 202 సంవత్సరాలు బ్రతికినట్లుగా చారిత్రకులు నిర్ణయించినారు.

స్వామి 1902 లో మద్రాసుకు వచ్చినప్పుడు
వి యతిరాజులు నాయుడు ఇంట్లో వారిఅక్క శ్రీమతి సుబ్బరావమ్మ అడిగిన ప్రశ్నకు తమ వయస్సు అప్పటికి 500 ఏండ్లన్నారు. శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ దయానంద సరస్వతి, లాహిరీ మహాశయుల చేత సంభావింపబడిన, తెలుగుయోగి వారణాసి పంచగంగా ఘాట్లో బ్రహ్మరంధ్రం భేదించుకొని మహాసమాధి చెందిన త్రైలింగస్వామి 280 ఏండ్లు బ్రతికినట్లు చారిత్రకాధారాలున్నవి. లాహిరీ మహాశయుల గురువులు మహావతార్ బాబాజీ వయస్సు అప్పటికే 1200 ఏండ్లంటారు. కొందరు బాబాజీ ఇప్పటికీ ఉన్నారంటారు.

సొరకాయల స్వామివారి సమకాలీనులు, వారి చరమా వస్థలో జన్మించిన యోగులు సిద్ద పురుషులు భారతదేశం వివిధప్రాంతాలలో ఎందరో ఉన్నారు. ఏనుగు పాదంలో అన్నింటి పాదాలు ఇమిడినట్లు సొరకాయల స్వామి దీర్ఘ జీవితకాలంలో వీళ్ళందరి జీవిత కాలాలు ఇమిడి పోతాయి.

షిర్డీ సాయిబాబా (1838 - 1918),

శ్యామాచరణ లాహిరీ (1828 -1895),

రామకృష్ణ పరమహంస (1836 - 1886),

శారదామాయి (1853 - 1920),

యుక్తేశ్వరగిరి (1855 - 1936),

స్వామి వివేకానంద (1862 -1902),

కుసుమహరనాథులు (1865 - 1927),

శ్రీ అరవిందులు (1872 -1950),

సౌరాష్ట్రంలో జలరాం బాపా (1799 - 1881),

దయానంద సరస్వతి (1824 - 1940),

పంజాబ్లో రామతీర్థస్వామి (1873-1906),

ఫతేగఢ్ మహాత్మా శ్రీరామచంద్రజీ (1873 - 1931),

కాశీలో త్రైలింగస్వామి (తెలుగువారు 1607-1887), 

ప్రకాశానంద (తెలుగువారు (1871-1963)

అక్కలకోట స్వామి సమర్థులు (? - 1878), 

షేగాఁవ్ గజానన్ మహారాజు (? -1910),

తాజుద్దీన్ బాబా (1861-1925),

గోందావళేకర్ మహారాజు (1845 - 1913),

శ్రీ వాసుదేవానంద సరస్వతి (1854 -1914),

బాబా జాన్ (? - 1931),

ఉపాసనీ బాబా (1870 - 1941),

గులాబ్ రావు మహారాజు (1880 -1914),

ఖేడ్గావ్ భేట్ నారాయణ మహారాజు (1885 -1945),

నిత్యానంద స్వామి - గణేశపురి (? - 1961),

కర్ణాటకలో మాణిక్యప్రభువు (1817 -1865),

కోమటి వెంకమ్మ (తెలుగువారు ? - 1862),

జ్ఞానానంద మహారాజు (1824 -1974),

గురు సిద్దారూఢులు (1836 -1929),

కన్యాకుమారి అమ్మ, రమణమహర్షి (1879 -1950),

కేరళలో చత్తంపి స్వామిగళ్ (1853 -1924),

తెలుగు దేశంలో పరమానందయతి (1650 - 1750),

దూదేకుల సిద్దయ్య (1665 - 1735),

గుంటూరు నల్లమస్తాన్ (1685 -1885),

ప్రభల భోగీశ్వరులు (1700 - 1750),

రామడుగు శివరామ దీక్షితులు (1700-1770),

ఈశ్వరమ్మ (1703-1803),

పలుగురాళ్ళపల్లె గోవిందస్వామి (1729 - 1789),

అనుమసముద్రం నాయబ్రసూల్ (? - 1762),

మిట్టపాలెం నారాయణస్వామి (? - 1750),

కసుమూరు  మస్తానయ్య (? -1750),

తరిగొండ వెంకమ్మ (1730 - 1817),

కైవారం అమరేనారేయణ స్వామి (1730 -1840),

తుంగదుర్తి బుచ్చయ్య (1760-1854),

పేనకచెర్ల చితంబరస్వామి (1772-1872),

నీలకంఠ సచ్చిదానంద ఘనేంద్రులు (1788-1907),

ధర్మవరం చిరుమామిళ్ళ సుబ్బదాసు (1802-1882),

మచిలీపట్నం దొంతులమ్మ (1807-1932),

ఆదోని తిక్క లక్ష్మమ్మ (1815-1993),

కలశపాడు ఇందూరు అప్పయ్య (1817-1877),

లింగాలదిన్నె బ్రహ్మస్వామి (1820-1890),

చేళ్ళగురికి ఎఱ్ఱస్వామి (1822-1895),

సత్తెనపల్లి పీర్జీ మహర్షి (1829-1889),

చిప్పగిరి భంభంస్వామి (1833-1911),

ధాభా కొండయాచార్యస్వామి (1834-1939),

సనారీ విశ్వనాథావధూత (1850-1916),

నెమిళ్ళదిన్నె హుసేన్ గురుడు (1850-1929),

గోవర్ధనగిరి మద్దయ్యస్వామి (1850-1940),

నాగండ్ల ప్రతాపకోటయ్య శాస్త్రి (1854-1896),

భద్రాచలం గోవిందస్వామి (1855-1927),

రేపల్లె చిన్నమ్మ (1857-1956),

బనగానపల్లె హంసానంద సరస్వతి (1859-1979),

గడికోట సచ్చిదానంద పరమహంస (1865-1957),

మాదిరాజు వెంకట అప్పారావు (1859-1935)

బ్రహ్మానంద సరస్వతీ స్వామి (1863-1938),

నెల్లూరు నిత్యానందస్వామి (1864-1936),

దీపాలదిన్నె పాటిబండ్ల వీరయ్య (1867-1922),

నార్పల తిక్కయ్యస్వామి (1870-1951),

తాండూరు ఆబ్దుల్షా కరీంవలీ (1870-1947),

కదిరిమంగళం మునీంద్రస్వామి (1876-1961),

కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని (1876-1936),

బాపట్ల బ్రహ్మానంద తీర్థులు (1879-1918),

బందరు రంగావధూత (1880-1905)

శేషాద్రి స్వామి (1870 - 1929) ,

పోలీపురం యోగానంద నరసింహస్వామి (1798-1899),

ఓరుగల్లు' పరశురామపంతుల లింగమూర్తి (1710 -1800),

లింగందిన్నె ధరణి సీతారామయోగీంద్రులు (1714 - 1776),

ఎల్లారెడ్డిపేట హజ్రత్ ఇమామలీ బాబా (1825-1934),

తమిళదేశంలో సదాశివ బ్రహ్మేంద్రులు (తెలుగువారు 1638 -1738),

పుదుక్కోట జడ్జి స్వామి (తెలుగువారు 1850 - 1915),

చివలింగాయపాలెం ఉన్నవ ఆనంద రామదాసు (1855-1935),

మహేంద్రవాడ రెడ్డి సుబ్రహ్మణ్య మహర్షి (1860-1949),

కుంభకోణంలో మాస్టర్ సి.వి.వి. (తెలుగువారు 1868 - 1922),

కుర్తాళం మౌనస్వామి (తెలుగువారు 1868 - 1943),

కొత్తలంక పయ్యద్ అహ్మదలీషా ఖాదర్వలీ (1868-1948),

కురుమద్దాలి మాల పిచ్చమ్మ అవధూత (1870-1951),

ఓబుళరాజు పల్లె నారాయణరెడ్డి అవధూత (1834-1915), 
Share:

3 comments:

  1. Present evarina vunnara avaduthalu.

    ReplyDelete
    Replies
    1. Vunte, rompicharlasaichaitanya@gmail.com ki mail cheyandi

      Delete
  2. Mahaavtaar Babaji jeevita Charitra book in Telugu is required how to get it

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List