సాధారణంగా కనిపించినా ఆణిముత్యం లాంటివారు" అలాంటి వజ్రమే *💎శరీతపోవన్ మహారాజ్!.💎*
శ్రీ తపోవన్ మహారాజ్ ను స్వామీ శివానందులవారు "హిమవత్ విభూతి"గా తెలిపారు. తపోవన్ మహారాజ్ అంటే తెలియని వారు ఉండవచ్చును. ఆయన చిన్మయానందుల వారి గురువు అంటే అందరికీ అర్థమవుతుంది.
కుంచమ్మ, అచ్యుతన్ నాయర్లకు 1886 మార్గశిర శుక్లపక్ష ఏకాదశినాడు ఈయన జన్మించారు. చిన్నతనంలోని పేరు చీప్పుకుట్టి. చిన్నతనం నుండి తాను చేసుకున్న విగ్రహాలను పూజించటానికి ఇష్టపడే వారు.
ఒక "ఆంగ్లపాఠశాలలో ఆ బాలుని చేర్చారు. కానీ,
ఆ పాఠశాలను ఆతడు ఇష్టపడలేదు, కేవలం ప్రాపంచిక చదువులంటే, ఆ చిన్నతనంలోనే ఆతనికి ఇష్టం లేకపోయింది. పాఠశాలను మానుకున్నందుకు తండ్రి చింతించాడు. ఇంటివద్దనే చదువుకు అన్ని ఏర్పాట్లు చేశాడు తండ్రి. మలయాళం, సంస్కృతం, ఆంగ్లములలో పట్టు సాధించాడు. అనర్గళంగా మాట్లాడగలడు, నిరాఘాటంగా చర్చించగలడు. అయినా తృప్తి లేదు. వేదాంత గ్రంథాలను చదివినా అనుభవం కోసం తహతహ లాడాడు.
ప్రకృతి ఆయనను పరవశింపచేసేది. నక్షత్రాలను పరచిన ఆకాశం, చంద్రదీపంలో వెలుగుతుంటే, మనసులో దైవ చింతనను రేకెత్తించేది. తన తమ్ముడు కుటుంబ బాధ్యతలను స్వీకరించగగల స్థితికి రాగానే, ఇక ఇల్లు వదలివేశాడు సత్యాన్వేషణ చేయసాగాడు అనేకమందిని కలిశాడు. ఒక సన్యాసి వద్ద అధ్యయనం చేయసాగాడు.
తనకు సన్యాసదీక్ష ఇమ్మని కోరాడు. “నీకు సన్యాసాశ్రమం దేనికి? మానసికంగా నీవెప్పుడో సన్యాసివి” అన్నాడాయన. చివరకు తనకు తానే సన్యాసదీక్ష తీసుకున్నాడు 'త్యాగానంద' అయ్యాడు.
రిషికేశ్ లోని కైలాసాశ్రమవాసి స్వామి జనార్ధనగిరి ఆయనకు దీక్షనిచ్చి "స్వామి తపోవన్" గా నామ కరణం చేశారు. తపోవనం అంటే కఠిన నియమాల కారడవి అని అర్థం. ఆ పేరు ఆయనకు సరిపోయినదే అయింది. మట్టి గదిలో ఉండేవాడు. ఒంటిపూట భోజనం చేసి, నీరుగడ్డ కట్టే శీతాకాలంలో కూడా రెండుపూటలా గంగాస్నానం చేసేవారు.
తన వస్తువులంటూ ఏమీ ఏర్పరుచుకొనలేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరి మన్ననలను పొందాడు.
సహజీవనం :
ప్రకృతిని ప్రేమించటం వేరు, ప్రకృతిలో జీవించటం వేరు. ఆయన వద్దకు ఎందరో సందర్శకులు వచ్చేవారు. వారిలో ఒకరు గంగాప్రసాద్, ఆయన కుటుంబంతో స్వామి దర్శనానికి వచ్చాడు. ఇక వెళ్ళబోయేసమయంలో గంగా ప్రసాద్ గారి సోదరిని మీరెంతమంది వచ్చారు అడిగారు. ఆ చిన్నపిల్లతో పాటుగా, తాను కూడా అందరినీ వేళ్ళతో లెక్కించ సాగాడు. ఒకటి, రెండు... అంటూ ఒక ఆశ్రమవాసిని పిలిచి ఏడు బత్తాయిపండ్లు తెప్పించి ఆమె గౌనులో వేశాడు.
ఆ పిల్ల ముందుగా బయలుదేరింది. అక్కడున్న కోతులు ఆమెను చుట్టుముట్టాయి. కేకలు వేసింది. పండ్లను తీసుకొని కోతులు చెట్టెక్కి కూర్చున్నాయి. ఆమె కేకకు అందరూ వచ్చారు. ముందుగా వచ్చింది తపోవన్ స్వామియే.
పరిస్థితి గ్రహించాడు. “రామ్ రామ్" అంటూ స్వామి కోతులను పిలిచాడు. అవి చెట్లు దిగి వచ్చాయి, “రఖో, రఖో'' అన్నారాయన. ఆ కోతులు తీసుకున్న పండ్లను క్రింద పెట్టాయి. “పీచే, పీచే” అన్నారు స్వామీజీ. అవి వెనుకకు అడుగులు వేశాయి, ఒక ఆశ్రమవాసిని పిలిచి బత్తాయిల బుట్టను తెమ్మన్నారు. స్వామీజీ ఇచ్చిన ఒక్కొక్క పండును, ఒక్కొక్క కోతి వరుసగా వచ్చి తీసుకుని వెళ్ళిపోయాయి.
"ఇదే ప్రకృతిలో సహజీవనం అంటే!
ప్రకృతి భగవంతుడిని చూపే ద్వారము!
భగవంతుడే సత్యము! అందమే సత్యము"
హిమాలయాలలో విహారం అనే గ్రంధాన్ని స్వామీజీ సంస్కృతంలో రచించారు. ఇంకా 'ఆత్మకథ'ను ఈశ్వరదర్శనం అనే పేరుతో రచించారు.
'కోవెల ఎరుగని దైవం'గా కీర్తింపబడిన తపోవన్ మహారాజును స్మరించెదము గాక!.

No comments:
Post a Comment