కార్తీకమాసంలో శివాలయాన్ని దర్శనం చేసుకునే విధానం.. శివాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఏంచేయాలి. ~ దైవదర్శనం

కార్తీకమాసంలో శివాలయాన్ని దర్శనం చేసుకునే విధానం.. శివాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఏంచేయాలి.

కార్తీకమాసం అంటే సాక్షాత్తు ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టం. ప‌ర‌మేశ్వరుడు మ‌హా లింగ రూపంలో ఆవిర్భవించాడ‌ని చెబుతారు. అంత‌టి విశిష్టమైన కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళేటప్పుడు ఆచ‌రించాల్సిన విధి విధానాల్ని నిగ‌మ శాస్త్రములు వివ‌రిస్తున్నాయి. ఆగ‌మం అంటే దైవిక క్రియ‌లు అని అర్థం. నిగ‌మ శాస్త్రములు అంటే మాన‌వుడు ఆచ‌రించాల్సిన విధులు అని అర్థం. 
.
శివాలయానికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ ,మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుబ్రపరచుకొని దర్శించుకున్తున్నాము. శివాలయం దగ్గర శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఆ పై మూడు సార్లు నోటిని పుక్కిలించేది వాక్కుకు కారణమైన నాలుక, నోరు, చెవులు పరిశుభ్రం చేసుకున్నామని, ఇకపై పదుగురికి ఆమోదయోగ్యమైన పలుకులనే పలుకుతామని, వింటామని భగవంతునికి తెలియచెప్పటం. మనిషి సర్వ ఆలోచనలకీ, చేష్టలకి శిరస్సే కారణం. అలాంటి శిరస్సున నీరు చల్లుకొని పవిత్రులమయ్యామని అంతకుమించిన పవిత్రుడైన నిన్ను పూజించటానికి వస్తున్నామని భగవంతునికి చెప్పటమే పరమార్థం.
విభూతిని బొటన వేలితో కుడి నుంచి ఎడమ వైపుకు పెట్టుకొని మధ్య వేలితో సరిచేసుకోవాలి. ఆ పై మధ్య మూడు వేళ్ళతో పెట్టుకోవాలి . తల స్నానం చేసినప్పుడు తడి విభూతి , మాములు స్నానం చేసిన వారూ పొడి విభూతిని ధరించాలి.
.
“ప్రదక్షిణం ” లో “ప్ర” అనే అక్షరము పాపాలకి నాశనము, “ద” అనగా కోరికలు తీర్చమని, “క్షి” అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మ జ్ఞానము ఇమ్మని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వా ప్రదిక్షణ అవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నాని అర్థం. పరమేశ్వరుని ఆలయంలో చేసే అభిషేకాల పవిత్రగంగా చిన్న కాలువ ద్వారా బయటికి వెళుతుంది. ప్రదక్షిణాలు చేసేవారు స్వామి ధ్యానంలో ఆ విషయం పట్టించుకోక ఆ కాలువ దాటుతుంటారు. గంగను అలా దాటినట్టే. అందుకే ఆ విషయం గమనంలో పెట్టుకొని పాపనాశనములైన ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి. శివాలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సోమసూత్రాన్ని దాటకూడదు. సోమసూత్రం ఇవతల నుంచి ధ్వజస్తంభం వరకూ, ధ్వజస్తంభంనుంచి మళ్ళి ప్రదక్షిణగా సోమ సూత్రం వరకూ , అక్కణ్నుంచి వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకూ, ధ్వజస్తంభం నుంచి ముందుకు కదలి సోమసూత్రం వరకు , తిరిగి మళ్ళి వచ్చిన దిశగా ధ్వజస్తంభం వరకూ , మళ్ళి అలానే ధ్వజస్తంభంనుంచి సాగి సోమసూత్రం వరకూ, తిరిగి సోమసూత్రం నుంచి వెనుక ధ్వజం వరకూ , అక్కడి నుంచి ముందుకు సోమసూత్రం వరకూ, సోమసూత్రం నుంచి ధ్వజం వద్దకూ, ఆ పై శివాలయ ధ్వజస్తంభం ఎడమ పక్క వెళ్ళాలి. అదే చండప్రదక్షిణ. రెండో సారి ప్రదక్షిణ చేస్తే ధ్వజ స్తంబాన్ని తాకరాదు.
.
పరమేశ్వరుని ఆలయములో నవగ్రహాలు వుంటాయి. చాలా మందికి ముందు ఎవరిని దర్శించుకోవాలో అని ఒక్కింత సందిగ్థత వుంటుంది. మహేశ్వరుడు ఆదిదేవుడు. పాలకుడు. కర్తవ్యాన్ని బోధించేది శివుడు. ముందుగా శివుణ్ణి దర్శించుకోవాలి. లేదా నవగ్రహాలను దర్శించిన, శివుడి కరుణకు ఎలాంటి ఇబ్బంది వుండదు. అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రహాలు తమ స్వామిని ముందుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి .
.
శివాలయంలో గట్టిగ నవ్వడము, అరవడము, ఐహిక విషయాల గురించి మాటలాడడం చేయరాదు. గుడి పరిసరాలని పరిశుబ్రంగా ఉంచాలి. శివలింగాన్ని కనులార వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయం లో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమ వైపు, అమ్మవారికి నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive