మంత్ర శక్తిని 'రేఖాబద్ధం' చేసేది 'యంత్రం'. (geometrical interpretation) అని అనవచ్చు. రేఖల ద్వారా దైవశక్తిని ఆవిష్కరించే పద్ధతి యంత్ర నిర్మాణంలో ఉంది. చతురస్రం, వృత్తం, కోణాలు, బిందువు, పద్మదళాలు... ఇవి ప్రధానం. వీటి అమరికలు ఒక్కొక్క యంత్రంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఆ అమెరికాల వల్ల ఏర్పడే ఆవృతులను ఆవరణాలంటారు. ప్రతి ఆవరణలో దేవతామూర్తులు, వాటి మంత్రబీజాలు ఉంటాయి. కనుక దేవతామూర్తి - 1. మంత్రం ద్వారా, 2. యంత్రం ద్వారా అభివ్యక్తీకరింపబడుతుంది. మూడవది విగ్రహం. మన దేవాలయ సంస్కృతిలో విగ్రహప్రతిష్ఠ మంత్ర, యంత్రశక్తులతో కూడి ఉంటుంది. దేవతారూప చిత్రణలో కూడా మంత్ర యంత్ర శక్తులే ప్రకటింపబడతాయి. ఇక యజ్ఞం అంటే ఆరాధించడం, అర్పించడం. దేవ ప్రీతికరంగా ఆరాధించి అర్పించే భావన దేవయజ్ఞం, పితృప్రీతికరమైన కర్మ పితృయజ్ఞం, మనుష్య, భూత, ఋషి గణాలకు ప్రీతి కలిగించే కర్మలను, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ, ఋషియజ్ఞాలని అంటారు.
No comments:
Post a Comment