తృతీయ అధ్యాయము - కార్తికమాస స్నాన మహిమ.
జనక మహరాజా! కార్తిక మాసమున యే ఒక్క చిన్నదానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క,పిల్లిగా జన్మింతురు.అధమము కార్తికమాస శుక్ల పార్ణమి రోజునయిననూ స్నానదాన జపతపాదులు చేయక పోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకింపుము.
బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట.
ఈ భారతఖండమందలి దక్షిణ ప్రాతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపఃశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వటవృక్షంబుపై భయంకర ముఖములతోను, దీర్ఘ కేశములతోను, బలిష్టంబులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము జేయుచుండిరి. తీర్థ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికియథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పఠించుచు "ప్రభో! ఆర్తత్రాణపరాయణ! ఆనాధరక్షకా! ఆపదలోనున్న గజేంద్రుని, నిండుసభలో అవమానాలు పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రీ!"యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులుకు జ్ఞానోదయం కలిగి "మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు" యని ప్రాధేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని "ఓయీ! మీరెవరు? ఎందులకు మికీ రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడు" యని పలుకగా వారు "విప్రపుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపదా కలగదు" అని అభయమిచ్చి, అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును యీ విధముగా చెప్పసాగెను."నాది ద్రావిడ దేశం. బ్రహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయవిచక్షణలు మాని పశువువలె ప్రవర్తించితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యంగా ధనంలాగుకోనుచు, దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరచుచు, లుబ్ధుడనై లోకకంట కుడిగానుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతొ పదార్ధసంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని యింటినుండి గెంటివేచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి "ఓరి నీచుడా! అన్యాక్రాంతముగా డబ్బుకూడాబెట్టినది చాలక, మంచిచెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామాగ్రిని దోచుకొంటివిగాన, నివు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశములలో నుందువు"గాక! యని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైన తప్పించుకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా! కాన నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్ధించితిని. అందుల కాతాడు దయదలచి "ఓయీ! గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు. నీవందు నివసించుచూ యే బ్రాహ్మణుడు కార్తికవ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణునివలన పునర్జన్మ నొందుదువు గాక" యని వెడలిపోయెను. ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్నూ నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.ఇక రెండవ రాక్షసుడు "ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మణుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను బాధించివారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా యనునటులచేసి, వారి యెదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి యెరుగును, నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన, నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపపంకిలము నుండి ఉద్దరింపుము" అని బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమునుయిటుల తెలియజేసెను. "మహాశ ! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నానమైననూ చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక, భక్తులు గొనితెచ్చిన సంభారములను నా వుంపుడుగత్తెకు అందజేయుచు మధ్యమాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము యీ రూపమును ధరించితిని, కావున నన్ను కూడా పాపవిముక్తుని కావింపు"మని ప్రార్ధించెను. ఓ జనక మహారాజా! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి "ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోరకృత్యంబులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతును"యని, వారినోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతనావిముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసరూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంటమునకేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన, ఎంత ప్రయత్నించైనాసరే కార్తిక స్నానాలనాచరించాలి.
ఇట్లు స్కాందపురాణాంతర్గత, వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యముందలి మూడవ రోజు అధ్యాయము -మూడవ రోజు పారాయణము సమాప్తము. సమాజం కల్లోల భరిత మైనప్పుడు కవి బాధ్యత పెరుగుతుంది.తన కవిత్వం తో దిశానిర్దేశం చెయ్యాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.ఆ సంక్లిష్ట పరిస్థితి లో తనదైన మార్గం లో సమాజానికి మేలుకొలుపు. పాడిన కవి, కాలానికి అతీతంగా జాతి జనుల గుండెల్లో నిలిచి పోతాడు.దీనికి నిదర్శనం కవిబ్రహ్మ తిక్కనే.
అప్పటి కాలం లో తెలుగు నేల శైవ,వైష్ణవ మత ప్రచారాలకు వేదికైంది.రెండు వర్గాల వాళ్ళూ తమ విశ్వాసాలు గోప్పవంటే తమవి గొప్పవని విడిపోవడం అప్పటి సమాజం లో కనిపించినప్పుడు,ఆ తారతమ్యాన్ని తొలగించే ప్రయత్నం లో తిక్కన తెలుగు తోటలో ఒక దేవుడిని ప్రతిష్ఠించాడు.ఆ దైవం
హరిహర నాథుడు.తిక్కన భారతాన్ని ఈ దేవుడికే అంకితమిచ్చాడు.ఆయన తనకు కలలో కనిపించిన హరిహరనాథుని రూపాన్ని యిలా ప్రార్థించాడు.
.
కిమస్తిమాలాం కిము కౌస్తుభం వా
పరిస్క్రియాయాం బహుమన్య సేత్వం
కిం కాలకూటః కిం వా యశోదా స్తన్యం
తవ స్వాదు వద ప్రభూ మే
నీకు పుర్రెల మాల యిష్టమా?కౌస్తుభము యిష్టమా?కాలకూట విషము యిష్టమా?యశోదా స్తన్యం యిష్టమా?యిది పరిష్కరించు ప్రభూ!నీవెవరివో తెలుపు హరివా?హరుడి వా ?
తిక్కన మంత్రి తీర్చిదిద్దిన బాటలో నాచన సోమనాథుడు,కొరవి గోపరాజు,బైచరాజు వెంకట నాధుడు తదితర కవులు తమ కావ్యాలను హరిహరనాథుడి కే అంకితమిచ్చారు. హరిహర మూర్తులు కలిసిన దివ్య సుందర రూపం ఎలా వుంటుందో నాచన సోమనాథుడు తన 'ఉత్తర హరివంశం'. లో
అభ్రంకషం బైన యాల పోతు నీతండు త్రుంచినాడీతండు పెంచినాడు
సాధు సమ్మతముగా సామజంబు నితండు గాచినాడీతండు త్రోచినాడు
బహిర్ముఖార్థమై పర్వతేశు నీతండు దాల్చినాడీతండు వ్రాల్చినాడు
ఫణపరంపర తోడి పన్నగంబు నీతండు మెట్టినాడీతండు సుట్టినాడు.
నేడు నాడును నాడును నేడు మనకు
జూప జెప్పంగ జెప్పంగ జూప గలిగె
ననుచు కొనియాడు సంయమి జనుల కొదవె
రజితగిరిమీద హరిహరాధనంబు.
వర్ణించింది హరిహరనాథుడిని కదా!అతనెలా వున్నాడంటే ఒకవైపు భాగమేమో బాగా ఏపుగా వున్న
అభ్రంకషం అంటే చాలా ఎత్తయిన ఆలపోతును చంపిందట,(కృష్ణావతారం లో అరిష్టాసురుడనే ఎద్దురూపం లో వచ్చిన రాక్షసుడిని సంహరించినాడు)యింకో వైపు రూపమేమో ఎద్దును పెంచుకుంది (నంది వాహనా రూడుండయిన హరుడే.అదే రూపం లో ఒక భాగమేమో(సామజమును ) ఏనుగును కాచిందట,(గజేంద్ర మోక్షణ లో)మరో వైపు ఏనుగును తోసేశాడట.గజాసురు డిని చంపటం.యిది శివరూపం.ఇంకా ఒకవైపు
పర్వతేశుడిని తాల్చిన రూపమట,గోవర్ధనగిరి నెత్తిన కృష్ణుడి రూపము,యింకో వైపు పర్వతాన్నే(మేరు పర్వతాన్ని) విల్లుగా చేసుకున్న శివుడిది,పడగల వరసతో వున్న పన్నగాన్ని ఒకాయన మెట్టాడట ఆయన శేషతల్పం మీద పవళించిన హరి,ఇంకొకాయన యేమో భుజంగాన్ని చుట్టుకున్నాడట.ఆయన
కైలాసాధీశు డైన హరుడు.యిద్దరూ కలిసిందే హరిహర రూపం.ఈ విధంగా రజతగిరి పైన హరిహరాధానం చేసే భాగ్యం మనకు కలిగించాడు సోమన
రెండు మూర్తులు కలిసిన రూపాన్ని రెండు అవతారాలకు సమానంగా వుండే అంశాలతో పోలిక పెట్టాడు.
నాచన సోమన.అంతేనా సంస్కృత మణులు,తెలుగు పగడాలను ఒడుపుగా ప్రయోగించి
మణిప్రవాళంలో రచించాడు.శివకేశవులకు యిలా అభేదం చెప్పడం లో సోమన చూపిన ప్రతిభ అసామాన్యం.

No comments:
Post a Comment