క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీ.పూ 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని పి ఎల్ గుప్తాతో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. క్రీ.శ ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే పాణిని తన అష్టాధ్యాయి గ్రంధంలో నాణేల ప్రస్తావన తెచ్చాడు. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వాడైన కౌటిల్యుడు అర్థశాస్త్రంలో దొంగనాణేలను గురించి, సీసం గనుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి దేశంలో పంచ్‌మార్క్‌డ్ నాణేలు నాల్గవ శతాబ్దానికే చెలామణీలో ఉన్నట్టే. లేదంటే కొంచెం ముందు నుంచి ఉండవచ్చు. ఇది అందరూ అంగీకరిస్తున్న చారిత్రక సత్యం.అయితే ఎవరు విడుదల చేశారో చెప్పడానికి ఆధారాలు లేవు. మన కృష్ణాజిల్లా సింగవరంలో లభ్యమైన వెండి నాణేల పరిస్థితి కూడా ఇదే. నాణేలు చరిత్రకు అద్దంపట్టే సాక్ష్యాలు. పల్లవుల పరిపాలనా దక్షత, చోళుల వైభవం, నవాబుల విలాసం, కృష్ణదేవరాయల కీర్తి, ఆంగ్లేయుల రాజభక్తిని చాటేవి నాణేలే. స్వాతంత్య్రానంతరం కూడా వీటి ప్రాధాన్యం తగ్గలేదు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నేతలు, ఘటనలు, విప్లవాలను నాణేలుగా తీసుకువచ్చింది. స్మృతికీ, పంపిణీకి వేర్వేరుగా ముద్రించడం ప్రారంభించింది.
Home »
» 850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై వరాహ బొమ్మ.
No comments:
Post a Comment