కాశీ ఖండం -38 ~ దైవదర్శనం

కాశీ ఖండం -38

నవదినా లలో రెండవ రోజు కార్య క్రమం

రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర ,అన్నపూర్ణా దర్శనం చేయాలి .మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా ఘట్టం లో స్నానం చేయాలి .తీర్ధ శ్రాద్ధం  చేయాలి వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి .గురు ఉపదేశం తో‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయనమః ‘’అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి .మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి .

             మూడో రోజు కార్యక్రమం

తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి .తర్వాతా దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరుకూడా ఉంది .ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి .వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి .పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి ‘’కిరణ ,దూత పాపాచ –పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునాచైవ –పంచ నద్యోత్ర కీర్తితః ‘’అని స్మరిస్తూ స్నానం చేయాలి .తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి .మణి కర్నేశుని ,సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి .అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి .రాత్రికి పాలు ,పండ్లు మాత్రమె స్వీకరించాలి .

                    నాల్గవ రోజు

ఉదయమే గంగా స్నానం విశ్వేశు దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన   కాల భైరవుని ,పూజించాలి కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి ‘’ఓం కాశ్యైనమః ‘’అని 36సార్లు అనుకోవాలి తర్వాతా బిందు మాధవుని దర్శించాలి .గుహను ,భవానీ దేవిని దర్శించాలి ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి భోజం చేయాలి .రాత్రి నామ స్మరణ పాలు ,పండ్లు ఆహారం .అంటే ఈరోజు పది దర్శనాలన్న మాట

                   అయిదవ రోజు

ప్రాతహ్ కాలమే  గంగా స్నానం చేసి ,కేదారేశ్వరుని దర్శించి ,అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి .తర్వాతా తిలా భాన్దేశ్వర ,చింతా మణి గణపతి నిసందర్శనం చేయాలి .దుర్గా దేవిని చూసి ,ఒడి బియ్యం దక్షిణా సమర్పించి ,గవ్వలమ్మ ను చేరి అదే విధం గా పూజ చేయాలి .ఈమెనే కౌడీబాయి అంటారు .అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి ,భోజనం చేసి రాత్రి పాలు ,పండ్లు తీసుకోవాలి

                                 ఆరవ రోజు

సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది ,వైధవ్యం ఎన్ని జన్మ లకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి ,బేసి సంఖ్యలో జనానికి  వాయన దానాన్ని చేయాలి .వ్యాస కాశీ చేరి వ్యాసుని రామ లింగేశ్వరుని శ్రీ శుకులను దర్శించి ,కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి .తర్వాత భోజనం చేయాలి .రాత్రి సంకీర్తన తో కాల క్షేపం చేసి పాలు పండ్లను స్వీకరించాలి

                       ఏడవ రోజు

గంగాస్నానం ,నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి .దొరక్క పోతే నూట ఎనిమిది తో సరి పెట్టుకోవాలి .ఇరవై  ఒక్క ఉన్ద్రాల్లను  ,నూట ఎనిమిఎనిమిది యెర్ర పూలతో పూజించాలి . .ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తామ్బూలాలివ్వాలి .  డుంది వినాయకుడిని అర్చించి ,అన్నపూర్నాలయం లో కుంకుమ పూజ చేయించాలి .అమ్మవారికి చీరా జాకెట్టు ,ఒడి బియ్యం ,గాజులు సమర్పించాలి .ఇలాగే విశాలాక్షి కీ చేయాలి .విశ్వేశునికి అభిషేకం చేయాలి .సహస్ర పుష్పార్చన ,సహస్ర బిల్వార్చన ,హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి .హర సాంబ హర సాంబ అంటూ పదకొండుసార్లు జపం చేయాలి .

                 ఎనిమిదో రాజు

గంగాస్నానం నిత్యపూజా తర్వాతకాల భైరవుడిని దర్శించి వడలు ,పాయసం నివేదించాలి . ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి .ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి . అయిదుగురు యతులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి దక్షిణా తాంబూలం సమర్పించాలి భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ నిద్ర పోవాలి

                      తొమ్మిదో రోజు

గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్నాదేవిని దర్శించి పూజించి ,నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి .జ్ఞానులైన దంపతులను ఊజించి భోజనం పెట్టి దక్షిణలివ్వాలి ఆశీస్సులు పొందాలి .రాత్రి  అన్నపూర్నాష్టం చేసి నిద్ర పోవాలి .

                  పదవ రోజు కార్య క్రమం

నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్రనామ పూజ చేసి ,అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను గురు దంపతులను పూజించాలి అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List