శివలింగానికి మూడు భాగాలు ఉంటాయి. అట్టడుగు భాగం బ్రహ్మ-పిత, మధ్యభాగం విష్ణుపీఠం, పైభాగం శివపీఠం.
కొన్ని స్వయంభూ లింగాలు, కొన్ని నర్మదేశ్వరులు. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు మరియు 5 పంచభూత లింగాలున్నాయి. కేదార్నాథ్, కాశీ విశ్వనాథుడు, సోమనాథుడు, వైద్యనాథుడు, రామేశ్వరుడు, ఘృష్ణేశ్వరుడు, భీమశంకరుడు, మహాకాలుడు, మల్లిఖార్జునుడు, అమలేశ్వరుడు, నాగేశ్వరుడు మరియు త్ర్యంబకేశ్వరుడు - ద్వాదశ జ్యోతిర్లింగాలు. కాళహస్తీశ్వరుడు, జంబుకేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు, కాంచీపురంలోని ఏకామబరేశ్వరుడు మరియు చిదంబరంలోని నటరాజు పంచభూతలింగాలు. మధ్యార్జున గా పిలువబడే తిరువిదైమరుదుర్ లో ఉన్న మహాలింగ ఆలయం దక్షిణభారతదేశంలో గొప్ప శివాలయం.
స్పటికలింగం కూడా శివుని చిహ్నమే. శివారాధనకు లేదా శివపూజకు దీన్ని నిర్దేశిస్తారు. అది స్ఫటికశిలతో చేయబడి ఉంటుంది. దానికి తనకంటూ ఒక రంగు ఉండదు కానీ దానికి దగ్గరగా ఉన్న వస్తువుల రంగును తీసుకుంటుంది. అది నిర్గుణపరబ్రహ్మాన్ని, లేదా నిర్గుణ పరమాత్మాన్ని మరియు నిర్గుణ శివుడిని సూచిస్తుంది.
నిజాయతీ గల భక్తునకు శివలింగం అంటే ఒక శిల కాదు. అది సమస్తమైన తేజస్సు, చైతన్యం. ఆ లింగం అతడితో మాట్లాడుతుంది, ధారాళమైన కన్నీటిని కార్పిస్తుంది, గగుర్పాటు కలిగిస్తుంది, హృదయాన్ని కరిగిస్తుంది, అతడిని శరీరిక స్పృహ నుంచి పైకి తీసుకువస్తుంది మరియు భగవంతునితో సంభాషించి, నిర్వికల్ప సమాధిని పొందేలా చేస్తుంది. శ్రీ రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని అర్చించాడు. విద్వాంసుడైన రావణుడు శివపూజ చేశాడు. లింగంలో ఎంత అద్భుతమైన శక్తి ఉండి ఉంటుంది!
మీరంతా మనస్సుకు ఏకాగ్రతను ఇచ్చి, శిష్యునకు ప్రారంభంలో మనస్సు ఆయన వైపు వెళ్ళేలా చేసే శివుని చిహ్నమైన లింగపూజ ద్వారా నిరాకరుడైన శివుని పొందుగాక!

No comments:
Post a Comment