భక్తుల కోర్కెలు తీర్చడానికి నల్లమల ప్రాంతంలో వెలసిన సూర్యనారాయణ స్వామి ...
ఆరోగ్యం, జ్ఞానం, ఐశ్వర్యని ప్రసాదించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ...
ఆరోగ్యం, జ్ఞానం, ఐశ్వర్యని ప్రసాదించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ...
వేదకాలంలోనూ తదనంతరం అంటే ద్వాపర యుగం దాక ముల్లోకాలకు అధిపతి అయిన సర్వేశ్వరుడు మానవ రూపంలో ఈ పుడమి మీద నడయాడినట్లుగా మన హిందూ పురాణాల ద్వారా అవగతమౌతున్నది. ఆ కాలంలో దుష్టుల నుండి రక్షణకు, దైవ సాక్షత్కారంతో మోక్షం పొందేందుకు తమపు, యజ్ఞ యాగాదులే మార్గంగా ముముక్షువులు ఎంచుకోనేవారు తప్ప విగ్రహారాధన లేదని తెలుస్తోంది. వారు చేసిన మరో ఆరాధనా ప్రక్రియ సూర్య దేవుని కొలవడం.
పురాణాలలోని ముక్కోటి దేవతలలో ప్రతక్షంగా దర్శనమిచ్చేది దివాకరుదోక్కడే. సూర్యునికి అర్ఘ్యం సమ ర్పించుకోవడం సాక్షాత్ శ్రీ మన్నారాయనునికి సమర్పించుకొవడంగా భావించేవారు. సూర్య నమస్కారాలు కూడా ఆ కోవలోనివే. ప్రతక్ష నారాయణునిగా కీర్తించబడే ప్రచండ తేజోమూర్తి అయిన భాస్కరుడు మానవ జీవితాలలో ఎంతో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ప్రజాపతులలో మరియు సప్తరుషులలో ఒకరు అయిన కాశ్యపకుని భార్యలలో ఒకరైన అదితికి జన్మించినవాడే ఆదిత్యుడు.
సూర్యుని హరిహరుల సమానాంశగా పేర్కొంటారు. ఒకవిధంగా సూర్యుడు శ్రీహరికి అగ్రజుడు. ఎలా అంటే కృతయుగంలో శ్రీ మహావిష్ణువు, బలిచక్రవర్తి ని శిక్షించడానికి అదితి, కశ్యపులకు వామనునిగా జన్మించారని వామన పురాణం తెలుపుతోంది కదా !భానుని, వైకుంఠ వాసుని చతుర్వింశతి రూపాలలో ఒకటిగా పురాణాలు పేర్కొన్నాయి.
అందుకనుగుణంగానే సూర్యుడు కూడా చతుర్భుజునిగా శంకు చక్ర పద్మ అభయ హస్తాలతో గాయత్రీ , హరితి, బృహతి, హుష్నిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్ మరియు పంక్తి అనే ఏడు అశ్వాలు పూన్చిన బంగారు రధంలో దర్శనమిస్తారు. అదే శ్రీ హరికి రామావతార కాలంలో రావణునితో తలపడే ముందు విజయం సిద్దించాలని అత్యంత శక్తివంతమైన ఆదిత్య హృదయాన్ని తొలిసారిగా అగస్త్య మహర్షి ఉపదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, కర్నూలు జిల్లా, నందికొట్కూరు పట్టణంలోని సూర్యనారాయణ దేవాలయం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. ఇక్కడ సూర్య భగవానుడు ప్రజల చేత విశేష పూజలు అందుకుంటున్నాడు. క్రీ.శ 1080లో శ్రీ ఛాయఉష సమ్మేత సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని చాణిక్యరాజులు నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సూర్యుని దేవాలయాలు శ్రీకాకుళం జిల్లా అసరవెళ్లి గ్రామంలో మొదటిదిగాను, నందికొట్కూరులోని కోటావీధిలో రెండవ దేవాలయంలో ప్రసిద్ధి చెందింది. సూర్య పాలకులైన రాజులు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రశాంతత, గంభీరమైన, దట్టమైన నల్లమల ప్రాంతానికి ముగ్దులై ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు.
అప్పటి రాజులు సపరివార సమేతంగా దేవాలయానికి విచ్చేసి పక్ష మండల పూజలతో సూర్యపాశన చేసి ఆరోగ్య, జ్ఞాన, ఐశ్వర్య ప్రధాత సూర్య భగవానుని ఆశీస్సులతో రాజ్యపాలన చేసేవారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. చాణిక్యరాజుల అనంతరం 13 శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన పాలనాభివృద్ధి కృషిచేసిన సిరిసింగ దేవుడికి ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చారు. సిరిసింగ దేవుడు ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఎంతోపాటుపడి దేవాలయం కుడిభాగంలో శ్రీభ్రమరాంభికా మల్లికార్జున స్వామి, వీరభద్రస్వామి ఆలయాలను కాకతీయ శిల్ప నిర్మాణ పద్ధతిలో నిర్మించారు.
అనంతరం ప్రతాప రుద్రుడి అనుమతి మేరకు సాంప్రదాయ పద్ధతిలో నవనందులు పరివృత్తంగా చుట్టారని, దీంతో ఈ ప్రాంతానికి నవ నందికొట్కూరుగా పేరు వచ్చిందని చెబుతున్నారు. సిరిసింగ దేవుడు శివనామ సంబంధమైన కొన్ని గ్రామాలను తమ బంధువులకు దత్తతగా ఇచ్చారని, నవనందులు దాటి గ్రామాలు పెరిగినప్పుడు ప్రమాదం సంభవిస్తుందని పూర్వికులు వాపోతున్నారు. గత కొన్ని దశాబ్దాల కిందట ప్రమాదవశాత్తు సూర్యభగవానుడి విగ్రహం పగిలిపోవడంతో దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే అప్పటి గ్రామపెద్దల సహకారంతో పునరుద్ధరణకు చర్యలు తీసుకుని అపురూపంగా తీర్చిదిద్దడంతో దేవాలయానికి పూర్వవైభవం సంతరించుకుంది. ప్రతి ఏడాది మాగసుద్ద పంచమి మొదలుకుని సప్తమివరకు సూర్యనారాయణ స్వామికి ఆరుణ పారాయణం, హోమాలు, కళ్యాణ మహోత్సవాలు, ప్రత్యేక పూజలు జరుగుతూ ప్రజల కోరికలు తీర్చుతూ విశేష పూజలు అందుకుంటున్నారు.
No comments:
Post a Comment