మనమందరమూ తరచుగా పత్రికలలో వారఫలములు పక్ష ఫలములు మాస ఫలములు
12 రాసులకు వ్రాయుట చూచుచున్నాము. దీనికి విశేష ఆదరణ ఉన్నది . ఈ గోచార విషయమున ఫలములన్నియూ చంద్ర లగ్నమునుండి చెప్పబడును, అనగా ఫలములు చెప్పు సమయమున చంద్రుని స్థితి అతనినుండి ఇతర గ్రహముల ఉనికి ఆ రాసులు ఈ వివరములతో ఫలములు చెప్పుదురు.
సాధారణముగా జన్మ సయమున గల లగ్నము అందుండి ఇతరగ్రహముల స్థితి తెలుసుకొందుము. జన్మ సమయమున జరుగుచున్న దశ, శేషము తెలుసుకుని ఆ తరువాత వచ్చు దశలు అంతర్దశలు గుణించి గ్రహబలముల ననుసరించి ఫలములు చెప్పుదురు. ఇదియొక పధ్ధతి యిదియు విశష ప్రాచుర్యము సంతరించుకున్నది. ప్రశ్న సమయమున జరుగుచున్న దశ అంతర్ దశ ఆ గ్రహముల స్తితి బలములు దోషములు పూర్తిగా పరిసీలించివారి ప్రశ్నలకు సమాధానము చెప్పుచున్నాము .
గోచారమున ఫలములు చెప్పునపుడు అవి విస్త్రృతముగా, . అదివర్తించు వారి సంఖ్య ఎక్కువగా
నుండునను వాదన కలదు. ఈ భూమండలమున మానవ జనాభా సుమారుగా 600 కోట్లు పైననే ఉండును ఈ జనాభాను 12 రాసులకు విభజించ గా సుమారు 50 కోట్ల ప్రజలు ఒక్కొక్క రాశిలో ఉందురు.
మన గోచారవశమున ఫలములు చెప్పునపుడు ఆ ఫలములు ఈ 50 కోట్ల వారికి వారి వారి నక్షత్రముల పాదముల, డిగ్రీల, బట్టి ఫలములుండును. చెప్పిన ఫలములు ఏ కొద్దిమందికి మాత్రమే వర్తించునటుల తోచుచున్నది .కాని నేటి తరమున గోరాచఫలముకు బహుళ ప్రాముఖ్యము కలదు. అది ప్రజల నమ్మకమే కదా!
అదియే జన్మ కుండలి ననుసరించి ఫలములు చెప్పిననూ, ఒక లగ్నమున ఈ భూమండలమున సుమారు 40-50 వేల వరకు జన్మించుదురు. ఆ లగ్నమున జన్మించి వారికి దశాశేషము తదుపరి దశలు అంతర్దశలు ఒకేలా ఉండును. జన్మకుండలి ననుసరించి చెప్పు ఫలములు ఈ 40-50 వేలమందిక వర్తించును గాన ఈ విధానమే సత్ఫలములు చెప్పుటకు
అనువయినదని మరియొకరి వాదన. ఎవరివాదనకు వారికి సరియైన అధారములు శాస్త్ర సమ్మతముగా ఉన్నవి. ఒకటి మంచిదని వేరొకటి కాదని నిర్ధారణ చెయ్యలేము.
గోచారవశమున ఫలములను ప్రమాణిక గ్రంధములయందు శాస్త్రమున వివరముగా
చెప్పబడినది. రవి చంద్రుని నుండి 3 ,6 ,10 స్థానముల యందు శుభము చేయును.
చంద్రుడు జన్మ సమయమున ఉన్న చంద్రుని నుండి 1, 3 ,6 ,7 ,10 రాసులందు సంచరించుచున్నశుభుడు. గురుడు 2 ,5 ,7 ,9 స్థానములలో ఉన్న శుభుడు. శని మరియూ కుజుడు 3, 6, స్థానముల యందు శుభులు. బుధుడు 2, 4 ,6 ,8 ,10 స్థానములలో శుభములు కలుగజేయును.
శుక్రుడు 1, 2, 3 ,4 ,5 ,8 ,9, 11, 12, స్థానములలో శుభ ఫలము లిచ్చును.
రాహువు, కేతువు, రవి వలెనే 3, 6 ,10 ,11 స్తానములలో శుభులు
గ్రహములన్నియూ గోచారవమున ,11వ ఇంటనున్న శుభులని చెప్పిరి.
చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో సంచరించును. ఈ చంద్రస్థితిని బట్టి ఫలములు గుణించి చెప్పవలెను. ఏ పద్ధతి సరియైనదన్నది ఎప్పుడూ వివాదములతో కూడుకున్నదే.

No comments:
Post a Comment