కారకాంశక ద్వితీయాది స్థానఫలితములు ~ దైవదర్శనం

కారకాంశక ద్వితీయాది స్థానఫలితములు

కారకాంశకు ద్వితీయము కుజశుక్రుల షడ్వర్గమైన జాతకుడు పరస్త్రీరతు డగును.ఆ కుజ శుక్రసంబంధమున్న ఆ జీవితాంతము పరస్త్రీరతుడై యుండును.అక్కడ కేతువున్న పైన చెప్పిన ఫలముండదు.గురుడున్న స్త్రీరతు డగును.రాహువున్న ద్రవ్యనాశనమును జరుగును.కారకాంశకు తృతీయమున పాపగ్రహమున్న జాతకుడు వీర్యవంతు డగును.శుభగ్రహమున్న పిరికివాడగును.ఆత్మకారకుడు నవాంశకు చతుర్థమున - శుక్రచంద్రుల కలయికగాని,దృష్టిగాని,లేదా ఉచ్ఛగ్రహమున్నా,జాతకుడు మేడ కలవాడగును.ఆ చతుర్థమున గురుడున్న కర్రిల్లు శని రాహువులున్న రాతియిల్లు; కుజకేతువులున్న ఇటుకల ఇల్లు,రవియున్న పూరిల్లు;అని చెప్పనగును.అక్కడ చంద్రుడున్న జాతకునకు అనాచ్ఛాదితి (పై కప్పులేని)ప్రదేశమున పత్ని సంయెాగమగును.

*కారకాంశ పంచమ స్థాన ఫలితములు*
కారకంశకు పంచమమున కుజరాహువులున్న జాతకుడు క్షయరోగపీడితు డగును.చంద్రదృష్టియున్న తప్పక జరుగును.కుజుని దృష్టియున్న పిటకాది(పొక్కులు)రోగమును.కేతుదృష్టియున్న జలోదరరోగము లేదా గ్రహణి కలుగును.రాహుగుళికలు ఆ పంచమమున ఉన్న విషభయము చెప్పదగినది.ఆ పంచమమున బుధుడున్న విదేహుడు లేక దండిసన్న్యాసి యగును.రవి ఉన్న ఖడ్గధారి,కుజుడున్న కుంతధారి,శనియున్న ధనుర్ధారి,రాహువున్న లోహయంత్రములు తయారుచయువాడు అగును.కేతువున్న గడియారములు తయారు చేయువాడు,శుక్రుడున్న కావ్యకర్త,వక్త,కావ్యతత్వజ్ఞుడు అగును.

 *విశేషము*
ఆత్మకారకాంశకాని దానినుండి పంచమమునగాని చంద్ర గురులున్న జాతకుడు గ్రంథకర్త యగును.గురుడు మాత్రమేయున్న సర్వజ్ఞడగును.కుజుడున్న తర్కశాస్త్రవేత్తయు,బుధుడున్న  మీమాంసాశాస్త్రవేత్తయు,శనియున్న  పిరికి వాడను,రవియున్న గాయకుడును,చంద్రుడున్న సాంఖ్య,సాహిత్య,యెాగ,గానముల నెరిగినవాడును,రాహుకేతువుతులున్న గణిత జ్ఞుడును అగును.వీటిలో గురుసంబంధమున్న సంప్రదాయముగా శాస్త్రమునెరిగిన వాడగును.కారకాంశకు ద్వితీయమునుండియు ఈ ఫలములు వచ్చునని కొందరాచార్యులనిరి.
*మీ మిత్రుడు యస్.నాగేశ్వరశర్మ(ప్రకాష్)*
🙏🙏🙏🙏🙏
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive