సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ~ దైవదర్శనం

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా.....    అమ్మా...... సౌభాగ్యలక్ష్మీ!!!!

 నుదుట కుంకుమ   రవి బింబముగ  కనులనిండుగా కాటుక వెలుగ
కాంచన హరంము గళమున మెరియగ
పీతాంబరముల శోభలు నిండుగా,
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా......

నిండుగ కరముల బంగారు గాజులు
ముద్దులకు లొలుకు వాదమ్ములమువ్వలు
గలగలమని సవ్వడి జేయగ సౌభాగ్యవతుల
సేవలనందగా,,
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా...అమ్మా .....
సౌభాగ్యలక్ష్మీ.....

నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల
మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండుగా కనకవృష్టీ కురిపించేతల్లి
 సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా||

జానకి రాజుని ముద్దుల కొరివితో
రవికుల సోముని రమణీమణీవై
సాధు సజ్జనుల పూజలందుకొని
శుభముల నిచ్చెడి దీవేనలీయగ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా||

కుంకుమ శోభిత పంకజ లోచని
వెంకటరమణుని పట్టపు రాణి
పుష్కలముగా సౌభాగ్యములిచ్ఛే
పుణ్యమూర్తి
మా ఇంటను వెలయగ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా||

భాగ్యముల బంగారు తల్లి పురందర
విఠలుని పట్టపు రాణి
శుక్రవారం(ప్రతి నిత్యం) పూజలందగా సాయంకాలం
శుభ ఘడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మా||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా||
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List