సాధారణంగా అనారోగ్యాలు పన్నెండు రాశులవారికి వేరువేరుగా ఉంటాయి. అవి రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి ప్రయోజనం పొందవచ్చు. అసలు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఏయే రాశులవారికి ఎలాంటి అనారోగ్యాలు సూచించబడుతున్నాయి, వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి మందులు వాడి చక్కని ఫలితాలు పొందవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం...
మేషం...
సాధారణంగా ఈ రాశివారికి తల, ఉదరం, పైత్యం, నత్తి, మూత్రపిండాలు, అగ్ని ద్వారా ఇబ్బందులు, కురుపులు (వ్రణాలు), చర్మా నికి సంబంధించిన విచిత్ర వ్యాధులు కలిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా... అండవ్యాధులు, ఉష్ణంతో కూడిన కఫం, రక్తసంబంధ వ్యాధులు హెచ్చు.
జాగ్రత్తలు: 1) ధ్యానం చేస్తూ ఉండాలి. 2) చల్లదనాన్ని ఇచ్చే పూలు (పూల సువాసన). 3) పసుపు, తేనె పరగడపున తీసుకోవాలి. 4) ఆహారంలో కందిపప్పు ఎక్కువగా ఉండాలి.
వృషభం...
గొంతు, హృదయం, మూలసంబంధ వ్యాధులు, అపస్మారక సంబంధ వ్యాధులు, కఫం, ట్రాన్సిల్స్, ఢిప్తీరియా, పయో రియా (పళ్ళకు సంబంధించిన వ్యాధి) వచ్చే అవకాశం ఎక్కు వ. గుహ్యావయవాలు, నాభి ప్రదేశాలను ఆరోగ్యవంతంగా ఉంచు కోవాలి. మూత్ర వ్యాధులు, రక్తహీ నత, ఉబ్బసం వంటివి కూడా కలుగవచ్చు.
జాగ్రత్తలు: 1) ధ్యానం (మెడిటేషన్). 2) వ్యాయామం. 3) నేట్రం సల్ఫ్ (హోమి యో మందు) వాడటం మంచిది.
మిథునం...
విశ్రాంతి లేకపోవడం, ఊపిరితిత్తుల వ్యాధులు, మనోవ్యాధి, ప్రాణవాయువు (ఆక్సిజన్ లేకపోవుట), మూలవ్యాధి, న్యుమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెవుడు, తలనొప్పి, ఉన్మాదం (పిచ్చి) మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది.
జాగ్రత్తలు: 1) పౌష్టికాహారం తీసుకోవడం. 2) గాలి, వెలుతురు ఉన్న గృహ నివాసం. 3) క్రీడలు, వ్యాయామం తప్పనిసరి. 4) కాలీమూరు (హోమియోపతి మందు) వాడాలి.
అంతేకాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే మొలకెత్తిన పెసలు తినడం చాలా మంచిది.
కర్కాటకం...
రొమ్ము, జీర్ణకోశం, హృదయనాళాల సంబంధిత వ్యాధులు, నీరుపట్టడం, కఫం, కేన్సర్, హిస్టీరియా, కీళ్ళనొప్పులు, శోష, గొంతులో బాధ, మానసిక శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం, వరిబీజం వంటివి వచ్చే అవకాశం ఉన్నది.
జాగ్రత్తలు: 1) ఎక్కువ ఆలోచనలు మానాలి. 2) యోగాసనాలు చెయ్యాలి. 3) తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే అనుమానాలు విడనాడితే మంచిది. 4) మెడి టేషన్ చేయాలి. 5) కార్క్‌ఫ్లోర్ (హోమియో మందు) మంచిది.
సింహం...
వీపు, వెన్నెముక, హృదయం సంబంధించిన వ్యాధులు, హృదయ దేర్భల్యం, గుండెదడ, నడుము నొప్పి, పండ్ల నొప్పి, ముఖవ్యాధి మొదలనవి సంభవించవచ్చు.
జాగ్రత్తలు: 1) తమ మనసులోని భావాలు బహిరంగపరచడం. 2) సూర్యనమస్కారాలు, ప్రాణాయామం. 3) తమ పనులు తామే నిర్వహించడం. 4) మెగ్ఫాస్ (హోమియో మందు) వాడడం మంచిది.
కన్య...
పొట్ట, నాభి ప్రదేశం, వెన్నెము కింది భాగాలకు అనారోగ్యం, అజీర్ణం, విరేచ నాలు, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు: 1) సమయానికి మితాహారం తీసుకోవడం. 2) వ్యాయామం, మొలకెత్తిన పెసలు. 3) ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గింపు. 4) ఆత్మవిశ్వాసం పెంచుకోవడం. 5) కాలీసల్ఫ్ వాడడం వంటివి చేయాలి.
తుల...
ఆందోళన, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మూత్ర సమస్యలు, శోష, కీళ్ళవాతం, పైత్యం, శిరోవ్యాధులు, మలబద్ధకం, రక్తహీనత కలిగే అవకాశాలు ఎక్కువ.
జాగ్రత్తలు: 1) బొబ్బర్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. 2) యోగా, వ్యాయామం తప్పనిసరి. 3) అందరూ మీరు చెప్పినట్టే వినాలి అనే ధోరణి వదిలేయండి.
వృశ్చికం...
తొడలకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు, చర్మ, సుఖవ్యాధులు, భగందరం, హృద్రోగాలు, కఫం మొదలగు వ్యాధులు కలగవచ్చు.
జాగ్రత్తలు: 1) కందిపప్పు, పసుపు ఆహారంలో వాడాలి. 2) ఈ రాశివారికి చల్లని వాతావరణం మంచిది. 3) ఇతరులను తప్పుపట్టడం మాని... ప్రేమానురాగాలను పెంపొందించుకుంటూ... తప్పుచేయనివారు లోకంలో ఉండరని గుర్తించి సర్దుకోవడం మంచిది.
5) కార్క్‌సల్ఫ్ అనే హోమియో మందు వాడితే మంచిది.
ధనుస్సు:
ప్రమాదాలకు గురికావడం, తొడలు, పిరుదులు, నరములు వీటికి సంబంధించిన అనారోగ్యములు, గాయాలు, రక్తదోషము అనారోగ్యము, చర్మవ్యాధులు, స్థూల శరీరం వలన కలిగే ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం.. మొదలైనవి కలిగే అవకాశం వుంది.
జాగ్రత్తలు:
1. వ్యాయామం, ప్రాణాయామం
2. తగిన మోతాదులో ఆహరం
3. మొలకలొచ్చిన శనిగలు, అపక్వాహారం
4. ఎక్కువ బాధ్యతలు తలపైనే వేసుకోకుండా మానసిక ప్రశాంతి కోసం రెండుసార్లు ధ్యానం చేయటం మంచిది.
5. ‘సైలీషియా’ మంచి ఫలితాన్నిస్తుంది (హోమియో)
మకరం:
అజీర్ణం, రక్తదోషాలు, కీళ్ళనొప్పులు, చర్మవ్యాధులు, జలుబు, ఉన్నదరోగాలు, వాతసంబంధ అనారోగ్యాలు, మలమూత్ర వ్యాధులు, చలి, చెవుడు, వెన్నెముక వ్యాధి, కెన్సెర్, పక్షవాతం మొదలైనవి వానికి అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. వంటికి నువ్వుల నూనె పట్టించుకోవటం
2. నువ్వుపొడి ఆహారంలో వాడకం
3. ప్రాణయామం, సూర్య నమస్కారాలు
4. అపక్వాహారం తీసుకోవట
5. ‘కాల్కేషాసు వాడకం మంచిది (హోమియో)
కుంభం:
నంజువ్యాధి, కంటి జబ్బు, నరాల జబ్బు, రక్తప్రసారదోషాలు, గుండెజబ్బు, బెణుకు నొప్పులు, కాళ్ళు, సీల మండల వ్యాధులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు మొదలైన అనారోగ్యాలకు అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. మకరరాశి వలె వీరు కూడా నువ్వుల నూనె మసాజ్, ఆహారంలో నువ్వులపొడి వాడటం, సూర్య నమస్కారాలు చెయ్యటం చేయాలి.
2. నేత్రం మూరు వాడడం మంచిది
3. ప్రతిపనిలోను చురుకుదనం అలవర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోగలరు.
మీనం:
భాహాద్రేకం, బలహీనత, కీళ్ళజబ్బులు, పాదములు, కాలివేళ్ళు నీరు పట్టడం, మద్యపానాదుల వల్ల వచ్చే అనారోగ్యం, కణతులు, మలకోశం, ఆమకోశం మొదలైన వానికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. మొలకలు వచ్చిన శనిగలు, మితహారం
2. పసుపు ఆహారంలో తీకుకోవటం
3. కవితా రచన భావోద్రేకాలను అదుపు చేస్తుంది
4. ఫెర్రంపాసు (హోమియో) వీరికి తగినది.
ద్వాదశ రాశులు -- ద్వాదశ జ్యోతిర్లింగాలు
మేషరాశి: "రామేశ్వరం" :
శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి."
ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, యెర్ర వస్త్ర దానములుకుడా చేసిన మంచి ఫలితములు వచ్చును.
వృషభ రాశి: "సోమనాధ జ్యోతిర్లింగము"
శ్లోకం:- "సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే."
ఈ రాశి శుక్రునికి స్వ గృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుద్రాభిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.
మిధున రాశి: "నాగేశ్వర జ్యోతిర్లింగం":
శ్లోకం:-"యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే."
ఈరాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.
కర్కాటకం: "ఓం కార జ్యోతిర్లింగం":
శ్లోకం:-"కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,
సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే"
ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓం కార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓం కార బీజాక్షరం ఉచారిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.
సింహరాశి : "శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం"
శ్లోకం:-"ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,
వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేస్వరాఖ్యం శరణం ప్రపద్యే."
సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుద్రాభిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును.
కన్యా రాశి: "శ్రీ శైల జ్యోతిర్లింగం".
శ్లోకం:-"శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,
తమర్జునం మల్లిక పూర్వ మేకం, నమామి సంసార సముద్ర సేతుం."
ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబ కి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.
తులారాశి: "మహాకాళే శ్వరం":
శ్లోకం:- "అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మృత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం "
ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్ర వారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.
వృశ్చిక రాశి: "వైద్యనాదేశ్వరుడు:
శ్లోకం:-"పూర్వొత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి."
ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా , మంగళ వారము జన్మ నక్షత్రము రోజున కందులు, యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది.
ధనురాశి : "విశ్వేశ్వర లింగం":
శ్లోకం:- "సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం
వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే."
ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున "నారాయణ మంత్రం"తొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.
మకరము: "భీమ శంకరం" :
శ్లోకం:- "యం డాకినీ శాకినికాసమాజై : ,నిషేవ్యమాణం పిశితా శనైశ్చ ,
సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి."
ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకార పూరితమైన గజరాజు మొసలిచే పీదిన్చాబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది.
దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది
కుంభం:"కేదారేశ్వరుడు":
శ్లోకం:-"మహాద్రి పార్శ్వే చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్ద్రై :
సురాసురై ర్యక్ష మహోర గాద్యై : కేదారమీశం శివమేక మీడే ".
ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.
మీనా రాశి: "త్రయంబకేశ్వరుడు" :
శ్లోకం:-"సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే ,
యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే ".
ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరము నందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.
(సేకరణ)

No comments:
Post a Comment