కుండలినీ సిద్ధ మహా యోగము - కుండలినీ జాగృత దశలు - (3) సర్పావస్థ. ~ దైవదర్శనం

కుండలినీ సిద్ధ మహా యోగము - కుండలినీ జాగృత దశలు - (3) సర్పావస్థ.

విద్యుత్ ప్రవాహం మరింత విడుదలవుతున్న కొలది ప్రభావితమైన అవయవములందు సర్పము కదులుతున్నదా అన్నట్లు ఒక విచిత్రమైన అనుభూతి కలుగును. ముందు చలిస్తున్న విద్యుత్ ఝుంకారమే ఇప్పుడు "సర్పగతి"  వలే ఒక అద్భుతమైన రీతిలో ఒక  ఒక అద్భుతమైన రీతిలో ప్రయాణించును. అనేకమంది సాధకులు తమ శరీరంపై  సర్పములు పైకి ప్రాకుతున్నట్లు,భుజముల పైన,  శిరస్సుపైన ఉన్నట్లు అనుభూతి పొందగలరు. కొంతమంది తమ ఒడిలోనూ,  చేతులపైన... సర్పములు, నాగు పాములు ఉన్నట్లుగా భావించెదరు. మరికొంతమంది తమ వెన్నుపాము నందలి ఖాళీ ప్రదేశం నందు,  నిజంగానే మెలికలు తిరిగిన ఒక సర్పము చలిస్తున్నట్లుగా అనుభూతి పొందడం జరుగును. ఇటువంటి అనుభూతి చాలా భయంకరము, భరింపరానిది. కొలదిమంది  సాధకులైతే...  సర్పాలు  తమ విషపూరితమైన కోరలతో కాటు వేస్తున్నట్లుగా భావించెదరు. శరీరమంతా భరించరాని వేడి ఉద్భవించి రాత్రింబవళ్లు సాధకునికి విశ్రాంతి ఉండదు. సాధకుడు  భయంకరమైన తాపాగ్నితో  మండుతున్నట్టుగా..... అనుభూతి పొందుతూ ఎలా శాంతింపజేయాలో తెలియని స్థితిలో ఉండును. అయినప్పటికీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే  ధర్మామీటరులో... శరీరపు ఉష్ణోగ్రత ఏ మాత్రము పెరిగినట్లుగా కనిపించదు. కొన్నిసార్లు, కొంత మంది సాధకులు, సగం శరీరం అతి చల్లగాను, మరి సగం భాగం ...తీవ్రమైన వేడిగాను... అనుభూతి పొందుతారు. ఈ రకంగా పుట్టినవేడి  శరీరమునందలి అదనపు క్రొవ్వును కరిగించి శరీరము తగిన సమయములో... తేలికగా మారడానికి సహకరించును. నిజమైన యోగి లావుగా ఉండకుండా.... మృదువుగా, చలాకీగా జింక వలే ఉండును. ఆకలి మందగించి... తీసుకునే ఆహారం తగ్గి పోవును. అదేపనిగా నిద్ర కానీ, గాఢనిద్ర కానీ పొందడు. సాధకుడు తన జీవితంలో తారసపడే ప్రతి విషయమందు అయిష్టాన్ని... ఒకే విధమైన నిశ్చయతను చూపుతాడు. అంత ప్రవృత్తి చెదిరినదై, మనస్సునందు ప్రశాంతత లోపించును.  అటువంటి వ్యక్తి, ప్రకృతి కూడా తనను కలవరపరుస్తున్నట్లుగా కలత చెందుతూ, తన వద్దకు వచ్చే ఇతర వ్యక్తుల లో తానంటే ఒక విధమైన దురభి ప్రాయాన్ని కలుగజేయును. కానీ ఈ దశ తప్పని సరి అయినది. పట్టు విడువని కార్యోన్ముఖత, గురువునందు అచంచలమైన భక్తి , నమ్మకముల వలన సాధకుడు , పై అవస్థను అధిగమించవచ్చును. మన శరీరములోని కోశికల నిర్మాణము విచ్ఛేదనము చెందడం వల్ల, తనయందు ముందు నుండి వచ్చిన సంస్కారములకు అనుగుణంగా, శరీరం పని చేయడానికి తిరస్కరించడమే పైన తెలిపిన అవస్థకు కారణము. యోగి ఈ అవస్థలో"శివుని" మాదిరిగా తన భౌతిక మానసిక కలవరము నుండి పుట్టిన విషాన్ని, శివుని వలే సేవించ వలసి వచ్చును. అలా సేవిస్తే తనకు అనంతమైన శాంతి , ఆనందము ప్రాప్తమగును.  అటువంటి పట్టు విడవని శాంతి మయమైన యోగి స్వభావమే హిందుత్వమందలి "శివ తత్వము".  అనేకమంది చంచల స్వభావం గల  సాధకులు ఈ స్థితిలో సాధన వదిలివేసి, ఈ యోగ శాస్త్రంలో పురోగతిని పొందడానికి వెనుకాడెదరు.  కుండలినీ శక్తిని ఏవిధమైన వేదనలు ఇబ్బందులు... లేకుండా  వెనువెంటనే జాగృతము చేస్తామని చాలా నేర్పుగా ప్రచారం చేసుకునే వారికి కొంతమంది సాధకులు బలికావడం జరుగును.

     తమ అస్థితత్వము యొక్క ధర్మాన్ని, లేదా గుణ కణముల నిర్మాణాన్ని మార్చుకొనుటే కుండలిని జాగృతము.  భగవద్గీతలో "స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః" అని చెప్పబడినది. ఇక్కడ ధర్మము అనగా మతము, నమ్మకము...కాదు. ప్రతి ఒక్కరికీ, పుట్టుకతో వచ్చిన ఆధ్యాత్మిక నిర్మాణము. విభిన్న వ్యక్తుల భౌతిక నిర్మాణం ఒక్కటిగా కనిపించినప్పటికీ... వారి వారి ఆధ్యాత్మిక నిర్మాణం, అంటే పిండ ధర్మము వేరువేరుగా ఉండును.  తన ధర్మమునకు అనుగుణముగా ఆధ్యాత్మిక శక్తిని అభివృద్ధి చేసుకోవాలి కానీ ఇతరుల ధర్మాన్ని (నిర్మాణాన్ని)... తనలో ప్రవేశపెట్టడం వలన కాదు. స్పర్శ దీక్ష (Touch method of passing powers)  ద్వారా శక్తి పాతం అనేది సులభంగా అనిపించినప్పటికీ ఈ పద్ధతి ద్వారా స్వధర్మాన్ని పాడు చేసుకోవడం తగదు. ఎవరికి వారే...సద్గురువు దగ్గర విద్యలు నేర్చుకొని....ఆ విద్యను ఆచరణ లోనికి తేవాలి.
Share:

Related Posts:

2 comments:

  1. పోష్టు ఎక్కడి నుండి గ్రహించారో...కనీసం తెలుపలేదు.....భట్టాచార్య

    ReplyDelete
  2. కాపీ పేష్టు పోష్టు.

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive