🌸వద్యని కోరుకునే భక్తుడు ఒకవేయి పార్ధివలింగాలని భక్తిగా పూజిస్తే అతడి కోరిక నెరవేరుతుంది.
🌿వస్త్రాలు, ధనం కావాలనుకునేవారు ఐదువందల లింగాలని, మంచి కుమారుడు కావాలనికోరుకునేవారు పదిహేనువందల లింగాలని, మోక్షాన్ని కోరుకునేవారు కోటిలింగాలని, భూమికావాలనుకునేవాడు వేయిలింగాలని,
🌸శవుడి అనుగ్రహం కావాలనుకునేవాడు మూడువేల లింగాలని, తీర్ధయాత్రలు సక్రమంగా చేయాలనుకొనే వ్యక్తి రెండువేల లింగాలని,
🌿మంచిమిత్రుడు లభించాలని కోరే భక్తుడు మూడువేల లింగాలని, జనవశీకరణ కోరుకునేవాడు ఎనిమిది వందల లింగాలని, శత్రునాశనం జరగాలనుకొనే వాడు, ఏడువందల లింగాలని, అందరినీ మోహింపచేయాలనుకొనేవాడు ఎనిమిది వందల లింగాలని భక్తిగా ఆరాధించాలి.
🌸భూతప్రేతాలన తరిమికొట్టాలనుకునేవాడు వేయి లింగాలని, భూతాల్ని స్తంభింపచేయాలనుకునేవాడు వేయి లింగాలని, కారాగారం నుంచి విముక్తి పొందాలనుకునేవాడు పదిహేనువందల లింగాలని,
🌿మహారాజువల్ల ప్రభుత్వం వల్ల దండన భయం కలిగితే ఐదువందల లింగాలని, దొంగలు సంపద దోచుకుపోతే అవి తిరిగి లభించటానికి రెండవందల లింగాలని, సకల దారిద్ర్యాలూ వదలి పోవటానికి ఐదువేల లింగాలని, అన్ని రకాల కోరికలు తీరాలంటే పదివేల శివలింగాలని యథావిధిగా స్థాపించి భక్తితో షోడశోపచార పూజలు చేస్తే ఇష్టకామ్యసిద్ధి కలుగుతుంది.
🌸భక్తుడు ఒక లింగాన్ని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. రెండు లింగాలని అర్చిస్తే కార్యసిద్ధి జరుగుతుంది. మూడు లింగాలని పూజిస్తే అన్ని కోరికలూ తీరుతాయి. ఈ సంఖ్య విషయంలో మరొక అభిప్రాయ భేదం ఉన్నది.
🌿అదేమిటంటే? భక్తుడు పదివేల లింగాలని పూజిస్తే రాజభయమే కాకుండా అన్నిరకాల భయాలూ తొలగిపోతాయి. చెరసాల నుంచి విడుదల కావాలనుకునేవాడు పదివేల లింగాలని పూజించాలి.
🌸శకినీ డాకినీ వంటి పిశాచాల వల్ల భయం కలిగితే అదిపోవటానికి ఏడువేల శివలింగాలు పూజించాలి. పుత్రసంతానం కావాలనుకునేవాడు ఏభై అయిదువేల లింగాలను, పుత్రిక జన్మించాలంటే పదివేల లింగాలని పూజించాలి.
🌿పదివేల లింగాలని అర్చించినవాడికి విష్ణువుతో సమానమైన ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష శివలింగాలని అర్చించిన భక్తుడు అపారమైన సంపదలకి అధిపతి అవుతాడు. ఇక కోటి లింగాలని ఎవరైతే అర్చిస్తారో ఆవ్యక్తి సాక్షాత్తు శివస్వరూపుడుగా కీర్తించబడతాడు. పార్ధివ లింగార్చన వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితం, సాధకుడికి లభిస్తుంది.
🌸అన్ని రకాల దానాలు, వ్రతాలు, యజ్ఞాలు, తీర్ధాలు, నియమాలు ఒకవైపు, పార్ధివలింగార్చనా విధానం మరొకవైపు అని స్మృతులు చెబుతాయి. ఈ కలియుగంలో లింగార్చనకన్నాశ్రేష్ఠమైనది వేరొకటి లేదని శాస్త్రాలు నిర్ణయించాయి.
🌿పంచాక్షరీ మంత్ర స్వరూపమైన లింగం అన్ని లింగాలలోకీ గొప్పది కాబట్టి, మహర్షులు, మునులూ నిత్యం దానినిఉపాసించాలి.
🌸శవలింగాలు వాటి మహిమలను అనుసరించి ఉత్తమం, మధ్యమం, అధమం అని మూడు రకాలుగా వుంటాయి. నాలుగు అంగుళాల ఎత్తుతో పీటాన్ని కలిగిన శివలింగం ఎంతో ఉత్తమమైనదని పండితులు చెప్తారు.
🌿దనిలో సగం అనగా రెండు అంగుళాల ఎత్తు వున్న పార్ధివలింగం మధ్యమమని, నాలుగోవంతు అనగా ఒక అంగుళం కలిగిన లింగాన్ని అధమమని చెప్తారు. ఇలా ఉండే మూడు రకాల శివలింగాలు ఒకదానికన్నా మరొకటి అధికమైన మహిమ కలిగినవని చెప్పబడ్డాయి. నాలుగు వేదాలలో కూడా లింగారాధన గొప్పదని చెప్పబడింది.
🌸జఞాని అయినవాడు ఈ కర్మల సమూహాన్ని వదిలేసి పరిపూర్ణమైన భక్తితో లింగపూజచేయాలి. శివలింగాన్ని అర్చిస్తే ఈ జగత్తునంతా అర్చించిన ఫలం లభిస్తుంది. అజ్ఞానమనే చీకటిలో గుడ్డివాళ్ళై, ఇంద్రియ భోగాలపై మనసు చిక్కుకున్న వారికి, లింగార్చన ఒక్కటే దిక్కు. బ్రహ్మ విష్ణువు వంటి దేవతలు,
🌿రక్షసులు, మునులు, యక్షులు, గంధర్వులు, చారణులు, సిద్దులు, ఆదిశేషుడు వంటి నాగజాతివారు, గరుత్మంతుడులాంటి పక్షిజాతివారు, వివిధ ప్రజాపతులు, మనువులు, నరులు, కిన్నరులు ఇలా అందరూ అన్ని కోరికలనూ తీర్చే పార్ధివలింగాన్ని మహాభక్తిగా పూజించారు.
🌸కనుక స్త్రీలకు అన్ని వర్ణాలవారికీ లింగపూజచేసే అర్హతవుంది. అందరికీ ఆ అధికారం వుంది. అయితే బ్రాహ్మణులు మాత్రం శివలింగ పూజని వైదిక పద్ధతిలో చేయటమే మంచిది. ఇతర వర్ణాలవారు వైదిక పద్ధతిని విడిచి నేను చెప్పిన నామ పూజావిధాన పద్ధతిలో చేస్తే మంచిది.
🌿భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు సోమయాజి అనేవి శివుడి అష్టమూర్తులు కాగా వీటితో పాటూ శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, ఈశ్వరుడు, పశుపతి, మహాదేవుడు అనే శివుడి దివ్యనామాలను కూడా అష్టమూర్తులతో పాటు చేసి అర్చించాలి.
🌸ఆ తరువాత శివపరివారాన్ని కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి. శివపరివారం ఎవరంటే? ఈశానుడు, నంది, చండుడు, మహాకాలుడు, భృంగి, వృష, స్కంద, కపర్దీశ, సోమ, శుక్రులనేవారిని, అగ్రము మీద వీరభద్రుడిని, వెనుకవైపున కీర్తిముఖుడిని గంధం పుష్పం, అక్షతలతో పూజించాలి.
🌿వరి తరువాత ఏకాదశ రుద్రులని అర్చించి పంచాక్షరి జపించి రుద్రాధ్యాయ పంచాంగ స్తుతి స్తోత్రాలని పఠించి శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి, ఉద్వాసన పలకాలి.
🌸దేవుడి కార్యక్రమాలని రాత్రి పూటైనా, మరెప్పుడైనా గానీ ఉత్తర దిక్కువైపుకూర్చుని మాత్రమే చేయాలి. భక్తుడు పరిశుభ్రంగా వుండి మంచి వస్త్రాలు ధరించి ఉత్తరాభిముఖంగా కూర్చుని శివపూజ ఆచరించాలి.
🌿శవలింగానికి ఎదురుగా, తూర్పువైపుగానీ, శక్తి ఉండే ఉత్తరభాగంలో కానీ, వెనుకవైపు పశ్చిమంగా కానీ, పూజ చేసే అర్చకుడు కూర్చోకూడదు. అసలు మారేడు దళాలు లేకుండా శివపూజే చేయకూడదు.
🌸భక్తుడికి ఒకవేళ శివపూజ చేసేటప్పుడు భస్మం లభించకపోతే మట్టినైనా నుదురుమీద త్రిపుండ్రంగా ధరించేందుకు వినియోగించాలి.
🌹 శివ నైవేద్యం 🌹
🌿శవుడికి నైవేద్యం పరమ పవిత్రమైనది. దృఢమైన నిశ్చయంతో మంచి వ్రత దీక్షని ఆచరిస్తూ శరీరంలోపల, బైటా, పవిత్రంగా ఉండే శివభక్తుడైనవాడు తీసుకోవాలా, వద్దా? అనే సంశయాన్ని పోగొట్టుకొని, శివుడికి సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించాలి.
🌸శవనైవేద్యం ఎంత గొప్పదంటే ఆ నైవేద్యాన్ని చూస్తేనే చాలు పాపాలు పారిపోతాయి. అటువంటి శివనైవేద్యాన్ని తింటే కోటిరెట్లు పుణ్యం లభిస్తుంది. వందలాది వేలాది యాగాలు చేయాల్సిన అవసరం లేదు. భక్తితో శివనైవేద్యాన్ని భక్షిస్తే చాలు శివసాయుజ్యాన్ని పొందుతారు.
🌿ఏ ఇంట్లోనైతే శివనైవేద్యాన్ని తాము తిని, ఇతరులకి పంచుతారో అటువంటి వారి ఇల్లు చాలా పవిత్రమైపోతుంది. అంతేకాదు ఆ ఇంట్లో వారిని ఆ ఇంటికి వచ్చిన వారిని కూడా పవిత్రం చేస్తుంది. భక్తుడైన వాడు తనకు లభించిన శివప్రసాదాన్ని ఆనందంగా, వినయంగా స్వీకరించి, కళ్ళకు అద్దుకుని శివుడిని స్మరిస్తూ తినాలి.
🌸శవుడి ప్రసాదం లభించినప్పుడు తీసుకోకుండా అశ్రద్ధతో ఇంకొకసారి తీసుకోవచ్చులే అని భావించి తిరస్కరిస్తే పాపాన్ని పొందుతారు. అసలు శివప్రసాదం స్వీకరించాలి అనే కోరిక ఎవడికి ఉండదో వాడు మహాపాపిగా పరిగణించబడి నరకం పాలవుతాడు.
🌿మంచి హృదయంలోగానీ, చంద్రకాంతమణి, బంగారం, వెండి, వంటి వాటితో నిర్మించిన లింగాలలో కొలువుండే సర్వేశ్వరుడికి భక్తితో నైవేద్యాన్ని సమర్పించి ఆ మహాప్రసాదాన్ని శివదీక్షలో ఉండే భక్తుడు స్వీకరించాలని ఋషులు చెప్తారు.
🌸శవదీక్షను స్వీకరించిన భక్తుడు శివుడికి పెట్టిన నైవేద్యాన్ని మహాప్రసాదంగా భావించాలి.
🌿సలగ్రామాలలో ఉద్భవించిన లింగము, పాదరసంతో చేసిన లింగము వెండి బంగారం వంటి లోహాలతో చేసిన లింగము, దేవతలు, ఋషులు, సిద్ధులు చేత ప్రతిష్ఠించబడిన లింగాలు, అలాగే అన్ని జ్యోతిర్లింగాలలో ప్రకాశించే శివుడికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా తిన్న భక్తుడికి చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది.
🌸ఏ భక్తుడైతే శుచిగా, శివుడి నిర్మాల్యాన్ని ధరించి ఆయన ప్రసాదాన్ని తింటాడో అటువంటి వాడు, బ్రహ్మహత్య చేసినప్పటికీ అతని పాపం తొలగిపోతుంది.
🌿అయితే చండీశ్వరుడు అధికారిగా వుండే శివాలయంలో నైవేద్యాన్ని తినకూడదు. చండీశ్వరుడు అధికారంలో లేని ఆలయాలలో మాత్రమే నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. ఈ చండీశ్వరుడి అధికారం ఎక్కడ వుండదంటే!
🌸బణలింగాలు, లోహంతో నిర్మించిన లింగాలు, సిద్ధులు ప్రతిష్ఠించిన లింగాలు స్వయంభూలింగాలు, అలాగే అన్ని రకాల శివుడి ప్రతిమలలో (విగ్రహాల ప్రతిష్ఠలలో) చండీశ్వరుడికి అధికారం ఉండదు.
🌿ఇలాకాని వాటిల్లో ఆయనకి అధికారం వుంటుంది. ఏ భక్తుడైతే శివలింగానికి యథావిధిగా అభిషేకాన్ని చేసి ఆ తీర్ధాన్ని మూడుసార్లు భక్తిగా స్వీకరిస్తాడో వాడు చేసిన మూడు రకాల పాపాలు వెంటనే నశిస్తాయి.
🌸శవలింగం మీద ఉంచిన వస్తువుల్ని స్వీకరించవచ్చు అవి చాలా పవిత్రమైనవి కూడా. ఇప్పుడు మీరు అడిగినట్లు బిల్వము దాని మహిమను గురించి చెబుతాను శ్రద్ధగా వినండి.
🌹 బిల్వమహిమ 🌹
🌿బల్వవృక్షము అనగా మారేడు చెట్టు ఇది సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం. ఈ వృక్షాన్ని దేవతలు కూడా పూజిస్తారు. దీని మహిమను గురించి పూర్తిగా చెప్పటం ఎంతో కష్టం. లోకంలో ప్రసిద్ధమైన పుణ్య తీర్ధాలెన్నైతే ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు మూలంలో నివసించి ఉంటాయి.
🌸మరేడు చెట్టు క్రింద లింగరూపంలో వున్న పరమేశ్వరుడిని పూజించే భక్తుడు అనంత పుణ్యాత్ముడై శివసాన్నిధ్యాన్ని పొందుతాడు. అలాగే మారేడు చెట్టు మొదట్లో స్నానాన్ని ఆచరించినవాడు సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
🌿అలా చేసినవాడు మాత్రమే నిజమైన పవిత్రుడని చెప్పబడతాడు. మారేడు చెట్టు మూలం కట్టిన కుదురు ఎంతో శ్రేష్ఠమైనది. ఆ కుదురుని గనుక నీటితో తడిపినట్లైతే శివుడు ఎంతో ఆనందిస్తాడు. ఏ మనిషైతే మారేడు చెట్టు మూలాన్ని గంధం, పుష్పం, మొదలైన ద్రవ్యాలు సమర్పించి పూజిస్తాడో అతడు అంత్యంలో శివలోకాన్ని చేరతాడు.
🌸అలాంటి వాడి సంతానం కూడా సుఖశాంతుల్ని పొందుతుంది..
No comments:
Post a Comment