శ్రీ మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి.. ~ దైవదర్శనం

శ్రీ మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి..




కృష్ణా నది,ముచికుందా నదుల సంగమం అయిన వాడపల్లి వద్ద ఉన్న  అతి పురాతన దేవాలయాల్లో మీనాక్షి అగస్త్యేశ్వరాలయం ఒకటి. 


ఈ గుడిలో పానువట్టం మీద శివలింగం మరో రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగం మీద ఒక చిన్న గుంట ఉండి అందులో నుంచి నీరు ఎప్పుడూ ఉబికి వస్తూ ఉంటుంది. అయితే ఆ నీరు శివలింగం నుంచి కిందకు పొర్లదు. అంతే కాకుండా ఆ గుంటలో నీటి మట్టం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఇది అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఆలయం. 6000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఆలయం ఇది 


పూర్వం అగస్త్య మహాముని దేశసంచారం చేస్తూ కృష్ణా, ముచికందా సంగమ స్థానం లో సాయం సంధ్యావందనం పూర్తిచేసి ధ్యానం లో ఇదో గొప్ప దివ్యస్థలం అని గుర్తించి శివలింగం,లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్టించి పూజించి,అభిషేకించి ముందుకు యాత్రకు వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది.


ఆ తర్వాత పుట్టలు పట్టి సుమారు 5,400 సంవత్సరాలు స్వామి పుట్టల్లోనే ఉన్నారు. రెడ్డిరాజుల పరిపాలనా కాలంలో  పుట్టలో ఉన్న స్వామి బయల్పడ్డారు. ఇక్కడే ఆలయం నిర్మించి స్వామికి ఈ స్థలాన్ని అంకితం చేశారు రెడ్డిరాజులు 600 సంవత్సరాల క్రితం.



పక్షిని రక్షించి ప్రతిగా తన శిరస్సు నుండి మాసం ఇచ్చిన శివయ్య. ఇందుకు సంబంధించి స్థానిక కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఒక రోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ శివలింగం వెనుకాల దాక్కొంది. శివుడు జాలిపడి ఆ పక్షిని రక్షించాలనుకొన్నాడు. అయితే బోయవాడు వచ్చి ఆ పక్షి తనదని దానిని తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.

 

దీంతో శివుడు తాను ఈ పక్షికి మాట ఇచ్చానని అయితే నీ కోరిక కూడా సమంజసంగా ఉందని చెబుతారు. నీ ఆకలి తీర్చుకోవడానికి వీలుగా నా తల నుంచి కొంత మాంసం తీసుకోవాలని సూచిస్తాడు. ఆ బోయవాడు ఇందుకు అంగీకరించి తన వద్ద గొడ్డలితో శివుడి శిరస్సును కొంత మేర ఖండించి చేతి వేళ్లతో కొంత మాంసాన్ని తీసుకొంటాడు.


ఆ చేతివేళ్ల గుర్తులను మనం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఇక స్వామివారి గాయన్ని కడగడానికి నేరుగా గంగమ్మే ఇక్కడికి వచ్చిందని చెబుతారు. అందువల్లే ఈ శివలింగం పై గుంటలో నీరు ఎల్లప్పుడు ఉంటుందని చెబుతారు. ఇదిలా ఉండగా క్రీస్తుశకం 1524లో శ్రీ శంకరాచార్యలు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ బిలం (గుంట) లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ఉద్దరిణికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారు. ఎంత సమయమైనా ఆ తాడు అలా వోపలికి వెళుతూనే ఉంది. దీంతో ఆ తాడును పైకి లాగారు.


ఆ ఉద్దరిణికి రక్త మాంసాలు అంటుకున్నాయి కాని ఆ బిలం లోతు తెలియలేదు. దీంతో శంకరాచార్యలు లయకారకుడైన నిన్ను పరీక్షించడానికి నేను ఎంతవాడినని పరి పరి విధాలుగా ప్రార్థించారు. తర్వాత ఈ వివరాలను తెలుపుతూ అక్కడ పాళీ భాషలో రాతి శాసనం కూడా వేయించారు సదరు శాసనాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇది నదీ సంగమం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం కూడా చేస్తుంటారు. 


ఈ వాడపల్లి శ్రీ అగస్త్యేశ్వస్వామి సందర్శనం వల్ల భూత, ప్రేత పిశాచాల భయం ఉండదని స్థానిక భక్తుల నమ్మకం.


ఓం నమః శివాయ 🙏

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List