భగవద్గీతలోని.. ధర్మం, భక్తి, మోక్షం.. మానవుని అంతిమలక్ష్యం ఏమిటి ..? ~ దైవదర్శనం

భగవద్గీతలోని.. ధర్మం, భక్తి, మోక్షం.. మానవుని అంతిమలక్ష్యం ఏమిటి ..?

ఉపనిషత్తుల కాలం నుంచి బాగా విస్తరించిన మోక్ష భావనను ఎదుర్కోవటం ఇంకా పెద్ద సవాలయింది. ధర్మం, మోక్షం గురించిన ఆలోచనలు శతాబ్దాలుగా ఉన్నాయి గాని, భగవద్గీతలో ఆ రెండింటి మధ్య ముఖాముఖి సంఘర్షణ ఏర్పడింది. అశోకునికి ఏర్పడినటువంటి సందేహాలే అర్జునునికి కూడా ఎదురవుతాయి. కృష్ణుడుని హింసాహింసల గురించి కష్టతరమైన ప్రశ్నలు అనేకం అడుగుతాడు. అవి వెనుకటి నుంచి ఉన్నవే. జవాబిచ్చేందుకు సాధ్యపడనివి. ఆత్మను చంపలేవు గనుక యుద్ధంలో శరీరాన్ని చంపడమన్నది నిజంగా చంపటం కాబోదంటాడు కృష్ణుడు అర్జునుడితో. దానిని బట్టి రచయితకు అసలు హింస అనేది ఇబ్బందికరంగా మారిందని, దానిని సమర్థించేందుకు శ్రమపడవలసి వచ్చిందని అర్థమవుతుంది. చివరకు ఆ నైతికమైన ప్రతిష్ఠంభన పరిష్కా రం కాదుగాని, కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి ప్రదర్శించటంతో పక్కకు కొట్టుకుపోతుంది.
.
అంతకుముందు కృష్ణుడు ఇచ్చిన సమాధానాలన్నీ సంక్లిష్టమైనవి, అస్పష్టమైనవి మాత్రమే. కృష్ణుడు తన విశ్వరూపం చూపి నోరు తెరిచినపుడు యోధులు, సైనికులంతా ఆ నోటిలోకి వెళ్లిపోవటం చూసిన అర్జునునికి తను యుద్ధంలో నిమిత్త మాత్రుడినని బోధ పడుతుంది. ఆ విధంగా ధర్మాధర్మాలు, లేదా హింసా హింసల మధ్య రాజీ జరుగు తుంది. అయితే మొత్తం మీద మహా భారతంలోని సందేశం హింస, యుద్ధం కావు. భారతదేశంలో భగవద్గీతను యుద్ధానికి సమర్థనగా ఉపయోగించరు. అందుకు భిన్నంగా దానిని భారత కథా సందర్భం నుంచి విడదీసి చూసి అందులోని తాత్త్వికతను ఉపయోగిస్తారు. భగవద్గీతను గాంధీ శాంతి ప్రబోధానికి వినియోగించాడు.
.
ధర్మానికి, మోక్షానికి మధ్యగల ఘర్షణాత్మక స్థితిని కృష్ణుడు భక్తిని రంగంలోకి తేవటం ద్వారా పరిష్కరిస్తాడు. భక్తి ఆ రెండింటికి మధ్యవర్తిత్వ పాత్ర వహిస్తుంది. అర్జునుడు ధర్మానికి, పరిత్యాగానికి మధ్య ఏమి చేయాలో తేల్చుకోలేనపుడు కృష్ణుడు తనకు భక్తి అనే మూడవ మార్గాన్ని చూపుతాడు. భగవద్గీత మోక్షానికి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం అనే త్రివిధ మార్గాన్ని బోధిస్తుంది. కృష్ణుడు సూచించిన భక్తి మార్గాన్ని అనుసరించటం ద్వారా అర్జునుడు తన కర్మల దుష్ఫలితాలను అనుభవించ కుండా తప్పించుకుంటాడు. ఇది ఒక అగ్రవర్ణ కుటుంబీకుని సిద్ధాంతంలోకి సన్యాసుల ఆధర్మాన్ని చొప్పించటం. భగవద్గీత అర్జునునికి తన కర్మలను ఆచరించుతూ కర్మ ఫలాలను మాత్రం పరిత్యజించడమనే అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతుంది. అది నిష్కామ కర్మ. మరొక విధంగా చెప్పాలంటే ఎవరి కర్మను వారు ఆచరించటం. అర్జునుని విషయంలో నిష్కామ దృష్టితో తన బంధుమిత్రులను సంహరించటం బౌద్ధంలోని సామాజిక నైతికతకు ఇది భిన్నమైంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List