పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం మన సంప్రదాయం. దసరా మరుసటి రోజున పాలపిట్టను దర్శించి నమస్కరించటం ఇందులో భాగమే. పాలపిట్ట దేవీ స్వరూపమని, అది ఉత్తర దిక్కునుంచి వస్తే శుభం, విజయం కలుగుతాయనీ, దక్షిణ దిశగా వస్తే అశుభ సంకేతమని కూడా భావిస్తారు. తెలంగాణా ప్రాంతంలో దసరా పండగ నాటి సాయంత్రం శమీపూజ ఎంత ముఖ్యమో, పొలానికి వెళ్లి ఈ పక్షిని చూసి మొక్కి రావటం అంతే ముఖ్యం.
.
గుప్పెడంత ఉన్నా పలు రంగులతో కనువిందు చేసే ఈ పక్షి చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే.. ఈ దసరా మరుసటి రోజే దీన్ని ఎందుకు చూడాలంటే.. అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకొని వస్తున్న పాండవులకు హస్తినాపురం పొలిమేరలో ఈ పాలపిట్ట కనపడిందట. నాటి నుంచి వారిని అన్నీ విజయాలే సిద్దించాయట. నాటినుంచి పాలపిట్ట దర్శనం చేసుకోవటం మొదలైందట. తెలుగు రాష్ట్రాలు, కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందినా పట్టణీకరణ మూలంగా పాలపిట్ట జాడ కనుమరుగవుతోంది. పచ్చని చెట్లు పెంచటం ద్వారానే ఈ పరిస్థితిని నివారించగలం. అప్పుడే శుభాలనిచ్చే పాలపిట్టనూ కాపాడుకోగలం.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment