కాశీ ఖండం -5 ~ దైవదర్శనం

కాశీ ఖండం -5



                                                                   సప్త పురి వర్ణనం

 అగస్త్య మహర్షి భార్య లోపా ముద్రా దేవికి శివ శర్మ కధను చెప్పటం ప్రారంభించాడు .మధురా నగరం లో శివ శర్మ అనే బ్రాహ్మనుడుండే వాడు .వేద ,వేదాంగాలు ,సకల శాస్త్రాలు నేర్చి ,సత్పుత్రులను కని వారికి సమానం గా ఆస్తి పంచి ,ముసలి తనం లోకి ప్రవేశించాడు .వయస్సంతా ధన సంపాదన లో ఖర్చు అయి పోయిందని విద్య నేర్వటానికి సరి పోయిందని దైవా రాధనా తీర్ధ యాత్రలు చేయ లేక పోయానని విచారించాడు .దానాలు చేయలేక పోయానని బాధ పడ్డాడు చివరికి తీర్ధ యాత్రలు చేసి జీవితానికి పరమార్ధాన్ని కల్పించుకొంటానని నిశ్చయానికి వచ్చాడు మంచి రోజు చూసుకొని విఘ్నేశ్వర పూజ చేసుకొని ననాందీశ్రార్ధాన్ని నిర్వర్తించి తీర్ధ యాత్రలకు బయల్దేరాడు .

                 శివ శర్మ మొదట అయోధ్య కు చేరాడు .సరయు నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అయిదు రాత్రులు ఉండి ,ప్రయాగ చేరాడు .తివేణీసంగమం లో పవిత్ర స్నానం చేసి ,గంగా నది ఇక్కడే కలుస్తుందన్న విషయం  తెలిసి కొన్నాడు .ప్రకృష్ట మైన క్షేత్రం కనుక ప్రయాగ అనే పేరొచ్చింది .సప్త పాతాళాలలో వ్రేళ్ళూనుకొని ఉన్న అక్షయ వట వృక్షాన్ని భక్తితో దర్శించాడు .బ్రాహ్మణులకు సమారాధన చేశాడు .ఇది ధర్మార్ధ కామ మొక్షాలనిచ్చే క్షేత్ర రాజం .బ్రహ్మ హత్యా దోషాన్ని కూడా నివారించే శక్తి ఈ క్షే త్రానికి ఉంది .విష్ణు స్థానమైన వేణీ మాధవా న్ని దర్శించాడు .రజో రూపం లో ఉండే సరస్వతి ,తమో రూపం లో ఉండే యమునా ,సత్వ రూపం లో ఉన్నగంగా నది ఇక్కడ కలిసి నిర్గుణ బ్రహ్మ రూపాన్ని పొందినాయి . ఈ త్రివేణీ సంగమం బ్రహ్మ లోకానికి నిచ్చెన .ఇది తీర్ధ రాజం ..బిందు మాధవుడు సేవించు కాశీ పట్నం వరుణ ,అసి నదుల మధ్య ఉంది ప్రయాగ నుండి అక్కడికి చేరాడు .మణి కర్ణిక లో స్నానం చేసి విశ్వేశ్వరుడిని దర్శించాడు కాశి ఎప్పటికప్పుడు కొత్తగా కనీ పిస్తుంది .ఉత్తమ ప్రబంధాలలో స్రవించే రసం  లాగా కాశి మనోజ్ఞం గా ఉంటుంది .సంసారులకు చింతా మణి వంటిది .ముక్తి లక్ష్మీపీఠ.మణి.ఇక్కడ సకల జీవ రాసులు దేవతల తో సమానం .సప్త క్షేత్రాలలో కాశి ఒరిపిడి రాయి వంటిది .ఇతర క్క్షేత్రాలను దర్శించిన వారు కూడా మళ్ళీ కాశీ కే చేరుకొంటారు .

              అక్కడి నుండి శివ శర్మ ఉజ్జయిని వచ్చాడు .తన లీలచే ,ప్రతి కల్పం లోను ప్రళయం చెందే ఈ విశ్వాన్ని చూసి ,చూసి శివుడు మహా కాళుడయ్యాడిక్కడ .లోకం లోని పాపాలను పోగొట్టు తుంది కనుక అవంతి అనీ అంటారు .ప్రతి యుగం లోనుకళలను నింపి  కళకళ లాడుతూ కని పిస్తుంది .మహా కాళుని సమీపం లో కోటి లింగాలున్నాయి .హాటకేశ్వరుడైన మహా కాలుడు తారకేశ్వరుడై ఒకే లింగాన్ని మూడు గా భేదించి ,మూడు లోకాలను ఆక్రమించాడు .ఇక్కడున్న సిద్ధ వటం వద్ద ఉండే జ్యోతిని దర్శించాడు .’’మహా కాళా ,మహా కాళా’’ అంటూ ఆర్తి గా పిలిస్తే యమ దూతలు దగ్గరకు రారు .ఇక్కడి నుంచి కంచి నగరం చేరాడు .కాంతి నిచ్చేది కనుక దీన్ని కాంతి లేక కంచి అంటారు ఇక్కడ మహా విష్ణువు ను లక్ష్మీ దేవిని సందర్శించాడు .తీర్ధ విధులు నిర్వర్తించి, ద్వారా వతి అంటే ద్వారక చేరాడు అన్ని వర్ణాల వారికి ఇది పుణ్య ద్వారం కనుక ద్వారక అనే పేరొచ్చింది ఇక్కడి సముద్రుడు అనేక యుగాలుగా రత్నాలను సేకరించుకొని రత్నా కరుడయ్యాడు .ఇక్కడ మరణిస్తే వైకుంఠమే చేరుతారు .శ్రీ మహా విష్ణువుకు నిలయం .తర్వాత మాయాపురికి వచ్చాడు .దీనినే హరిద్వారం అంటారు .మోక్షద్వారం అని, గంగా ద్వారం అనీ పిలుస్తారు .కొద్ది కాలం ఇక్కడున్నాడు చలి జ్వరంవచ్చి తీవ్రం గా బాధ పడ్డాడు .సప్తపురీ యాత్ర లను సంపూర్ణం గా చేద్దా  మనుకొంటే, ఈ విపత్తు వచ్చిందని బాధ పడ్డాడు .ఎక్కడికి కదల లేక నలభై తొమ్మిది రోజు లు అక్కడే ఉండి మరణించాడు .వైకుంఠ ము నుండి విమానం వచ్చి శివ శర్మ ను విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List