కాశీ ఖండం –17 ~ దైవదర్శనం

కాశీ ఖండం –17


సప్తర్షి లోక వర్ణన.. అగస్త్య మహర్షి ,భార్య లోపాముద్ర తో ‘’హరిద్వారం లో ప్రాణాలను కోల్పోయిన శివ శర్మ సప్తర్షి మండలాన్ని చూశాడు .ఆ తర్వాత విష్ణు లోకాన్ని ,చూశాడు .దేవకాన్తలు అతనికి స్వాగతమిచ్చారు .కొద్ది సేపు ఉండమని కోరారు ..వారు అతని పుణ్యాన్ని గురించి ప్రస్తు తించి తమ మంద భాగ్యానికి బాధ పడ్డారు .తను ఉన్న లోక మెవరిదని శివ శర్మ ప్రశ్నిస్తే వారు అది సప్తర్షి లోకమని చెప్పారు .బ్రహ్మ మానస పుత్రు లైన మరీచి ,అత్రి ,పులహుడు ,పులస్త్యుడు ,క్రతువు ,అంగీరసుడు ,వసిష్టుడు ,ఏడుగురు ఇక్కడ ఉంటారు .వీరినే సప్త బ్రహ్మలు అని పురాణాలు చెబుతున్నాయి .వీరి భార్యలు సంభూతి ,అనసూయ ,క్షమా ,ప్రీతీ ,సన్నతి ,స్మృతి ,ఊర్జ..వీరు లోక మాతలు గా ప్రసిద్ధులు .సప్తర్షులు తమ తపస్సు చే ముల్లోకాలను ధరిస్తున్నారు .వీరిని సృష్టించిన బ్రహ్మ దేవుడు వీరితో ‘’కుమారులారా !మీమీ ప్రయత్నా లతో నానా రూపాలుండే ప్రజల్ని సృష్టించండి ‘’అని ఆదేశించాడు .వారు తండ్రి కి నమస్కరించి కాశీ చేరి తపో నిష్ఠలో ఉన్నారు ..సమస్త జీవులకు ముక్తి నివ్వ టానికి శివుడు వచ్చాడు .వీరు తమ పేర్ల తో లింగాలను స్థాపించి శివుడిని అర్చిస్తూ తపస్సు చేశారు .మెచ్చిన శివుడు వారికి ‘’ప్రజా పతులు ‘’అనే బిరుదు నిచ్చాడు .సప్తర్షి లింగ దర్శనం చేస్తే సప్తర్షి లోకానికి చేరతారు .

               గోకర్ణం అనే పేరు గల సరస్సు పడమటి భాగం లో ఉన్న అత్రీశ్వర లింగాన్ని చూస్తె బ్రహ్మ తేజస్సు పెరుగు తుంది .కర్కోటం అనే దిగుడు బావికి ఈశాన్యం లో ఉన్న మరీచీ మండలం లో స్నానం చేస్తే సూర్య కాంతి లాంటి దేహ వర్చస్సు కలుగు తుంది .అక్కడి మరీచీ లింగ దర్శనం మరీచీ లోకానికి చేరుస్తుంది .స్వర్గ ద్వారానికి పశ్చిమాన పులహుడు ,పులస్త్యుడు స్థాపించిన లింగాలను దర్శించి పూజించిన వారు ప్రజాపతు లవుతారు .రమ్య మైన హరి కేశ వనం లో అంగీరశేశ్వరుని చూస్తె అంగీరస లోకం లో స్థానం లభిస్తుంది .వరుణా నది ఒడ్డున ప్రతిష్టింప బడ్డ వశిష్టేశ్వర లింగ దర్శనం వల్ల ,తీర్దేశ్వరుని సందర్శించిన వారికి సప్తర్షి లోక నివాస భాగ్యం క లుగు తుంది .

                అక్కడ అతి లోక సౌందర్యం తో విరాజిల్లు తున్న అరుంధతీ దేవి ని చూశాడు .ఆమె దర్శనమే పుణ్య ప్రదం .ఆమె మహా పతి వ్రత గా గణన కెక్కింది .ఆమె నామ స్మరణ చేతనే గంగా స్నాన పుణ్య ఫలం లభిస్తుంది .సాక్షాత్తునారాయణుడే ఆమె పాతి వ్రత్యాన్ని మిగిలిన పతి వ్రతల ముందు,ల క్ష్మీ దేవి ఎదుటనే పొగిడాడు .’’అరుంధతి ని మించిన పతి వ్రత లోకం లో ఎక్కడా లేదు .ఆమె రూప ,శీలా ,సౌందర్యాలు ,కాలోచిత భర్త్రు సేవ ,చాతుర్యం ,ఎవ్వరికీ లేవు .ఆమె పలుకులు మాధుర్య పూరితాలు .ఆ గాంభీర్యం ,గురు సంతోషణం అరుంధతీ దేవికి ఉన్నట్లు మరెవ్వరికి లేవు ,అరుంధతి ని స్మరించిన స్త్రీలు  ధన్యులు,అదృష్ట వంతులు ,పరిశుద్ధులు అవుతారు .అరుంధతి పుణ్య చరిత్రను ఏ ఇంట్లో చెప్పు కొంటారో అప్పుడు వారి లెక్కకు అరుంధతి మొదటి వ్రేలు నలన్కరిస్తుంది ‘’.అని విష్ణు మూర్తి లక్ష్మీ దేవితో అరుంధతి పాతి వ్రత్య గరిమను వివ రించాడు .శివ శర్మ ఎంతో సంతోష పడ్డాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List