ధ్రువుని భగవద్దర్శనం.. ధ్రువ బాలుడు యమునా నది ఒడ్డున ఉన్న మధు వనం చేరాడు .అది మొదటి భగవత్ స్థానం .అక్కడే హరి మేధసుడు అనే వాడు పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాత్ముడైనాడు .ఏ జంతువైనా అక్కడ ఉంటె ,పుణ్యం పొందేట్లు చేసే గొప్ప స్థలం .ధ్రువుడు పర బ్రహ్మ స్వరూపు డైన వాసు దేవుని జపిస్తూ విశ్వ మంతా వాసు దేవ మయం గా భావిస్తూ ఏకాగ్ర దృష్టి తొ ధ్యానం లో నిమగ్నమయ్యాడు .గోవింద నామం తప్ప ,ఆయన ధ్యాస తప్ప అతనికిన్కేమీ లేదు . ఉగ్ర తపస్సుకు ఆయన స్నానం చేసిన నదీ జలాలే కాలుష్యాన్ని వదలించు కొంటున్నాయి .సిద్ధుల తేజస్సు ఆయనలో ప్రకాశిస్తోంది .వాయుదేవుడు ఆయన వాక్కు లో సన్నిహితుడైనాడు .ఆకాశం శబ్ద రూపం తొ అతనిని ఆరాధించా టానికి అతని చెవులను ఆశ్రయిన్చిందిట .అంటే పంచ భూతాలచే ధ్రువుడు ఆరాధింప బడ్డాడు .
సాధారణం గా ఎవరు తీవ్ర తపస్సు చేస్తున్నా చెడ గొట్ట టానికి అప్సరసలను పంపే ఇంద్రుడు ధ్రువుడు బాలుడు కదా అని పంప లేదట .భయ పడేట్లు చేస్తే తపస్సు మానేస్తాదేమో నని భూత గణాలను పంపాడు భల్లూక ఆకారం ,ఒంటె మెడ ,పెద్ద కోరల భూతాలు మూడు వచ్చాయి .రంకెలు వేస్తూ ఒక ఎద్దు మీదికి వచ్చింది .ఒకటి మహా సర్పాకారం గా భయ పెట్టె రూపం తొ పెద్ద పడగల తొ మీదికోచ్చ్చింది .దున్న పోతు ఆకారపు భూతం మీద పడింది .ఖర్జూర చెట్టు వంటి తొడలతో ఒకటి ,మండే మంటలతో ఒకటి ,మబ్బులరూపం లో ఒకటి ,గుడ్ల గూబ ఆకారం లో ఒకటి ,అరుస్తూ వచ్చాయి .ఒక భూతం నోటిలో శిశువును కరచుకొని వచ్చి ధ్రువుని ఎడుటనే కర కరానమిలేసింది .ఒకటి పెద్ద మంటలను సృష్టించి భయ పెట్టె ప్రయత్నం చేసింది .ఒక భేతాళం పర్వతాలను ,చెట్లను నగ్గు నుగ్గు చేస్తూ భీభత్సం సృష్టించే ప్రయత్నం చేసింది ,ఒకటి అరుస్తోంది ,ఒకటి ప్రక్క వాటిని కరుస్తోంది .విపరీతం గా ఏడుస్తూ ఒకటి, బ్రతిమి లాడుతూ ఇంకోటి హడా విడి చేస్తున్నాయి .ఇంకో భూతం ఆడ దాని పొందు కంటే సుఖం ఏముంది ?తపస్సు చేసినా ఈ సౌఖ్యానికే గా అని అరిచింది .ఇంద్రియాను భవం కంటే గొప్పేమీ లేదని కామ సుఖాన్ని అనుభ వించ మని ప్రార్ధించింది ఇంకో గడుసు దెయ్యం .వీటికి వేటికీకి ధ్రువుని మనస్సు చలించలేదు భయ పడ లేదు .మళ్ళీ ఏకాగ్రత తొ నారాయణ మంత్రాన్నే జపిస్తున్నాడు .ఇంతలో భయంకర ఆభరణాలను ధరింఛి సుదర్శన చక్రం అక్కడున్న భూతాలకు భాయోత్పాతాలను కల్పించి పార ద్రోలింది .దాన్ని సాక్షాత్తు నారాయణుడే ధ్రువుని రక్షణ కోసం పంపాడు .
ఒక అందాల రాశి అక్కడికి వచ్చి ధ్రువుడు భూమి నుండి జన్మించిన తపోమ్కురం అని భావించి ,అతని నిశ్చల తపస్సుకు మెచ్చి నమస్కరించి వెళ్లి పోయింది .భయ పడిపారి పోయిన భూత గణమంతా బ్రహ్మ దేవుని చేరి పరిస్తితి వివ రించారు తమ ప్రయత్నాలన్నీ వ్యర్ధమైనాయని చెప్పారు .బ్రహ్మ వచ్చిన ఆ దేవ గణాన్ని చూసి ‘’దేవత లారా భయ పడద్దు .ధ్రువుడు ధ్రువ మైన పదాన్ని కాన్క్షిస్తున్నాడు .అంతే కాని మీ పదవులకోసం ఆశించటం లేదు .అతడు భగవద్భక్తుడు .అతని వలన భగవద్భక్తు లైన మీకు భయం లేదు .,విష్ణువు నే అతడు నమ్ముకొన్నాడు .ఆయన మాత్రమె అతని మనో భీష్టాన్ని తీరుస్తాడు .మీ పదవులకేమీ ఢోకా లేదు. స్తిర చిత్తం తొ ఉండండి ‘’అని చెప్పి పంపించాడు .
నారాయణుడు ధ్రువుని దృఢ దీక్షకు, తీవ్ర తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్ష మయాడు .’’బాలకా !నీ తపస్సుకు మెచ్చాను .తపస్సు చాలించు .కావలసిన వరాన్ని కోరుకో ‘’అన్నాడు .ధ్రువుడు కళ్ళు తెరచి అక్కడున్న్న లక్ష్మీ నారాయనులను చూసి సంభ్రమాశ్చర్య చకితుడై డైనాడు .ధ్రువ బాలుని వ్రేలు అంది పుచ్చుకొని విష్ణు మూర్తి పైకి లేవ దీశాడు .అతని ధూళి దూసర శరీరాన్ని ఆప్యాయం గా స్పృశించాడు వాసు దేవుడు .దీని తొ ధ్రువుడు తెప్ప రిల్లి తేరి పార జూశాడు .మహ దానందం తొ ధ్రువుని నోటి నుండి సుశబ్ద భూయిష్టమైన సంస్కృత స్తోత్రం గంగా ప్రవాహం లా వెలు వడింది.

No comments:
Post a Comment