శాశ్వత సత్యాలు. ~ దైవదర్శనం

శాశ్వత సత్యాలు.


పరమ‌ గురువులు, ధన్యాత్ములు, మహాత్ములు మాట్లాడటం వలన శక్తి ప్రసారమవుతుంది. వారి నుండి ప్రసరించే శక్తి ఇతరులకు సామర్థ్యం కలిగిస్తుంది. అది ముఖ్య ప్రయోజనం, మీరు మాట్లాడిన మాటకి ప్రయోజనం ఉండాలి.

 సొంతంగా ఆలోచనలు, సొంతంగా ప్రణాళికలు, ఉంటూంటునే సొంతంగా సమస్యలు ఏర్పడుతుంటాయి. అపుడు సొంతంగానే బాధపడవలసి వస్తూంటుంది.

 తనకున్న సమస్యలు, చిక్కులు, నష్టాలు పూర్తిగా చెప్పుకోక కొన్నిటిని దాచి సలహాలు అడుగుతున్న వాడికి పనులు కూడా కాస్త కాస్త అవుతుంటాయి.

 కుక్కకి, పందికి, మనిషికి‌ శరీరం పోతే మోక్షం వస్తుంది అంటే అదే కనుక మోక్షమైతే దాని కొరకు వేదాంతాలెందుకు? బాధలెందుకు?

తరతరాల నుండి మోక్షం మోక్షం అనే పదం వినిపిస్తోంది. మోక్షం అంటే తెలీదు అంటారు కొంతమంది. అదంతేలే అంటారు కొంతమంది. మేం ఎరుగుదుములే అన్నట్లు ముఖం పెడతారు కొంతమంది.

 మోక్షం అంటే ఏమిటో తెలియనివాడికి మోక్షం అంటే ఆ పదం‌ మాత్రమే అర్థం. మామిడి పండు తిననివాడు దాని గురించి విని మామిడి పండు అని మురిసిపోతున్నాడంటే వాడెరిగింది ఆ పదం యొక్క రుచినే గాని పండు రుచి కాదు.

 అందుకని 'మోక్షం కోసం' అని వల్లెవేయడం మాని తన పని తాను చెయ్యడం ముఖ్యం..............
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive