కాశీ ఖండం –13 ~ దైవదర్శనం

కాశీ ఖండం –13

 సోమ లోక వర్ణనం...అలకా పురి కి ముందు ఈశానుని పట్నం ఉండి .అక్కడ తపోధను లైన రుద్రా భక్తులుంటారు .అజైక  పాదుడు ,ఆహిర్బుద్నుడు మొదలైన ఏకాదశ రుద్రులు శూలాలు ధరించి ఈ లోకం లో ఉంటారు .వీరంతా కాశీ లో ఈశానేశ లింగాన్ని స్తాపించి అర్చించి తపస్సు చేసిన వారే .వీరందారు దిక్కులకు ఈశ్వరు లవుతున్నారు . జటా జూతాలతో ఫాల నేత్రాలతో ఉంటారు నీల గళులు .వృషభ ధ్వజులు

              పగటి వేళ  పురాన్ని చంద్రుడు తన కాంతి తో ప్రకాశింప జేస్తున్డటం చూసి సోమ శర్మ కు సందేహం వచ్చి ప్రశ్నించాడు విష్ణు గణాన్ని ..ఇదే సోమ లోకమని అది పతి చంద్రుడని చెప్పారు  .అమృత వర్షం తో చంద్రుడు ఈ లోకాన్ని వెన్నెల ల తో తడుపుతుంటాడు .సోమనాధుని తండ్రి అత్రి భగ వానుడు .ఇతడు ప్రజాపతి అయిన బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేశాడు .ఆయన రేతస్సు ఊర్ధ్వ ముఖం గా ప్రయాణించి సోమత్వాన్ని పొందింది .ఆ రేతస్సును బ్రహ్మ గారి అనుజ్న చేత పది మంది స్త్రీలు భుజించి గర్భాన్ని పొందారు .నెలలు గడిచిన కొద్దీ గర్భాన్ని భరించలేక పోయి ,పది దిక్కులలోనూ సోములను కన్నారు .ఆ పదీ ఒక ఆకారం గా మారి సోముడు అనే పేరు తో భూమి మీద పడ్డాడు అతన్ని బ్రహ్మ రదా రూఢుని చేసి ఇరువది ఒక్క సార్లు భూ ప్రదక్షిణ చేశాడు .ఆ సోమ నుండి  తేజం భూమి మీద పడింది ఆ తేజస్సు వల్ల అన్ని ఓషధులు ,జన్మించాయి .విశ్వం ఆ ఒషదులన్నిటిని ధరించి కాంతి వంత మయింది .సోముడు బ్రహ్మ కృప వల్ల వృద్ధి పొందాడు తామర తూడులు మాత్రమె తింటూ తపస్సు చేశాడు .కాశీ పట్టణ రూపాన్ని పొంది అక్కడ  తన పేరా అమృత లింగాన్ని స్తాపించాడు .ఒషధులకు ,ఉదకాలకు ,అగ్ర జన్ములకు కారణ మయ్యాడు .అక్కడ ఒక బావి త్రవ్వించి ,అందలి నీటికి అమృత జలం అని పేరు పెట్టాడు .ఆ నీటిలో స్నానం చేసి త్రాగిన వారికి జ్ఞానాభి వృద్ధి కలుగుతుంది .శివుడు సోముని కళల లో ఒక కల ను గ్రహించి తన శిరసున ధరించాడు .దీంతో జగత్తంతా సంజీవితం పొందింది .ఆ తర్వాతశాపం పొంది పదిహేను రోజులు వృద్ధిని పది హేను రోజులు క్షీణత ను పొందాడు .అతని లోకానికి బ్రహ్మాది దేవతలు వచ్చి పోతుంటారు .అత్రి భ్రుగువు మున్నగు ఋషులకు నిలయం .సోమునికి ‘’కుహు ,సిని ,ద్యుతి ,పుష్టి ,ప్రభావసు ,కీర్తి ధృతి ,లక్ష్మి ‘’మొదలైన తొమ్మిది మంది దేవతలు సేవించారు .యజనము తసస్సు చేశాడు చంద్రేశ్వర లింగ సమీపం లో రాజ సూయ యాగం చేశాడు .

                చంద్రేశ్వర దర్శనం చేసిన వారికి పూజించిన వారికి పాప ప్రక్షాళన జరుగుతుంది .అక్కడ సిద్ధ యోగీశ్వర పీఠం ఉండి .సాధకుల కోసం అనేక పీఠం లున్నాయి ..అక్కడి నుండి నక్షత్రలోకానికి శివ శర్మ ణు విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List