కాశీ ఖండం –14 ~ దైవదర్శనం

కాశీ ఖండం –14


నక్షత్ర ,బుధ లోక వర్ణన..  శివ శర్మ విష్ణు దూతలను నక్షత్ర లోక విశేషాలను గురించి చెప్పమని అడుగగా వారు వివరించారు .పూర్వం బొటన వ్రేలి వెనుక భాగం చేత సృష్టి నంతా సృజించిన దక్ష డు ప్రజాపతి అయాడు .ఆయనకు అరవై మంది కుమార్తెలు .వారంతా మంచి రూపం తో లావణ్యం తో ఉన్న వారు .వారిలో రోహిణి మిక్కిలి సౌందర్య వతి .వారందరితో దక్షుడు కాశీ నగరం లో ఘోర తపస్సు చేశారు .సోమ శేఖరుని ఆరాధించారు .ఈశ్వరుడు సంతోషించి ప్రత్యక్ష మై వరం కోరుకో మన్నాడు .దక్షుని కూతుళ్ళు ‘’నీ వంటి తాపహారి,రూప సంపన్నుడు ,అయిన భర్తను ప్రసాదించు ‘’అని కోరారు .వారు నక్షత్రేశ్వర లింగాన్ని స్తాపించి వరుణా  నది ఒడ్డున సంగమేశ్వర స్వామి సన్నిధి లో చాలా కాలం తపస్సు చేశారు .వారి స్తిర మనస్సు కు సంతసించి ‘’అమ్మాయిలూ !మీరు చేసిన పురుషాయతన తపస్సుకు మెచ్చాను .మీ కోరిక నేర వేరుతుంది .జ్యోతిశ్చక్రం లో మీరు అగ్ర గణ్యు లవుతారు .మీ నుడి మేషం మొదలైన రాశులు జన్మిస్తాయి బ్రహ్మ చేత ఒషదీషుడు గా చేయ బడిన సోముడు మీకు భర్త అవుతాడు .మీరు పూజించిన ఈ నక్షత్రేశ  లింగాన్ని అర్చించిన వారు నక్షత్ర లోకం చేరతారు

                అక్కడి నుండి బుధ లోకం చేరారు ఇది బుధ లోకమని విష్ణు దూతలు చెప్పారు .దీనిని చూసిన వారు స్వర్గాన్ని కూడా కోరుకోరు .సోముడుద్విజ రాజయ్యాడు .రోజుకు పది పద్మాలను మాత్రమె భుజిస్తూ రాజ సూయ యాగం చేశాడు .త్రిభువనాలను దక్షిణ గా ఇచ్చాడు .అతడు బ్రహ్మ మనుమడు .అత్రి నేత్రం నుండి జన్మించాడు .ఒషధులకు అధిపతి .షోడశ కలలున్న వాడు .తన అమృత కిరణాలచే లోకాల తాపాన్ని తీరుస్తాడు .సోముని పదునారవ కళను శివుడు శిరస్సున ధరించాడు .

             చంద్రుడు ఆంగిరసుని తమ్ముడగు బృహస్పతి భార్యను మదము  తో కామించాడు .దేవతలు ,ఋషులు వద్దని వారించినా విన కుండా బృహస్పతి భార్య తార ను మోహించాడు .ఇదంతా మన్మధుని ప్రతాపం .అజగం అనే ధనుస్సును చేతి లో ధరించి తన తలపై ఇతన్ని ఉంచుకొన్నా తారను వదిలి పెట్ట లేదు .అప్పుడు బృహస్పతి బ్రహ్మ శిరో నామ కాస్త్రాన్ని సోముడి పై విడిచి పెట్టాడు . బ్రహ్మాండ మంతా భయపడి పోయింది .వెంటనే బ్రహ్మ వచ్చి తారను సోముని నుండి విడి పించి బృహస్పతికి ఇచ్చాడు .ఆమె అప్పుడు గర్భ వతి.ఆ గర్భాన్ని వదిలించుకో మని బృహస్పతి ఆమె కు చెప్పాడు .ఆమె ముండ్ల పోద లోకి వెళ్లి ఒక స్తంభం చాటు చేరి గర్భ స్రావం చేసుకొన్నది .దేవతలు ఆ శిశువును తీసుకొని వచ్చి తారను గ్రహించ మన్నారు .ఆ శిశువు సోముడికి జన్మించాడా బృహస్పతికా అని అడిగారు .ఆమె చెప్ప లేక పోయింది .బ్రాహ్మ వాళ్ళను దూషించాడు .బ్రహ్మ తారనే అడిగాడు .చంద్రుని కుమారుడే అని చెప్పింది .శిశువుకు‘’బుధుడు ‘’అని పేరు పెట్టాడు .కొడుకు తండ్రి దగ్గరికి వెళ్లి తాను తపస్సు చేసుకోవాలను కొంటున్నానని చెప్పాడు .కాశీ వెళ్లి ఒక లింగాన్ని స్తాపించి పూజించాడు అదే బుదేశ్వర లింగం .శివుడు ప్రీతీ చెంది వరం కోరుకో మన్నాడు .అతని కోరిక నను సరించి నక్షత్ర లోకానికి పైన ఉన్న లోకం బుధ లోకమని పేరు పొందింది .బుదేశ్వర లింగం దుష్ట బుద్ధిని పోగొట్టు తుంది .సజ్జను ల చే గౌర వింప బడే వారు బుధ లోకం చేరుతారు .చంద్రేశ్వర నుకు తూర్పుగా ఉన్న బుదేశ్వర లింగాన్ని దర్శించిన పుణ్యాత్ముడు అంత్య కాలం లో ఉత్తమ బుద్ధి పొందుతాడు. 
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List