కాశీ ఖండం –6 ~ దైవదర్శనం

కాశీ ఖండం –6


 యమపురి వర్ణనం:..
సాధ్వి లోపాముద్ర భర్త అగస్త్య ముని ని ‘’శివ శర్మ హరిద్వారం లో మరణింన్చినా మోక్షం పొందకుండా ,విష్ణు లోకానికి ఎందుకు వెళ్లాడు ?/అని ప్రశ్నించింది .దానికి మహర్షి వివరించి చెబుతున్నాడు .అన్ని క్షేత్రాలు ముక్తి క్షేత్రాలు కావనియు ,దాని గురించిన వివరాలను చెప్పాడు .శివ శర్మ ను యమ లోకానికి తీసుకొని వెళ్లారు ముందుగా విష్ణు దూతలు …అక్కడ విక్రుతాకారులు కన్పించారు .అది పిశాచాలోకమని పాప కర్మలు చేసిన వారు ,పరిశుద్ధ మైన మనస్సు లేని వారు ఇక్కడికి వస్తారని చెప్పారు .ఆ తర్వాతా కొంత దూరం లో మనోహరాకారులు ,శ్యామలాకారులు కనిపించారు .అది గుహ్య లోకమని ,న్యాయం గా డబ్బు సంపాదించిన వారు ఇక్కడికి వస్తారని చెప్పారు .సంపాదించిన డబ్బును దాస్తారు కనుక గుఖ్యక లోకం అంటారు వీరిది దాన ధర్మాలు తెలియవు .సుఖం గా మాత్రం ఉంటారు .బ్రాహ్మణులను పూజించి గోదానం ఇస్తారు .దేవతల్లాగా స్వర్గ సౌఖ్యం పొందుతారు .

          కొంత దూరం పోయిన తర్వాతా గాంధర్వ లోకం కని పించింది డబ్బున్న వారిని సంగీతం తో సంతోష పెట్టినవారిక్కడికి వస్తారు ఈ గాంధర్వ విద్య తోనే నారదుడు దేవర్షి అయ్యాడు .వీరంతా శివుని సంతోష పెడతారు .హరి హరుల సమక్షం లో పాడిన వారు మోక్షం పొందుతారు .తర్వాత విద్యాధర లోకం చేరారు .అన్ని విద్యలలో నిష్ణాతులు ఈ లోకం లో ఉంటారు ..ఇంతలో యమ ధర్మ రాజు అనుచర గణం తో అక్కడికి చేరాడు .ఆయన సౌమ్య మైన ఆకారం తో ,తెల్లని వస్త్రాల తో కని పించాడు .యముడంటే అందరు భయ పడతారు కాదా ఇంత సాధువు లాగా ఉన్నాడేమిటి /?అని శివ శర్మకు సందేహం కలిగింది .అప్పుడు విష్ణు దూతలు పాపాత్ములకు యముడు భీకరం గా ,సజ్జనులకు సౌ మ్యుడు గా దర్శన మిస్తాడని ,హరిద్వారం లో చని పోవటం ,ధర్మ శాస్త్రధ్యయనం చేయటం వల్ల శివ శర్మకు మంచి గా  కని పించాడని చెప్పారు .(ఒకప్పుడు బళ్ళారి రాఘవ గారు సావిత్రి నాటకం లో సావిత్రి వద్దకు ఆమె భర్త సత్య వంతుని ప్రాణాలను తీసుకొని వెళ్ళే సందర్భం లో ధవళ వస్త్రాల తో చాలా సౌమ్యం గా రంగ ప్రవేశం చేసి నటించారట ,.ఆ నాటకం అయిన తర్వాతా విశ్లేషకులు అలా ఎందుకుఅలా  చేశారు అనిఅడిగారట .దానికి రాఘవ –నేను  యమధర్మ రాజు గా సతీ సావిత్రి అనే పతీవ్రత  దగ్గరకు వస్తున్నాను యముడుధర్మాధర్మాలు తెలిసిన వాడు కనుక ధర్మ రాజు అని పిలువబడుతాడు . మంచి వారికీ మంచి గా, దుష్టులకు భయంకరం గా కనీ పిస్తాడని శాస్త్రాలు చెప్పాయి అని వివ రించారట )..నిజం గా ఆయన పసుపు పచ్చని నేత్రాలు కలవాడు .కోపం తో అవి యెర్ర గా ఉంటాయి .అక్కడున్న వారికి వారి పాపాలననుసరించి శిక్షలు ప్రకటిస్తున్నాడు యమ ధర్మ రాజు  .

            దుఖితుల దుఖాన్ని పోగొట్టే రాజులు యమ ధర్మ రాజు సభా సదులు గా ఉంటారు .ఉసీనరుడు ,సుధాన్వుడు ,వృష పర్వుడు ,జయద్రధుడు ,రాజ సహస్ర జిత్తు ,దృఢ దానవుడు ,రిపున్జయుడు ,యవనాశ్వుడు ,దంత వక్త్రుడు ,నాభాగుడు ,రిపు మంగళుడు ,కరంధముడు ,ధర్మ సేనుడు ,పరమర్ధనుడు ,పరాన్తకుడు మొదలైన నీతి మంతులైన రాజులు ,ధర్మా ధర్మాలు తెలిసిన వారు సుధర్మ సభ లో ఉంటారు .శివ ,విష్ణు నామాలను సదా జపించే వారు యమునికి దూతలు గా పని చేస్తారు ..వీరు విష్ణు శివ కీర్తనలను చేసే వారి దగరకు పోరాదని యమ శాసనం .యమ ధర్మ రాజు రచించిన ‘’లలిత ప్రబంధం ‘’అనే మహా గ్రంధం నామాన్ని స్మరించే వారికికూడా  పునర్జన్మ ఉండదు అని విష్ణు దూతలు శివ శర్మ కు చెప్పినట్లు అగస్త్య ముని లోపాముద్ర కు తెలియ జేశాడు .అక్కడి నుండి విష్ణు దూతలు శివ శర్మను అప్సరలోకానికి ,ఆ తర్వాత సూర్య లోకానికి తీసుకొని వెళ్లారు .ఆలోకాల వివరాలు ఈ సారి తెలుసు కొందాం 
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List