కాశీ ఖండం –4 ~ దైవదర్శనం

కాశీ ఖండం –4



                                                                       తీర్దాధ్యాయం 

 కొల్హా పుర మహా లక్ష్మీ దేవి సందర్శనం తో పులకించిన అగస్త్య లోపాముద్ర దంపతులు తమకు అమ్మ వారి దర్శనం పరోప కారం వల్ల కలిగిన ఫలం అని భావించారు .అక్కడి నుండి త్రిపురాంతకం చూసి శ్రీశైలం చేరారు .శ్రీ శైల శిఖరం చూసి పునర్జన్మ లేని దాని దర్శనానికి ఆనంద పడ్డారు .;శ్రీ శైల పర్వతం ఎనభై నాలుగు యోజనాల విస్తీర్ణం కలదని భార్యకు తెలియ జేశాడు ముని .లోపాముద్ర భర్త తో ‘’స్వామీ ! భర్త అనుజ్న లేకుండా భార్య యే పనీ చేయ రాదు కదా .ఇక్కడి శిఖరాన్ని చూస్తె పునర్జన్మ లేదు కదా మరి మనకింక కాశీ తో పనేమిటి ?’’ అని అడిగింది .దానికి మహర్షి ‘’ఈ విషయాన్ని పూర్వం మహర్షులు చర్చించి కొన్ని నిర్ణయాలు చేశారు .ఆ వివరాలను నీకు తెలియ జేస్తాను .ముక్తి క్షేత్రాలు చాలా ఉన్నాయి .అందులో మొదటిది తీర్ధ రాజం అని పేరు పొందిన ప్రయాగ .ధర్మార్ధ మోక్ష కామాలనిచ్చేది నైమిశారణ్యం .కురుక్షేత్రం ,హరిద్వారం ,ఉజ్జయిని ,అయోధ్య ,మధుర,ద్వారక ,అమరావతి ,సరస్వతీ సాగర సంగమం ,గంగా సాగర సంగమం ,కాంతి త్ర్యయంబకం .సప్త గోదావరీ తీరం ,కాలంజరం ,ప్రభాస తీర్ధం ,బదరికాశ్రమం ,కాశి ,ఓంకారక్షేత్రం ,పురుషోత్తమం ,గోకర్ణం భ్రుగు కచ్చం ,భ్లు తుంగం ,పుష్కరం ,శ్రీ శైలం ,ధారారా తీర్ధం ,మానసతీర్ధం లమొదలైనవి మొక్షాన్నిచ్చేవి .గయా తీర్ధం పితృదేవత లకు మోక్షాన్ని స్తుంది .అక్కడే పితృ పితామహ ప్రపితామహులు తరిస్తారు ‘’అని చెప్పాడు .

              అప్పుడు భార్య మానస తీర్ధాన్ని గురించి వివరించ మని కోరింది .అగస్త్యుడు ‘’సత్యం ,క్షమా ,ఇంద్రియ నిగ్రహం ,సర్వ భూత దయ ,నిష్కాపట్యం ,దానం దమం ,శమం సంతోషం అనేవి మానస తీర్ధాలు .వీటన్నిటి తో బాటు  బ్రహ్మ చర్యం ,ప్రియ భాషణం ,జ్ఞానం, ధృతి ,తపస్సు కూడా మానస తీర్ధాలే .వీట న్నిటి కంటే ముఖ్యం మనసును పరి శుద్ధం గా ఉంచుకోవటం .తీర్ధాలలో స్నానం స్నానమే కాదు .ఇంద్రియ నిగ్రహం ,మాస పరిశుద్ధత లేకుండా ఎక్కడ స్నానం చేసినా మలినాలు ,,పాపాలు పోవు .మనసు లో మాలిణ్యం లేని వాడే   సుస్నాతుడని పిలువ బడుతాడు .దానం తపస్సు శౌచం లేకుండా చిత్తం ప్రశాంతిని నిర్మలత్వాన్ని పొందడు .ఇంద్రియాలను నిగ్రహించి ఉన్న చోటే నైమిశం కురుక్షేత్రాదులు .రాగ ద్వేషాలను వదిలి జ్ఞాన జలములో ధ్యానం చేత పవిత్రుడయ్యే వాడు మానస తీర్ధ స్నానం చేసిన వాడే .ఉత్తమ లోకా లను పొందుతాడు .ఋషులు తిరుగాడిన నెల ,స్నానం చేసిన తీర్ధాలు పుణ్యప్రదాలు ,పరమ పవిత్రాలు .కనుక అక్కడ స్నానం చేస్తే ఉత్తమ లోకం వస్తుంది .తీర్ధాలలో ఉపవాసం చేసి దానాలిచ్చి ,అగ్నమాది క్రతువులు చేయాలి .ఎవరి మనసులో విద్యా తపస్సు కేర్తి ఉంటాయో వారికి తీర్ధ యాత్రలు ఫలిస్తాయి .గర్వం లేని వాడు సత్య భాషి ,దృఢ వ్రతుడు ,సర్వ భూత సముడు పొందే ఫలాన్ని తీర్ధ యాత్ర చేసిన వారు పొందుతారు ..తీర్ధాలకు వచ్చి అక్కడి దేవతలను ముందుగా ప్రార్ధించాలి అప్పుడు స్నానం చేస్తేనే ఫలితం ఉంటుంది .శ్రద్ధ తో తీర్ధ యాత్ర చేస్తే పాప ప్రక్షాళనం జరుగు తుంది .ఇతరుల కోసం తీర్ధ యాత్ర చేస్సిన వాడికి పదహారవ వంతు ఫలం దక్కుతుంది .తీర్ధం లో ఉప వాసం శిరో మున్దనం చాలా ముఖ్య మైనవి .క్షౌరం వల్ల శిరోగత పాపాలు పోతాయి .తీర్ధాలలో శ్రాద్ధం పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తృప్తి చెందుతారు .తీర్ధ యాత్ర సర్వ సాధక మైనది ..మోక్ష ప్రదాయక మైనది .కాశి ,కంచి ,హరిద్వారం ,అయోధ్య ,ద్వారక ,మధుర ,ఉజ్జయిని మోక్ష పురాలు గా ప్రశిద్ధి చెందాయి .శ్రీ శైలం మోక్షదాయకం అంతకంటే కేదారం గొప్పది ఈ రెంటికంటే .గొప్పది ప్రయాగ. దీనికంటే అవిముక్త క్షేత్రం కాశి మహా గొప్పది కాశిలో చని పోతే మోక్షమే .తీర్ధ కోటికి అందని ముక్తి కాశీ లో లభిస్తుంది ..పూర్వం విష్ణు దూతలు శివ శర్మ అనే అతనికి చెప్పిన విషయాన్ని తెలియ జేస్తా విను ‘’అన్నాడు మహర్షి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List