హనుమంతుడికి పూజ సర్వసంపత్కరం. ~ దైవదర్శనం

హనుమంతుడికి పూజ సర్వసంపత్కరం.

హనుమంతుడికి పూజ సర్వసంపత్కరం .....
* రామమంత్ర రహస్యం...
* మహా శక్తివంతమైన శ్రీ హనుమాన్‌ యంత్రం ...
* సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధం.....
.
హనుమంతుడు చిరంజీవి కావడంతో, హనుమ చిరంజీవి వరాన్ని పొందడం వలన.. ఆయన్ని ఆరాధిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు. అందుచేత గ్రహసంబంధమైన దోషాల వలన ఇబ్బందులు పడుతున్న వాళ్లు, దుష్ట ప్రయోగాల వలన అవస్థలు పడుతున్న వాళ్లు హనుమంతుడిని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. గ్రహ పీడలను తొలగిస్తూ ... దుష్ట ప్రయోగాలను తరిమికొట్టే హనుమంతుడి ఆలయాలు ఆయా క్షేత్రాల్లో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి.
మన సనాతన ధర్మాలలో అనేకమంది ఉపాస్య దేవతలున్నారు. స్మార్తోపాసనలో పంచ దేవోపాసన ప్రసిద్ధమైంది. కానీ ఈ ఉపాస్య దేవతలందరిలోనూ సాకార బహ్మచర్య రూపాన్ని ధరించినవాడు హనుమంతుడు. బ్రహ్మచర్య పాలన, శతృ నిగ్రహం, కామ విజయం, కార్యసిద్ధి తదితర విషయాల దృష్టా్య హనుమంతుడు ప్రసిద్ధి. దాస్య భక్తికి చక్కని నిదర్శనంగా నిలిచిన హనుమంతుడు అంజనీ పుు్తడ్రు, పవన సుతుడు, రుదవ్రతారమూర్తి, కేసరీ నందనుడు, సాధు శిరోమణి, కపి శిరోమణి, భక్త శిరోమణి, పాపనాశకరుడు తదితర పేర్లతో హనుమంతుని మనం స్మరిస్తాం. రుదవ్రతారుడు కావడం చేత శంకర నందనుడయ్యాడు. కేసరికి ఔరసపుు్తడ్రవ్వడం వల్ల కేసరి నందనుడయ్యాడు.సింధూర వర్ణ శోభితంగా దర్శనమిచ్చే హనుమంతుని దర్శనం, స్మరణం, కీర్తనంవల్ల సమస్త దారిద్య్రాలూ నిర్మూలింపబడి, శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.
పుంజిక స్థల అనే అప్సరస శాపగ్రస్తురాలై కామరూపం గల దివ్యాతిదివ్యమైన వసా్తల్రను ధరించి పర్వతం మీద సంచరిస్తుంటుంది. ఆమెను వీక్షించిన వాయుదేవుడు, ఆమె వైపు పురోగమించాడు. ఈ హఠత్పరిణామానికి విస్తుపోయిన పుంజిక స్థల, పతివ్రత అయిన తనను స్మృశించిన వారెవరని గద్దించింది. అప్పుడు వాయుదేవుడు `దేవీ అలాంటిదేమీ లేదు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అనాధ నాధుడు, కరుణామయుడైన భగవానుడు భూభార హరణార్థం మానవ రూపాన అవతరింపనున్నాడు. ఆ పరమాత్ముని సేవకోసం నీ పుత్రునిగా మారుతి పుట్టి విఖ్యాతుడవుతాడు' అని చెప్పాడు. అలా హనుమంతునికి పవనసుత- అంజనీపుత్ర అనే నామాలు వచ్చాయి.
రామమంత్ర రహస్యం: ...
అంతటి మహిమాన్వితుడైన హనుమంతుడు మహాతత్వవేత్త. సనక, సనందన, సనత్కుమార, సనాతన సోదరులు నలుగురు హనుమంతుని ద్వారా రామమంత్ర రహస్యాన్ని గ్రహించారు. హనుమదుపాసన అన్నివిధాల శ్రేయస్కరంగా పురాణాలు చెబుతున్నాయి. ఏకాగ్రతకు, స్వచ్ఛతకు మారుపేరు హనుమంతుడు కావడంవల్ల ఆ స్వామి దర్శనం, పూజలవల్ల ఏకాగ్ర చిత్తం ఏర్పడి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భూత పిశాచ పీడల నివారణకు హనుమంతుని స్మరణయే పరమావధిగా చెబుతారు. బుద్ధి, వీర, బలాదులను హనుమంతుడు తన భక్తులకు ప్రసాదిస్తూ వుంటాడు. భూత, ప్రేత రాక్షసాదులు ఆ మహాత్ముని నామోచ్ఛరణ మాత్రం చేతనే పారిపోతాయి. స్మరణం మాత్రం చేతనే సమస్త రోగాలు శాంతిస్తాయి. మానసిక దౌర్బల్య సంఘర్షణలలో ఆ స్వామి సహకారం లభిస్తుంది. హనుమంతుని సహకారం వల్లనే తులసీదాస మహాకవికి శ్రీరామదర్శన మహాద్భాగ్యం కల్గింది.
హనుమంతుడు బాలబ్రహ్మచారి:....
ఆ మహనీయుని ధ్యాస బ్రహ్మచర్యానుష్టంవల్ల నిర్మలంతకరణమందు సమగ్రమైన భక్తి ఉద్భవిస్తుంది. హనుమంతుని ఆరాధించడంవల్ల ఆయనలోని సద్గుణాలన్నీ సాధకులూ, భక్తులకు లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అపారమైన శ్రీరామభక్తికి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు. హనుమంతోపాసన పరమోతృ్కష్టమైనది. హనుమదుపాసనకు ఏ నియమం లేదు. వయసు, కులం, మతం తేడాలు అంతకన్నా లేవు. నిష్కల్మషమైన భక్తి విశ్వాసాలుంటే, ఆ స్వామి కరుణిస్తాడు. అనుగ్రహించి కోరినవన్నీ సమకూరుస్తాడు. హనుమదుపాసనకుగాను కొంతమంది అర్థమండల, మరికొంతమంది మండల దీక్షలు చేపడతారు. ఆ దీక్షలన్నీ వారి వారి నమ్మకాలనుబట్టి చేస్తున్నప్పటికీ స్వామి సాక్షత్కారానికి భక్తి ఒక్కటే మార్గం.
సూర్యాంజనేయం:....
శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి. హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.
బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం :....
హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎరన్రి సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కానీ ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.
సూర్యశిష్యరికం :.....
బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కానీ చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాసా్తల్రు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు. ఘడియకు లక్షా డెబై్బ వేల యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. జాజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.
సూర్యు పుత్రునికి స్నేహితుడు :....
సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.
సూర్యుని మనుమడు :.....
కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.
సూర్యుని అల్లుడు :.....
వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కానీ, భార్య గురించి కానీ ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.
సూర్యవంశీయుని భక్తుడు :.....
హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైన నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.
త్రిమూర్తుల శక్తి :.....
సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకమైనట్టే. సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాసా్తల్రు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాం జనేయులను ద్విగు ణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించవచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్తా్యత్మకంగా విస్తరించింది.
హనుమాన్‌ యంత్రం:.....
ఆంజనేయుడు కొలువై ఉండే శ్రీ హనుమాన్‌ యంత్రం మహా శక్తివంతమైనది. శ్రీ హనుమాన్‌ యంత్రం ఇంట్లో ఉందంటే ఆంజనేయుడు కొలువై ఉన్నట్లే. ఇది ముఖ్యంగా వాహన ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది. హనుమంతునికి మంగళవారం ఇష్టమైన రోజు కనుక, శ్రీ హనుమాన్‌ యంత్రాన్ని మంగళవారం తెచ్చుకోవడం శ్రేయస్కరం. శ్రీ హనుమాన్‌ యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రార్ధించాలి. తర్వాత ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి యంత్రాన్ని ధరించాలి. రోజూ స్నానం చేసిన తర్వాత 11 సార్లు ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా చేసినట్లయితే వాహన ప్రమాదాలు చోటు చేసుకోవు. చిన్నారులచేత శ్రీ హనుమాన్‌ యంత్రాన్ని ధరింపచేయడం మంచిది. పిల్లలకు ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః మంత్రాన్ని నేర్పి నిత్యం కనీసం మూడుసార్లు అయినా జపించమని చెప్పాలి. హనుమంతుడు శ్రీరామునికి నమ్మినబంటు. రాముడికి గుండెలోనే గుడి కట్టి పూజించాడు. శ్రీరాముని అంగుళీయకం చూపి సీతమ్మను ఓదార్చాడు. లంకాదహనం చేశాడు. సుగ్రీవుని రక్షించాడు. సర్వ అభయ దీక్షాదక్షుడు. హనుమంతుని భక్తులు చింతలు, చిరాకులకు దూరంగా ఉంటారు. రామనామం ఎంత మధురమైనదో చాటి చెప్పాడు హనుమంతుడు. శ్రీరాముడు తన అవతారం చాలిస్తూ కలియుగం అంతమయ్యేవరకూ భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడమని, భయాలూ, ఆందోళనల నుండి రక్షించమని, భూత, ప్రేత, పిశాచాల్లాంటి బాధలు, భయాల నుండి బయట పడేయమని, ఆర్తజన రక్షకుడిగా ఉండమని కోరాడు. శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించాడు హనుమంతుడు. ఆంజనేయుడు భక్తుల మొర ఆలకిస్తాడు. ఆదుకుని ఆపదలు తొలగిస్తాడు. ఆందోళనల నుండి విముక్తి కలిగిస్తాడు. హనుమంతుడు కొలువై ఉండే శ్రీ హనుమాన్‌ యంత్రం ఎలాంటి ప్రమాదాలూ జరక్కుండా కాపాడుతుంది.
అపారమైన విశ్వాసం, నిష్కల్మష సేవాగుణాలే హనుమంతుని అనుగ్రహానికి కారణమవుతాయి. హనుమంతుడి సేవను రోజూ చేయడం తప్పనిసరి. మన దైనందిన జీవితంలో అనేకానేక భయాలు వెంటాడుతూ వుంటాయి. వీటన్నింటికీ దూరంగా వుండి, మనస్సు ప్రశాంతంగా వుండాలంటే హనుమదుపాసనే మార్గం. అయితే హనుమంతుని పూజకు మంగళ, శనివారాలు శ్రేష్టమైనవిగా పెద్దలు చెబుతారు. స్వామి మంగళప్రదుడు కావడంవల్ల మంగళవారం పూజిస్తారు. అలాగే శని దోషాలను నివృత్తిచేయువాడు కనుక శనివారం కొలు స్తారు. ఆయా రోజులలో స్వామిని తమలపా కులతో సేవించడం విశేషమైన ఫలితాల నిస్తుందంటారు. సింధూర వర్ణ శోభితంగా దర్శనమిచ్చే హనుమంతుని దర్శనం, స్మరణం, కీర్తనంవల్ల సమస్త దారిద్య్రాలూ నిర్మూలింపబడి, శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి (ఆన్ లైన్ ఎడిటర్)
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
హిందూ ధర్మ సంరక్షణ కోసం మీవంతు సహయం చేయండి..
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List