కాశీ ఖండం –2 ~ దైవదర్శనం

కాశీ ఖండం –2




అగస్త్యాశ్రమం

   దేవతలందరూ వార ణాసి  చేరి అయిదు రోజులు నిత్యమ గంగా స్నానం చేస్తూ విశ్వేశ్వర విశాలాక్షీ అన్నపూర్ణా,దుం థిగణపతి ,కాల భైరవులను దర్శించారు .ఆ తర్వాత అగస్త్య ముని ఆశ్రమాన్ని చేరుకొన్నారు ..అగస్త్యుడు తన పేర అగస్త్యేశ్వర స్వామిని స్తాపించి ,జప హోమాలను చేస్తూ పరమేశ్వర ధ్యానం లో భార్య లోపాముద్ర తో గడుపుతున్నాడు .సముద్రాలను తన పురది శిలి లో ఉంచి పానం చేసి నప్పుడు అందులో ఉండే బడ బాగ్ని ఆయన శరీరం  లో ప్రవేశించి ,దివ్య కాంతులను వెలువరుస్తోంది .ఆయన తన తపస్సు చే సూర్యుని ప్రకాశింప జేస్తున్నాడు ,అగ్నిని మండింప జేస్తున్నాడు ,ఆయన తపో బలం వల్ల చపలాలు ఆచపలాలుగా మారాయి ..ఆశ్రమం లో క్రూర మృగాల తో సాదు జంతువులు కలిసి మెలుగు తున్నాయి .మహా ప్రశాంతం గా అగస్త్యా శ్రమం ఉన్నది .దుష్ట మృగాలు మాంస భక్షణ మాని పచ్చ గడ్డి మేస్తున్నాయి .కొంగలు చేపలను ,పెద్ద చేపలు చిన్న వాటిని తినటం లేదు .ఆశ్రమంలో‘మాంసం ఎక్కడ  ?శివ భక్తీ ఎక్కడ ?మందిర మెక్కడ ?శివార్చనం ఎక్కడ ?మద్య మాంసాలు తిన్న వారికి శంకరుడు దూరం గా ఉంటాడు .శివానుగ్రహం లేక అజ్ఞానం నశించదు ‘’అన్న వాక్యం రాసి అందరికి అహింసా ధర్మాన్ని బోధిస్తోంది .

                      ఈ ప్రశాంతత ను చూసి దేవతలు ఆశ్చర్య పడ్డారు .’’ఇక్కడున్న పక్షులు విశ్వేశ్వరుని ధ్యానిస్తున్నాయా ?చిలుకలు విశ్వ నాధుని కీర్తిస్తున్నాయా ?కోకిలలు కలికాల పరి స్తితులకు కలత చెంది విశ్వేశ్వర తలం పు తో చిత్త శాంతి పొందు తున్నాయి .స్వర్గం లో నుండి పతనం చెడటం ఉంది కాని కాశి లో పతనం ఉండదు .యముడి దగ్గర ఉండటం కంటే ,కాశీలో ఉండటం శ్రేయస్కరం .బ్రహ్మాండం లో ఏ ప్రదేశం లో ఉన్న దాని కంటే కాశి లో నివశించటం శ్రేష్టం .ఇక్కడ ఉన్నా ,ఈశ్వర దర్శనం లేక పోతే వ్యర్ధం .ఉత్తర వాహిని అయిన గంగా నదిలో స్నానం చేసి ,విశ్వేశుని దర్శించిన వారి శ్రేయస్సు కు అంతం ఉండదు .’’దేవ దేవ మహా దేవ శంభో !శివా శివా !దూర్జటే !నీల కంథేశ!పినాకీ !శశి శేఖర !నన్ను రక్షించు ‘’అంటూ ముక్తి మండపం పై కూర్చోవటం ,ధర్మ విషయాలు మాట్లాడుకోవటం పురాణ శ్రవణం చేయటం ,నిత్య కర్మలు చేయటం పిండాదులు పెట్టటం ,పరోప కారం చేయటం ,అంటే సమస్త ధర్మాలను ఆచరిన్చటమే .శుక్ల పక్షం లో చంద్ర కల అభి వృద్ధి చెంది నట్లు కాశీ క్షేత్రం లో ఉన్నవారికి పుణ్యం అలా పెరుగుతూ ఉంటుంది ..ఇక్కడ పురుషార్ధాలను ఇచ్చేది భవానీ మాత .కోరికలను తీర్చే వాడు డున్తి విఘ్నేశ్వరుడు .విశ్వేశ్వరుడు మరణ కాలం లో సమస్త ప్రాణులకు రామ తారక మంత్రాన్ని చెవిలో బోధించి మొక్షాన్నిస్తాడు .విశ్వేశ్వరుడు ధర్మార్ధ కామ మోక్ష స్వరూపుడు .పరమాత్మ స్వరూపుడు .అందుకనే కాశీ వంటి పట్టణం మూడు లోకాలలోనూ లేదనే ప్రఖ్యాతి వచ్చింది .’’అని దేవత లందురు అను కొంటూ ,అనేక మంది బ్రహ్మ చారి శిష్యుల తో పరి వేష్టించి ఉన్న అగస్త్య ముని ని దర్శించారు .శ్యామక ధాన్యాన్ని హోమం కోసం చేతులో పట్టుకొన్న రుషి కన్యలను చూశారు .సాధ్వి లోపాముద్ర పాద ముద్ర లను చూసి పులకించారు .ఆ పాద ముద్ర లకు భక్తీ గా నమస్కరించారు .అక్కడ సమాధి నుండి మేల్కొన్న బ్రహ్మ దేవుని లా ప్రకాశి స్తున్న అగస్త్య మహర్షిని దర్శించి నమోవాకాలనర్పించారు .ఆయన వీరిని సాదరం గా ఆహ్వా నించి, అతిధి మర్యాదలు చేసి, శుఖాసీనులను చేశాడు ..వారి రాకకు కారణాన్ని అడిగాడు మహర్షి.

                                                                         పతివ్రతాఖ్యానం

            అప్పుడు దేవతలందరి తరఫున దేవ గురుడు బృహస్పతి మహర్షి తో ‘’లోపాముద్ర వల్లభా !నీవు ఘనులలో ఘనుడవు ..నీవంటి తపోధనులు లేరు .ఈ కల్యాణి లోపాముద్ర నీ సహా ధర్మ చారిని గా నీ ఛాయ లాగా ప్రవర్తిస్తోంది .మహా పతి వ్రత లైన అరుంధతి ,అనసూయ ,సావిత్రి ,శాండిల్య ,సత్య ,లక్ష్మి ,శతరూప లతో ఈమె సమానం .ఈమె ను మించిన పతివ్రత ను ఊహించలేము .’’అని లోపాముద్రాగాస్త్యులను కీర్తించాడు .తర్వాత పతివ్రతా ధర్మాలను వివ రించాడు బృహస్పతి ‘’కన్య వివాహ సందర్భం లో పెండ్లి కుమార్తె తో పురోహితుడు ‘’భర్త తో జీవించినా లేక పోయినా సహా చరిగా ఉండు ‘’అని చెబుతారు .కనుకభార్య భర్తను నీడ లాగా అనుసరించాలటం పతివ్రత లక్షణం .యమ దూతలు పతివ్రతను చూస్తె అగ్నిని చూసి నంత భయం తో పారి పోతారు .ఆమె తేజస్సు ముందు సూర్యాగ్నుల తేజస్సు దిగ దుడుపు .స్త్రీల పతివ్రతాచారణం వల్లనే భూమి భారం తగ్గుతోంది .ఈ లోకానికి ,పర లోకానికి భార్యయే మూలం .భార్య తో కలిసి దేవ ,పితృ కార్యాలు చేయాలి .,భర్త ను కోల్పోయిన స్త్రీ  ఏ దానం చేసినా ‘’నా భర్త సంతోషించు గాక ‘’అని చేయాలి శ్రావణ ,భాద్ర పద మాసాలలో ఆమె భోజనాలు అతిధులకు పెట్టాలి .కార్తీకం లో మౌనాన్ని పాటించాలి .ఆకులలో భుజించాలి .దీప దానం చేయాలి ఈ దానం తో ఏదీ సమానం కాదు .సూర్యోదయం అవగానే మాఘ స్నానం చేయాలి దీపాన్ని దానం చేసే టప్పుడు పరమేశ్వర స్వరూపుడైన తన భర్త సంతోషించాలి అని అనుకోవాలి .కొడుకు అనుమతి తో పనులు చేయాలి . పాతివ్రత్యం గల స్త్రీ ని పూజిస్తే గంగా స్నానం చేసి నంత ఫలితం కలుగు తుంది .అమ్మా లోపా ముద్రా దేవీ !మీ దర్శనం మాకు గంగా స్నానం తో సమానం ‘’అని చెప్పాడు .

                  బృహస్పతి తాము వచ్చిన కారణాన్ని ఇప్పుడు వివ రించి చెబుతున్నాడు ‘’మహర్షీ !వీరు అగ్ని ,యమ ,నిరుతి ,వరుణ ,వాయు ,కుబేర ,రుద్రదేవతలు .లోకం లో జనం వీరి వల్ల అన్ని అర్ధాలను పొందుతున్నారు .మేరు పర్వతం వింధ్య గిరి పై ఈర్ష్య పెంచుకొని విపరీతం గా పెరిగింది .సూర్యుని మార్గానికి అవరోధమేర్పడింది .దానిని మీరే దారి లోకి తేవాలి ,లోక కార్యాలన్నీ మళ్ళీ యదా ప్రకారం జరిగేటట్లు చేయాలి అందుకే మేమంతా మీ దర్శనం చేసి అర్ధించటానికి వచ్చాం .’’అని విన్న వించాడు .అగస్త్య మహర్షి ‘’అలాగే చేస్తాను ,నిశ్చింత గా వెళ్ళండి ‘’అని అభయమిచ్చి దేవతలను పంపించాడు . .

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List