శుక్ర లోక వర్ణనం.. శుక్ర లోక వృత్తాంతాన్ని శివ శర్మకు విష్ణు దూతలు వివరిస్తున్నారు .శుక్రా చార్యుడు వెయ్యేళ్ళు కణ ధూమ పానాన్ని చేసి ,శివుని కృప వల్ల మృత సంజీవినీ విద్య సాధించాడు .శుక్రుని కద వింటే అప మృత్యు భయం ఉండదు .భూత ప్రేతాలు దరికి రావు .ఒకప్పుడు అందకాసురినికి ,శివునికి యుద్ధం జరి గింది .అప్పుడు గిరి వ్యూహం ,వజ్ర వ్యూహాలను పన్ని రాక్షస బలాన్ని నివారించారు . వాడు శుక్రాచార్యుల వద్ద కు వెళ్లి గోల చేశాడు .దనుజులు ముందడుగు వెయ లేకుండా పోతున్నారని ,కనుక వారిని కాపాడే బాధ్యత రాక్షస గురువైన ఆయనదే నని విన్న వించాడు .శుక్రుడు సంపాదించిన మృత సంజీవినీ విద్యనూ ఇప్పుడు సార్ధకం చేసే సమయం ఆసన్న మైందని కోరాడు .
అంధకుని మాటలు విన్న భ్రుగువు సమయానికి మృత సంజీవిని విద్య ను జ్ఞాపకం చేసి నందుకు సంతోష పడి ,రాక్షస గణాన్ని రక్షించే బాధ్యత తీసుకొంటానని అభయం ఇచ్చాడు .యుద్ధం లో చని పోయిన వారిని పునర్జీవితులను చేశాడు .గాయాల పాలైన వారికి అవయవ లోపం లేకుండా క్షణాల మీద చేశాడు .మళ్ళీ రాక్షసులు విజ్రుమ్భించారు .శివుని ప్రధమ గణం బెంబేలెత్తి పోయారు .శివునికి విషయం తెలియ జేశారు యుద్ధం లో మరణిన్స్తున్న రాక్షసులను శుక్రుడు బ్రతికిస్తున్నాడని ,తమకేమీ దారి కాన పడటం లేదని చెప్పారు .మళ్ళీ ప్రమధ గణానికి రాక్షసులకు భీకర యుద్ధం సాగింది .
పరమ శివుడు నందీశ్వరుని పిలిచి ,శుక్రా చార్యులను ఎత్తుకు రమ్మని ఆనతిచ్చాడు .అతడు వెంటనే వెళ్లి ఏనుగు పట్టు పట్టి ,,మీదకు వచ్చే రాక్షసులను కొమ్ములతో కాళ్ళతో చంపి తీసుకొచ్చి ఈశ్వరుని ముందు పడేశాడు .శివుడు శుక్రుడిని పండు ను తిన్నట్లు నోట్లో వేసుకొని క్షణం లో మింగేశాడు .రాక్షసులకు ఈ విషయం తెలిసి లబో దిబో మన్నారు .ప్రమద గణం విజ్రుమ్భించి యుద్ధం చేశారు .రాక్షస మూక నిలువ లేక పారిపోయి అందకాసురునికి తెలిపారు .దైత్యులు ,దానవులు సంప్రదించుకొని ఏకమై ప్రమద గణాలను ఎది రించారు .మొదట వీరిదే పై చేయి గ ఉన్నా క్రమేపీ ప్రమద సేనలు విజ్రుమ్భించి రాక్షసులను దేవతలను సంహరించారు .తన సేనా బలం తగ్గి పోయిందని తెల్సుసుకొన్న అన్ధకుడు స్వయం గా యుద్ధానికి దిగాడు .అతడిని వినాయకుడు కుమారస్వామి అడ్డగించారు వాడికళ్ళు శూలాల దెబ్బలకు కనీ పించాకుండా పోయాయి .శివుని పొట్టలో ఉన్న శుక్రుడు బయటికి వచ్చే మార్గం కోసం వెతుకు తున్నాడు .శివుని ఉదరం లో పాతాళాది లోకాలను దర్శించాడు ఆచార్యుడు .ఆరు సంవత్సరాలు శివుని పొట్ట లో ఉండిపోయి బయట జరిగే యుద్ధాన్ని, బ్రహ్మాది లోకాలను చూశాడు .చివరికి ‘’శాంభవ యోగం ‘’చేత భార్గవుడు శివుని ముఖం నుండి బయటకు వచ్చి శివుని ఎదుట నిల బడినమస్కరించాడు .శివుడు అతని పై కటాక్షం చూపి తన ముఖం నుండి వెలువడ్డాడు కనుక తన కుమారుని తో సమానం అని చెప్పి వెళ్లి పోమన్నాడు .తన ఉదరం లో శుక్రుడు మరణించ కుండా ఉన్నాడని ,అతని యోగశక్తి అద్భుతమని కొని యాడాడు .అందకుడికి శివుడికి మహా యుద్ధం జరిగింది .అతన్ని సంహరించాడు మహేశ్వరుడు
శుక్రుడు మృత సంజీవినీ విద్యనూ ఎలా సంపాదించాడని శివ శర్మ అడుగగా విష్ణు దూతలు వివరించారు .పూర్వం శుక్రుడు కాశీ లో శివ లింగాన్ని స్తాపన చేసి భక్తీ తో తపస్సు చేశాడు .ఇంద్రియాలను జయించి ,మనసును స్వాధీన పరచుకొని చేసిన అతని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్ష మయ్యాడు .శుక్రుడు ఆయన్ను సర్వ విధాలా స్తోత్రాలు చేసి ప్రసన్నుడిని చేసుకొన్నాడు .’’నీకు ఇద్దరు కుమారులు కలుగుతారు .నా ఉదరం లో సంచ రించావు కనుక నా వల్ల పుత్ర జన్మ పొందుతావు .నేను నీకు ఒక ప్రత్యెక వరాన్నిస్తున్నాను .ఇది బ్రహ్మా, విష్ణువు లకు కూడా తెలీకుండా రహస్యం గా ఉంచాను మంత్ర పూతం గా నావద్ద ఉన్న మృత సంజీవినీ విద్యనూ నీకు ఇస్తున్నాను .నువ్వు తపస్సంపంన్నుడివి కనుక పొందే అర్హత ఉంది .దీన్ని నియమాల తో అభ్యసిస్తే చని పోయిన వారిని బ్రతి కిస్తుంది .నీ దృష్టి పడ్డ వారి కార్యాలకు విఘాతం కలుగుతుంది .నువ్వు స్తాపించిన లింగం శుక్రేశ ..లింగం గా ప్రసిద్ధి చెందుతుంది దీనిని అర్చిస్తే వంధ్యత్వం రాదు ‘’అని చెప్పి శివుడు శుక్రేశ లింగం లో లీనమై పోయాడు .విశ్వేశ్వర లింగానికి దక్షిణం లో శుక్రేశ లింగం ఉన్నది ‘’అని లోపాముద్రా దేవికి అగస్త్య మహర్షి చెప్పాడు.

No comments:
Post a Comment