ఇంద్ర ,అగ్ని లోక వర్ణనం శివ శర్మను ఇంద్ర లోకానికి తీసుకొని వెళ్లారు .విశ్వ కర్మ తన తపో బలం తో దీన్ని నిర్మించాడు పగలే వెన్నెల అక్కడ .చంద్రుడు ఎక్కడ తిరిగినా తన ప్రేయసి అయిన వెన్నెల ను ఇక్కడ ఉంచి వెడతాడు .చింతా మణి అన్ని టిని క్షణం లో తయారు చేస్తుంది కనుక నేతగాల్లు బంగారపు పని వారు మొదలైన వారుండరు ..అన్నీ ఇచ్చే కామ ధేనువు ఉందికనుక వంట వాళ్ళు ఉండరు .ఇంద్ర పదవి ఉత్కృష్ట మైనది .నూరు అశ్వ మేదాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది .అర్చిష్మతి ,సమయమని ,పుణ్య వతి ,అమలా వతి ,గంధవతి ,అలక ,ఈశాన్య లోకం స్వర్గం తో సమానం .ఇంద్రుడిని సహస్రాక్షుడు ,దివస్పతి ,శతమన్యుడు అనీ పిలుస్తారు .నారదాది మహర్షులు తరచు వచ్చి ఆశీర్వదిస్తారు .అన్ని లోకాలకు స్తైర్యం ,ధైర్యం ఇంద్ర లోకమే .మహేంద్రుడు ఓడిపోతే మూడు లోకాలు ఒడి పోయినట్లే .రాక్షసులు ,మనుష్యులు ,గంధర్వ,యక్షులు ఇంద్ర పదవికోసం ఘోర తపస్సు చేస్తారు .నూరు యాగాలు భూలోకం లో చేసి జితెన్ద్రియుడైన వారికి ఇంద్ర పదవి దక్కుతుంది యుద్ధం లో వీర మరణం పొందిన వారు ఇక్కడికే చేరుతారు .ధర్మ నిర్ణయం చేసే వారికి కూడా భోగ భూమి
అగ్ని హోత్రుని నగరమే అర్చిష్మతి .అగ్ని దేవుడిని నిష్ఠ తో ఉపాశించిన వారికి ఈలోకం దక్కుతుంది .శీతా కలం లో చలి బాధను తట్టుకొనలేక పోయే వారికి కట్టెలను దానం చేసిన వారు ,ప్రతి పౌర్ణమి నాడు ఇష్టులు ఆచరించే వారు ఇక్కడ నివ సహిస్తారు .అనాధ ప్రేతకు అగ్ని సంస్కారం చేసినా ,దాన్ని ప్రోత్స హించినా అగ్ని లోక ప్రాప్తి ఖాయం .గురువు ,దేవుడు ,వ్రతము ,తీర్ధము ,అన్నీ అగ్ని దేవుడే .అన్ని వస్తువులు అగ్ని స్పర్శ తో పవిత్రమవుతాయి .అందుకే అగ్నికి పావనుడు అని పేరొచ్చింది .శివ శర్మ విష్ణు దూతలను ‘’అగ్ని దేవుడు ఎవరు? /అని ప్రశ్నించాడు దానికి వారు సవివరం గా సమాధానం చెప్పారు .
నర్మదా నదీ తీరం లో విశ్వానరుడనే శివ భక్తుడున్నాడు .శాండిల్య గోత్రజుడు ,జితేంద్రియుడు బ్రహ్మమ తేజశ్వి ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటించి ,అనుకూల వతి అయిన భార్యను తెచ్చుకొన్నాడు అతిధి సత్కారాలు చేస్తూ కపటం లేకుండా కాలం గడిపాడు అతని భార్య శుచిష్మతికి చాలా కాలం సంతానం కలుగ లేదు .ఒక రోజు ఆమె భర్తను సమీపించి ,గృహస్తులకు ఉచిత మైన తత్వాన్ని తనకు బోధించ మని కోరింది .దానికి ఆయనతాను ఆమెకు అన్నీ సమకూర్చాను కదా ఇంకా ఏమైనా కావాలంటే కోరుకో మన్నాడు .ఆమె మహేశ్వరుని తో సమాన మైన పుత్రుని ప్రసాదించమని అర్ధించింది .ఆయన అలానే అని చెప్పి కాశీ నగరం చేరాడు .రోజూ గంగా స్నానం నిత్యం విశ్వేశ్వరాది దేవ దర్శనం చేశాడు ..తన భార్య కొరికి వెంటనే తీరాలి అంటే యే లింగాన్ని అర్చించాలి అని ఆలోచించాడు అక్కడ కాలేషుడు ,వృద్ధ కాలేషుడు ,కలశేశ్వరుడు ,కామేషుడు ,చందేషుడు ,జ్యేష్టేషుడు ,త్రిలోచనుడు ,జంబు కేషుడు ,జైగీషుడు ,దశాశ్వ మేధ ఘట్టం లోని ఈశ్వర లింగం ,చండీషుడు ,ద్రుక్కేషుడు ,గరుదేషుడు ,గోకర్నేషుడు ,గనేశ్వరుడు వీటిలో దేన్నీ అర్చిన్చాలనే సందేహ కలిగింది ఆ తర్వాత ఆతని దృష్టిలో గౌరీశ లింగం ,ధర్మేష లింగం ,తారకేశ్వర లింగం ,సర్వేశ్వర లింగం ,ప్రతీశ లింగం ,ప్రీతి కేశ్వర లింగం ,పర్వతేశ్వర ,బ్రహ్మేశ ,అధ్యమేశ్వర ,బృహత్పతీశ్వర ,విభాన్దేశ్వర ,భార భూతేశ్వర ,మహాలక్ష్మీశ్వర ,మరుటేశ ,మొక్షీశ ,గంగేశ ,నర్మదేశ్వర ,మార్కండేయేశ్వర ,మణి కర్నేశ ,రత్నేశ ,సిద్దేశ్వర ,యామునేశ ,లాంగావీశ ,విశ్వేశ ,అవిముక్టేశ ,విశాలక్ష్మీశ ,వ్యాఘ్రేశ్వర ,వరాహేశ్వర ,వ్యాశేష ,వృషభధ్వజేశ ,వరుణేశ ,విదేశ ,వసిష్టేశ ,శానైశ్చరేశ ,ఇంద్రేశ ,సంగమేశ ,హరిశ్చంద్రేశ ,హరికేశ్వర ,త్రిసందీశ ,మహాదేవ ,శివ ,భవానీశ ,కపర్దీశ ,కందుకేశ ,మక్షేశ్వర ,మిత్రా వరుణేశ ,లో ఎవరు తన కోర్కె తీరుస్తారని మీమమాంస పడ్డాడు .
చివరకి సిద్దేశ్వర లింగాన్ని పూజిస్తే సకల సిద్ధ కలుగు తుందని భావించాడు .అక్కడే వీరేశ్వర లింగం ఉందని గ్రహించాడు .ఇదే ఉక్తమైన లింగం అని నిర్ణయించుకొన్నాడు .దీనినే పూర్వం వేద శిరుడు అనే మహర్షి శత రుద్రీయ అభి షేకం చేసి సశరీర లింగైక్యం పొందాడని జ్ఞాపకం చేసుకొన్నాడు అలాగే జయద్రధుడు ,విదూరుడు మున్నగు వారికోర్కేలను తీర్చింది ఈ లింగమే అని భావించాడు అనేక రకాలైన నియమాల తో నిష్టతో వీరేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ దీక్ష గా సేవించాడు .అతని తీవ్ర తపస్సుకు మెచ్చి బాల మహేశ్వరుడు ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు .ఆయన్ను పరి పరి విధాల స్తుతించి తనకు ఈశ్వరుని తేజస్సు గల కుమారుని ఇవ్వ మని కోరాడు ..శివుడు ‘’నేను నీ భార్య సుచిష్మతి గర్భాన ‘’గృహ పతి’’గా జన్మిస్తున్నాను . అతడు దేవతలకు ప్రీతీ కల్గిస్తాడు ‘’తవ పుత్రస్య మేష్యామి ,శుచిష్మత్యాం మహా మతే –ఖ్యాతో గృహ పతి ర్నామనా ,శుచిహ్ సర్వామర ప్రియః ‘’అనే శ్లోకాన్ని ఎవ్వరు శ్రద్ధ గా ప ఠిస్తారో వారికి శివుని వంటి కుమారుడు కలుగుతాడు ‘’అని ఆశీర్వా దించి అంతర్దానమైనాడు .ఈ కధను లోపాముద్రకు అగస్త్యుడు చెప్పాడు.
No comments:
Post a Comment