కాశీ ఖండం -12 ~ దైవదర్శనం

కాశీ ఖండం -12




 గంధ వతి - అలకా పుర వర్ణనం... వరుణ నగరానికి ఉత్తరాన వాయువు నగర మైన గంధవతి నగరం ఉంది .దీని అది పతి ప్రభంజనుడు అంటే వాయు దేవుడు శివభక్తుడై ఈ ఆధిపత్యాన్ని పొందాడు .పూర్వం కశ్యప ప్రజాపతి వంశం లో జన్మించిన ధూర్జటి అనే పుణ్యాత్ముడు కాశీ లో పవనేశ్వర లింగాన్ని స్తాపించి దీక్ష గా శివుని కోసం తపస్సు చేశాడు .శివ దేవుడు ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు .అప్పుడు ధూర్జటి శివుని స్తోత్రం చేశాడు ‘’మహేశ్వరా !శత పధ బబ్రాహ్మాణంకూడా నిన్ను గూర్చి‘’నేతి –నేతి –అని వర్ణించింది .బ్రహ్మా విష్ణు దేవతలు కూడా నిన్ను వర్నిన్చలేరంటే నేనెంత /నువ్వు ఒక్కడివే శివ శక్తివి .భేదం చేత రెండు అయావు .శవ ,శక్తి అయిన మీరిద్దరూ నిత్య యవ్వనులు .మీ లీలచే క్రియా శక్తి ఏర్పడుతుంది .దాని స్వరూపమే ఈజగత్తు..కనుక అన్నిటికీ నీవే కారణం. నీకుడి వైపు బ్రహ్మ ,ఎడమ వైపు అచ్యుతుడుఉంటారు .సూర్య చంద్రులు నీ నేత్రాలు ..నీ ఉచ్వాస ,నిస్శ్వాసాలే మూడు వేదాలు .నీ చెమట సముద్ర జలం .నీ శరీరం లో వివిధ భాగాలనుండి నాలుగు వర్ణాల వారు జన్మించారు .నీ తల వెంట్రుకలే మేఘాలు .నువ్వు పురుషుడవు .ప్రకృతి రూపం లో బ్రహ్మాండ మంతా సృష్టించావు నువ్వు సర్వ భూత మయుడివి ..అన్ని తత్వాలు బోధిస్తావు .సమస్త జీవులకు ఆయుస్వరూపం నువ్వే .నీ మీద శ్రద్ధా భక్తీ నిశ్చలం గా ఉండేట్లు అనుగ్రహించు’’అని ప్రార్ధించాడు .దానికి శివుడు ‘’నీవు స్తాపించిన లింగం వాయు లింగం గా ప్రసిద్ధి చెందుతుంది .ఈ పవమానేశ్వర లింగాన్ని అర్చించిన వారు సర్వ లోక పూజితుడవుతాడు పడమటి దిశకు నువ్వు అధిపతివి అవుతావు ‘’అని దీవించి అదృశ్యమైనాడు .

                            అలకా నగరం

                      గంధ వతికి తూర్పుగా కుబేరుని అలకా పురి ఉంది .ఇతడు శివునికి మిత్రుడు కూడా నవనిధులకు దాత ,భోక్త .శివశర్మ కుబేరుడేవరు ఆదిపత్యం ఎలా వచ్చ్చింది శివ మిత్రుడేలాఅయాడు   అని ప్రశ్నిస్తే సమాధానం గా విష్ణు దూతలు ఇలా చెప్పారు .పూర్వం కామ్పిల్య నగరం లో సోమయాజుల వంశం లో యజ్న దీక్షితు డైన యజ్న దత్తుడు అనే సద్బ్రాహ్మణుడున్నాడు అందరి చేత గౌరవింప బడుతున్నాడు నిత్యాగ్ని హోత్రం చేస్తూ క్రతువులు నిర్వ హిస్తు బ్రాహ్మణ ధర్మాన్ని వేద విధి గా సాగిస్తున్నాడు  ఆయనకు ‘’గుణ నిది ‘’అనే కుమారుడున్నాడు .వాడు జూదం వ్యభిచారం మొదలైన సకల దురాచారాలకు అలవాటు పడి తండ్రికి ఎదురు పడకుండా తల్లి చాటున వచ్చి పోతు ఉండే వాడు .కొడుకు ఇంట్లో కనిపించలేదని ఎప్పుడైనా ఆయన అడిగితే అప్పుడే దేవతార్చన చేసి వెళ్ళాడని భార్య అబద్ద  ఆడుతూ కొడుకును వెనకేసుకోచ్చేది ..ఒక సారి తండ్రికి కోపం తెప్పించ వద్దని హితవు చెప్పింది .దానితో అసలు ఇంటికి రావటం మానేశాడు .పందోమ్మిదేల్లు వచ్చేసరికి వివాహం చేశారు .కాని భార్యనూ అలక్ష్యం చేస్తూ దురాచారాలను ఏమాత్రం తగ్గించుకో లేదు .సప్త వ్యసన పరుడని పేరు పొందాడు ,.దొంగ చాటు గా ఇంటికి వచ్చి దొరికింది దొంగిలించి జూదం ఆడే వాడు

             ఒక రోజు తల్లి కి తండ్రి ఇచ్చిన నవరత్నాల ఉంగరాన్ని దొంగిలించి జూదం లో పోగొట్టుకొన్నాడు .దాన్ని ధరించిన జూదగాడిని దీక్షితుల వారు చూసి ఎక్కడిదని గద్దించాడు .వాడు నిజం చెప్పాడు .కోపం తో ఇంటికి చేరిన గుణ నిది తండ్రి భార్యను ఉంగరం ఎక్కడుంది అని అడిగితే ఆమె దాన్ని మాయ మాటలతో కప్పి పుచ్చింది .ఇంట్లో వెండిగిన్నె మొదలైన వాటిని గురించి అడిగినా సరైన సమాధానం రాలేదు .ఆమెను కోపగించి కొడుకును ఇంటికి రానివ్వ వద్దని హెచ్చరించాడు .అన్ని దారులు మూసుకు పోయాయి గుణ నిది కి .

              ఒక శివ రాత్రి నాడు శివభాక్తుడొకడు శివుని నైవేద్యం పెడ దామని మధుర పదార్ధాలను చేయించి శివాలయానికి వెళ్లాడు .అక్కడే చాలా రోజులనుంచి ఆకలి తో అలమటిస్తున్న గుణ నిది నెమ్మది గా భక్తుడు వెళ్లి పోయే దాకా ఆగి అక్కడ జరిగే భజనలు స్తోత్రాలను విని చూసి ప్రసాదం కోసం వేచి ఉన్నాడు .అందరు వెళ్లి పోయిన తర్వాత గర్భాలయం చేరాడు .అక్కడ ఉన్న దీపారాధన కొండేక్కు తున్నట్లు గమనించి ,అందులో అక్కడే ఉన్న చమురు పోసి వత్తిని ఎగా దోశాడు .తన కొంగు చింపి వత్తి చేసి నూనె లో తడిపి మరింత కాన్తికోసం వెలిగించాడు .లోపలి నైవేద్యాన్ని చేత్తో పట్టుకొని బయటికి పరి గెత్తు తుండగా ,అక్కడే నిద్రిస్తున్న ఒక భక్తుడి పై పడ్డాడు .అతడు కేకలు వేస్తె అందరు వచ్చి దొంగతనానికి గుణ నిది వచ్చాడని భావించి చావ బాదారు .వెంటనే అతడు మరణించాడు .శివున అనుచర గణంఅక్కడికి వచ్చి అతన్ని తీసుకు పోబోతుంటే యమ దూతలు అడ్డ గించారు అప్పుడు శివదూతలు శివ నిర్మాల్యాన్ని తాకితేనే పాపాలు పోతాయని శివ రాత్రి పర్వ దినం నాడు గుణ నిది ఉపవాసం తో దాన్ని తెచ్చు కోన్నాడని దీపా రాదన చేశాడని పూజ ,భజనలు చూశాడని విన్నాడని కనుక అతనికి పుణ్యమే తప్ప పాపమే లేదని వాధనతో తెలిపి శివలోకానికి తీసుకొని వెళ్లారు .

            గుణ నిది తర్వాతా జన్మ లో కలింగ రాజు అరిన్దముడికి దమనుడు అనే కొడుకు గా పుట్టాడు తండ్రి తర్వాత రాజ్యమేలాడు .అతనికేమీ భక్తీ విషయాలు తెలీవు .అయితే తన రాజ్యం లో అన్ని శివాలయాలలో దీపాలు వెలిగించాలి అని శాసనం చేసి అమలు చేశాడు .జీవించి ఉన్నంతకాలం దీన్ని అమలు చేశాడు .దమనుడు మరణించాడు ఈ దీపా రాధనా పుణ్యం చేత అతడు ‘’అలకా పురం ‘’కు రాజయ్యాడు

                     పద్మ కల్పం లో బ్రహ్మ మానస పుత్రుడు గా పులస్త్యుడు జన్మించాడు .పులస్త్యునికొడుకు విశ్వా వసువు .ఇతడు విశ్వ కర్మ చేత అలకా పురిని నిర్మింప జేసుకొన్నాడు శివుని కోసం దీర్ఘ తపస్సు చేశాడు తరువాతి కల్పం అయిన మేఘ వాహన కల్పం లో యజ్న దత్తుని కుమారుడు గుణ నిది శివాను గ్రహం కోసం తపస్సు చేశాడు .దీపారాధన పుణ్యం చేత కాశీ నగరాన్ని పొందాడు అక్కడ ఒక శివ లింగాన్ని స్తాపించి తపస్సు చేస్తే మహేశ్వరుడు విశాలాక్షి తో ప్రత్యక్షమై వరాన్ని కోరుకో మంటే శివుని పాదాలను నిత్యం తన కళ్ళ తో చూసే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకొన్నాడు .శివుడు సంతోషించి అతడిని చేతి తో తాకి తనను దర్శించే భాగ్యం కల్గించాడు కంటి తో మొదటి చూపును అమ్మవారిని వక్ర బుద్ధి తోచూశాడు .ఆమే గ్రహించి తీక్షణం గా అతని వైపు చూస్తె ఎడమ కన్ను చూపు లేకుండా పోయింది అప్పుడు ఈశ్వరుడు ‘’ఇతడు క్రూర దృష్టి తో నిన్ను చూడ లేదు ఇతడు నీకుమారుడు నీ తపస్సును మెచ్చుకొంటు నీ అదృష్టాన్ని వర్ణిస్తున్నాడు ‘’అన్నాడు అతనితో ‘’నీ తపస్సుకు మెచ్చాను నువ్వు నవ నిధులకు అధిపతివి అవుతావు గుహ్యకులకు  అంటే డబ్బు దాచుకొనే వారికి నువ్వు అధి పతివి  .అందరికి దనం ఇచ్చే‘’ధనడుడవు ‘’అని పించుకొంటావు .అలకా పట్నం అన్నిటా శ్రేష్టమైంది .విశాలాక్షీ దేవి అతనికి శివ భక్తీ స్తిరం గా ఉంటుందని అనుగ్రహించింది .అతని చే కాశీ లో ప్రతిష్టింప బడ్డ లింగం ‘’కుబేర లింగం ‘’గా ప్రసిద్ధి చెంది పూజించిన వారికీ దారిద్ర్యాన్ని రాకుండా కాపాడుతుందని తెలిపి అదృశ్య మయ్యారు .ఈ విధం గా గుణ నిది ధనడుడైన కుబేరుడి అలకా పురాన్ని ఏలుతు దిక్పాలకుడయ్యాడు అలకాపురమే కైలాసం అయింది .అదే శంకరాలయం.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List