విస్తరి ఆకుని ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము.
భోజనము తినే వరకు ఆకు కు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము.
తినిన మరుక్షణం ఆ విస్తరి ఆకును మడిచి , దూరంగా పడేసి వస్తాము...
మనిషి జీవితం కూడ అంతే ఊపిరి పొగానే ఊరిబయట పారేసి వస్తారు ,
విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది.
ఎందుకంటే పొయే ముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయేగ పడినాను కదా అన్న తృప్తి ఉంటుంది.
విస్తరి ఆకు కు ఉన్న ఆలోచన మనము కుడా అలవర్చుకోవాల,
మనకు శక్తి వున్నపుడే సేవ చేసుకోవాలి.
అవకాశము వచ్చినపుడు వెంటనే చేయడం మంచిది.
మరి ఎప్పుడో చేయవచ్చు అనుకొని వాయిదా వేయకూడదు.
ఆ అవకాశము మళ్లీ వస్తదని అనుకుంటే .... రాకపోవచ్చు.
కుండ ఎప్పుడైనా పగలవచ్చు.
అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు .
యెంత సంపాదించి ఏమి లాభం ?
ఒక్క పైస నైనా తీసుక పోగలమా ?
మనం పోయిన నాడు మనవెంట వచ్చేది, మన తోడు ఉండేది, ఈ సేవ ఒక్కటే.....🙏
No comments:
Post a Comment