* కాలగర్భంలో కలిసిపోతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం ...
* దట్టమైన నల్లమల అడవిలో మహిమాన్విత శైవక్షేత్రం .....
* ఎర్రచందనం పేరుతో అధ్భతమైన ఆలయాన్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న అధికారులు..?
* గుహ లో స్వయంబుగా వెలిసిన శివలింగం, మూడు పడగల నాగుపాము, శంఖం, వీణ ....
* అష్టైశ్వర్యాలు ప్రసాదించే మహేశ్వరుడు....
* ఈ గుహలోని శివలింగం దర్శించిన వారి జన్మ ధన్యం....
* స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన
శ్రీ కాశిరెడ్డినాయన అన్నదాన సత్రము, ఆశ్రమాన్ని కుల్చి వేసిన అధికారులు....
* ఐదు తలల తెల్లని నాగుపాము వచ్చి ఉమామహేశ్వర స్వామి
లింగాన్ని చుట్టుకొని స్వామి వారిని అభిశేకం చేసే అద్భుత దృశ్యం ....
.
నల్లమల అడవుల్లో అందచందాలు చూస్తే మంత్రముగ్ధులవ్వాల్సిందే... ఎత్తైన కొండలు, లోయలు... చిన్న చిన్న కాలువలు... వాటి నడుమ సవ్వడులు చేస్తూ... జల జల పారుతున్నచిన్న సెలఏర్లు... భారీ ఎత్తున హోరు చేస్తూ... చాల ఎత్తు నుంచి జాలు వారు తున్న జలపాతాల నడుమ ఉన్న గుహల్లో ... వందల ఏళ్ల క్రితం నల్లమల్ల అడవుల్లో ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొలువైవుండడం... ఒక అధ్భతం...
.
దట్టమైనఅడవులు.... రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు..
పక్షుల కిలకిలా రావాలు...కౄర మృగాల గర్జింపులు... ఏనుగుల ఘీంకారాలు...
చాల ఎత్తు నుండి జారే జలపాతాలు...
పైనుంచి పడుతున్న నీటితుంపర్లు భక్తులను గిలిగింతలు పెడతు...
కాలు జారితే అధ:పాతాళానికే అనిపించేలా భీతిని గొలిపే లోయలు...
పచ్చదనం పరచుకున్న ప్రకృతి కాంత ఓడిలో.... గుహలో ...
అమర్‌నాథ్ యాత్రని తలపించే రీతిగా సాగే మరో అద్భుతం....
ప్రకృతి రమణీయతకు నల్లమల అడవులు మారుపేరు....
నల్లమల్ల అడవుల్లో కొలువైఉన్న ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనం....
.
నల్లమల అడవుల్లో కాకులు దూరని కారడవి... చీమలు దూరని దట్టమైన చిట్టడవులుగా నల్లమల అటవీప్రాంతం బహుప్రసిద్థి చెందింది. విరబూసిన పూలు, రంగు రంగుల పక్షులు, పురివిప్పి ఆడే నాట్య మయూ రాలు.. పచ్చని చెట్లు , వాటిని వాటేసుకుని ప్రకృతితో ఎలా కలసి ఉండాలో చెప్పే అనేక రకాల లతలు, తీగలు, పొదలు వాటిని మించి కోటలకు దీటుగా చీమలు కట్టిన పుట్టలు.. సమాజంలోని దౌర్జన్యకారుల్లా వాటిని ఆక్రమిం చుకుని బుసలు కొట్టే విషసర్పాలు... తొడిగిన పచ్చల హారం.. కనుచూపుమేరలో పరుచుకున్న పచ్చదనం.. పచ్చని అందాల మధ్య ఒంపు సొంపులతో నాట్యం చేస్తున్న మయురాలు.. పక్షుల సంగీతాలు. ఇలాంటి పరవశింపజేసే ప్రకృతి అందాల మధ్య ఇలా ప్రకృతి అంతా ఒక్కదగ్గరే దర్శనమిస్తూ... కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని చూస్తు, మైమరచి పోవాల్సిం దే ఎవరైనా...
.
ఇంతటి అద్భుత అందాల నడుమ.. ప్రకృతిని పాలిస్తున్న తీరుగా... కొండకోనల్లో నెలకొన్న గుహల్లో కొలువైన ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనం నిజంగా అద్భుత అనుభూతుల్ని మిగిలిస్తుందనే చెప్పక తప్పదు.
.
మన అతి ప్రాచీన, ఆధ్యాత్మిక క్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి . కోరిన వరాలిచ్చే మన ‘నరసింహ స్వామి ’ ఎందరో భక్తుల కొంగు బంగారమై, వారింటి ఇలవేల్పుగా అలరారుతున్నాడు..! అహోబిలం కు చాలా మంది వెళ్లివస్తుంటారు కానీ దాని పక్కనే ఉన్న ఉల్లెడ క్షేత్రం గురించి ఎవరికీ తెలీదు ..
.
కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ముందు 3కిలోమీటర్ల దూరంలో ఎడమ పక్క కొండకు దారి కలదు. ...
త్రేతా, ద్వాపరయుగాలలో నల్లమల అటవీ ప్రాంతం క్షేత్రం ప్రసిద్దిగా చెప్పొచ్చు. ఈ క్షేత్రా లలోని మూల విరాట్టు అయిన ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి ప్రతిరూపమైన లింగాలను దేవుళ్లే ప్రతిష్టించారన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం...
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా, లక్ష్మణుడితో కల్సి వన వాసం చేసిన సమయంలో వారికి ఈ నల్లమల ఆతిథ్యమిచ్చిన ట్లు చెప్తారు. ఈ సమయంలోనే శ్రీరాముడు నల్లమలలో పలు ప్రాంతాలలోని గిరిసీమల్ని దర్శించి... అక్కడక్కడా శివలింగాలు ప్రతిష్టించారని... స్థానిక కథనాలు బోలెడు వినిపిస్తాయి.
.
ఇక ద్వారపయుగంలోనూ పాండవులు ద్రౌపదీ సమేతులై... అరణ్య వాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు వారిని సాదరంగా నల్లమల అక్కున చేర్చుకుని వారికి అన్ని వసతులూ కల్పించిం దని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు. ఇలా తమ ప్రాంతంలో వనవాస కాలంలో గడిపిన పాండవులు సైతం ఉమామహేశ్వ రం... శ్రీశైలం... మల్లెల తీర్థం ఇలా పలు చోట్ల లింగాలు ప్రతిష్టిం చారని... ఆ క్రమంలోనే లంకమల్లలో కూడా లింగాన్ని త్రేతాయుగంలోనో.. ద్వాపర యుగంలోనో ప్రతిష్టించి ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం.
.
నల్లమల ఆడవి లోని ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లెదా వజ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవజ్రాల కొండ గుహలో ఉల్లెడ నరసంహాస్వామి గుహ, ఆశ్వథ్దామ గుహ, వున్నఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ అను మూడు గుహలు కలవు.
ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ లో ఒక శివలింగం, మూడు పడగల నాగుపాము, శంఖం, మరియు వీణ స్వయంబుగా వెలిచినాయి.
.
శివలింగం పై ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహలో నిత్యం శివలింగం పై దారలంగా మంచునీరు పడుతుంది.ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పర్వతి అమ్మ తిర్ధం నుండి ఐదు తలల తెల్లని నాగుపాము వచ్చి ఉమామహేశ్వర స్వామి లింగాన్ని చుట్టుకొని స్వామి వారిని అభిశేకం చేస్తుంది.
ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి హిందూ యాత్రికులకే కాక, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా హిందూ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండలో ప్రదానమయినది పార్వతమ్మ తీర్థము . ఉమామహేశ్వరుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్ధంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి .
.
ఈ క్షేత్రం చాల ఎత్తులో ఉంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి పార్వతితల్లి సమేత మహేశ్వర స్వామి పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు.
.
ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై ఉమామహేశ్వర , తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచినారు. ఈ ప్రదేశము నందు అర్దరాత్రి సమయమున “ఓమ్” కార ప్రణవ నాధము వినిపించుట భక్తులు వినియున్నారు. ఇక్కడికి వచ్చు భక్తులకు సంతానము కలుగుచూ, నాగ దోషము, కాల సర్ప దోషము, రాహు కేతు దోషము, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ మగును. స్వామి వారిని దర్శించిన భక్తులకు వంశ కీర్తి ప్రతిష్టలతో ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి, సుఖ సంతోషములు కలిగి వుందురు.
.
15వ శతాబ్దంలో రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి ఉమామహేశ్వర స్వామి క్షేత్రాలో విజయంనికి గుర్తుగా కొండకు పురాతన లిపిలో వ్రాయబడినది. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి స్వయం వ్యక్త క్షేత్రాంగా ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు స్వామివారికి పాత్రులైనారు.
.
పార్వతమ్మ తీర్థము మహత్యం...
కార్తీక పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి
ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు
ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు.
ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది.ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది
ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.
ఈ తీర్థము లో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలుగుతాయి. కార్తీకపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది.
.
ఈబుది నారాయణ స్వామి చరిత్ర...
పరమశివ భక్తుడయిన ఈబుది నారాయణ స్వామి వారు ఒక ఆవుల కాపరి. ఓక్క రోజు కోన్ని ఆవులు కనిపించకుండ పోవడంతో వాటిని వెదుకుతు నల్లమల ఆడవి లోని వజ్రాల కొండ గుహ లోని ముందుగా ఉల్లెడ నరసంహాస్వామి గుహలోనికి వెళ్ళుతాడు ఆక్కడ ఓంకారం నాదం వినపడుతుంది. ఆక్కడ నుండి వెనక్కి తిరిగి వస్తాడు.
.
ప్రక్కన వున్నఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహలోనికి వెళ్ళగా ఆక్కడ ఐదు పడగల తెల్లనాగుపాము ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి లింగాన్ని చుట్టుకోని వుంటుంది దాన్ని చూసి భయంతో భయటకు వచ్చి ప్రక్కన వున్న ఆశ్వథ్దామ గుహలోని పోతాడు ఆక్కడ ఆశ్వథ్దామ మహర్షి తపస్సు దర్షనం కలుగుతుంది. ఆపుడు ఆశ్వథ్దామ మహర్షి భక్త నారాయణ నీ ఆవులు ఎక్కడకు పోలెదు. నీఆవులు ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి వారి కి ఆభిశేకానికి
పాలు ఇస్తున్నాయి కావున నీవు కుడా శివలింగానికి పూజలు చేసుకో నీకు అ పరమ శివుడు నీకు దశ్శనం కలుగుతుంది. దినచర్య ప్రకారం గుహలో శివలింగానికి జీవితాంతం ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి చెసెవాడు.
.
ఒక్కరోజు అ పరమ ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు శివా నారాయణ నీవు నా వజ్రల కోండ క్రింద నున్న పార్వతి తిర్థం దగ్గర నుండి నా వజ్రాల కోండ గుహను నీవు కాపాడాలని పరమ శవుడు ఆజ్ఞపిస్తాడు .
.
ఆపుడు ఈబుది నారాయణ స్వామి వారు ఏజంతువైన నన్ను చంపితె ఆ వజ్రాల కోండ గుహను కాపాడలెమోనని ఈబుది నారాయణ స్వామి పార్వతి తిర్థం పక్కన ఒక నివాసం ఏర్పటు చేసుకొని ఆ వజ్రాల కోండ గుహను ఇప్పటి కాపాడుతు ఉన్నాడు.
.
ఈ క్షేత్రానికి వజ్రాల కోండ, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ ఉల్లెడ, పెద ఉల్లెడ, అమరతీర్ధం,పార్వతమ్మ తీర్థము, ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.
.
ఏడాదికి ఒక్కసారే...
నిత్యం అడవుల్లో సంచరిస్తూ... జంతువుల్ని వేటాడటం... మూలికల్ని సేకరించడం తదితరాల సాక్షాత్తు ఆ పరమ శివుడే తమ కోసమే ఈ కొండల్లో కొలువు దీరాడని నమ్మే ప్రజలు ఈ శివయ్యను నిత్యం పూజిస్తారు.
ప్రతి ఏటా కార్తీకమాసంలో మాత్రమే దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. ఇది దశాబ్థాల తరబడి ఈ ప్రాంతంలో సాగుతున్న ఆచారం. అయితే గత కొంత కాలంగా ప్రతి సోమవారం నాడు ఇక్కడికి పరిసరగ్రామాలలో భక్తులు దర్శించుకునేందుకు వస్తారు.
.
అద్భుత జలపాతం..
ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దెవస్థానం కొలువుదీరిన కొండ గుహకు అనుకుని ఉన్న కొండపై భాగం నుంచి పార్వతమ్మ తల్లి స్వామి పాదాలను తాకేలా వందల అడుగుల ఎత్తులో శివుడి జటాజుటం నుంచి ఎగిసిపడుతూ... ఉరకలేస్తూ... దూకుతున్న దృశ్యం ఓ మహాద్భుతం. పున్నమి రోజుల్లో చంద్రుడు విరజిమ్మే వెన్నెల పెరుగు తున్న కొలదీ ఈ జలపాతం ధారకూడా పెరుగుతూ ఉంటుందని వచ్చే యాత్రీకులు చెప్తారు.
.
పున్నమి వెన్నెల కురుసే వేళ అద్భుత జల పాతాల నుంచి వచ్చిన ఔషధగుణాలున్న నీటితో ఏర్పడ్డ గుండంలో పున్నమి నాడు రాత్రి వేళ చంద్రకాంతి పడుతున్న సమయాన స్నానమా చరిస్తే... సర్వ వ్యాధులు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా స్నానమాచరించి లింగమయ్యని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు తీరటంతో పాటు పాపాలు తొలగిపోతాయన్నది విశ్వాసం ప్రబలంగా భక్తుల్లో నేటికీ ఉంది...
.
చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. శేషాచలం అడవులతో పాటు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కలిపి మొత్తం 4.80 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అయితే వీటికి అంతర్జాతీయంగా గిరాకీ ఉండటంతో పెద్ద ఎత్తున స్మగ్లర్లు ఈ చెట్లను నరికి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఎర్రచందనం చెట్లను అంతరించే పోయే అరుదైన వృక్షజాతిగా కేంద్రం ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఎర్రచందనం చెట్ల విక్రయాన్ని సైటస్ అనే కేంద్ర సంస్ధ నిషేదించింది. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు అంతర్జాతీయ మాఫియాగా ఏర్పడి ఎర్రచందనం చెట్లను కబళిస్తున్నారు. నల్లమల అడవులల్లో ఎర్రచందనం ఎక్కువగా వుండడం... అయితే ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు అంతర్జాతీయ మాఫియాగా ఏర్పడి ఎర్రచందనం చెట్లను కబళిస్తున్నారు. నల్లమల అడవుల్లో ఉన్న వేలాది ఎర్రచందనం చెట్లను నరికి విక్రయిస్తున్నారు. వీరికి శ్రీ కాశిరెడ్డినాయన అన్నదాన సత్రము, ఆశ్రేయం కల్పించి, వారికి అన్నపానీయాలు కల్పించుచున్నారని... శ్రీ కాశిరెడ్డినాయన అన్నదాన సత్రము, ఆశ్రమాన్ని కుల్చివేయడం జరిగింది... కొత్త వారు అడవి లోనికి రాకుండా దారికి అడంగా చెట్లను నరికి వేయడం, దారికి గంతలు తోవ్వడం జరిగింది.. అడవిలొనికి వచ్చినవారికి కేసు పెట్టడం చెయడం వలన భక్తులుకుడా స్వామి దర్శనానికి పోవడానికి కూడ భయపడుతున్నారు.
.
ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనానికి ఎలా వెళ్లాలి....
కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ముందు 3కిలోమీటర్ల దూరంలో ఎడమ పక్క కొండ దారి కలదు. ...గతంలో కాలినడక మార్గంద్వారా మాత్రమే కనీసం 20 కిలోమీటర్లు రాళ్లు, రప్పల నడుమ... ఇరుకిరుకు కాలిబాటల్లో నడిస్తే కానీ ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దెవస్థానం చేరుకోలేని పరిస్థితి ఉండేది. కాల క్రమంలో పెరిగిన రవాణా సౌకర్యాలు, నల్లమల అందాలు చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య కూడా క్రమం గా పెరుగుతుండటంతో ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దెవస్థానం లోయ వరకు వివిధ వాహనాల ద్వారా వెళ్లేందుకు వీలుగా చిన్న చిన్నరాళ్ళబాటలు కలవు.
https://www.facebook.com/rb.venkatareddy/media_set?set=a.10209930193844285&type=3
.
రచన..
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి..
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
Don't Copy-Paste This Story
All Copyright Reserved 2017
https://www.facebook.com/rb.venkatareddy
reddemb@gmail.com
* దట్టమైన నల్లమల అడవిలో మహిమాన్విత శైవక్షేత్రం .....
* ఎర్రచందనం పేరుతో అధ్భతమైన ఆలయాన్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న అధికారులు..?
* గుహ లో స్వయంబుగా వెలిసిన శివలింగం, మూడు పడగల నాగుపాము, శంఖం, వీణ ....
* అష్టైశ్వర్యాలు ప్రసాదించే మహేశ్వరుడు....
* ఈ గుహలోని శివలింగం దర్శించిన వారి జన్మ ధన్యం....
* స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన
శ్రీ కాశిరెడ్డినాయన అన్నదాన సత్రము, ఆశ్రమాన్ని కుల్చి వేసిన అధికారులు....
* ఐదు తలల తెల్లని నాగుపాము వచ్చి ఉమామహేశ్వర స్వామి
లింగాన్ని చుట్టుకొని స్వామి వారిని అభిశేకం చేసే అద్భుత దృశ్యం ....
.
నల్లమల అడవుల్లో అందచందాలు చూస్తే మంత్రముగ్ధులవ్వాల్సిందే...

https://www.facebook.com/
reddemb@gmail.com
No comments:
Post a Comment