🌹ఏదైనా ఒక మంచిపని మీవల్ల ఇంకొకరికి జరుగుతుందంటే దానిని చేయండి! జరగలేదంటే మనకు సంబంధించినది కాదు.
సుఖపడ దలచుకున్నవానికి నాగరికత బానిసగా పనిచేస్తుంది. అంతేగాని, నాగరికత మాత్రమే సుఖము నివ్వజాలదు.
నీకు సంబంధించినవి ఏమైనా పోయినచో వాటికోసం వెనుతిరిగి చూడకుండా ఉండగలగాలి! అప్పుడే బ్రహ్మవిద్యకు అర్హుడవు.
దేనియందు ముడిపెట్టుకున్నా అది ప్రేమ కాదు. దానిని మమకార మంటారు. ఎదుటి వారిలోని సద్గుణాలతో మాత్రమే మనకు సంబంధము.
దుర్గుణాలతో కాదు. దుర్గుణాలతో సంబంధం పెట్టుకుంటే మన సుఖమునకు మనము అభ్యంతరాన్ని ఏర్పరచుకుంటున్నట్లు......
No comments:
Post a Comment