దేవీ నవరాత్రులు. ~ దైవదర్శనం

దేవీ నవరాత్రులు.

   🌹 అశ్వినీ నక్షత్రంతో కూడుకుని ఉన్న పౌర్ణమితిధి కాబట్టి ఇది ఆశ్వయుజమాసం.

👉 ఈ ఆశ్వయుజమాసంలో "శుక్లపక్ష పాడ్యమితిధి నుండి నవమితిధి వరకు అమ్మవారిని వారివారి శక్త్యానుసారము ఆరాధనచేసి ఆ తల్లియొక్క కృపకు పాత్రులం అవుతాము."

👉    *ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఉపాసన అన్ని వర్గాలవారు, అన్ని ప్రదేశాలలో ఉన్నవారు చేసితీరాల్సిన ఉపాసన. 'ఉప' అనగా దగ్గరగా....'ఆసన' అనగా కూర్చోవడం.* ఈ తొమ్మిది రోజులు "మనలో ఉన్న అహంకారాన్ని ప్రక్కనపెట్టి వారివారి ఇంటి పద్ధతి ప్రకారం తల్లియొక్క ఆరాధన చెయ్యాలి."

🔷 *అన్ని జన్మలలోకి మానవజన్మ చాలా గొప్పదైనటువంటిది.* మరి వచ్చినటువంటి ఈ మానవజన్మను సార్ధకం చేసుకోవాలి కదా! అలా సార్ధకం చేసుకోవడానికి అణువైనకాలం *ఈ ఆశ్వయుజమాసంలో వచ్చే నవరాత్రులు.

🔷 తల్లి కడుపులో ఉన్న శిశువు 9 మాసాలు ఉన్నాక పూర్ణత్వాన్ని పొందుతాడు.
🔷 మనకి ఏ ఉపాసన అయినా 9  రోజులుగా ఉంటుంది. తొమ్మిది అనే అంకెకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.* ఇటు గణితశాస్త్రపరంగా మరియు ఆధ్యాత్మికపరంగా కూడా. అంకెలలో చివరి అంకె తొమ్మిది.
◆ తొమ్మిది తరువాత వచ్చే సంఖ్య 10.
◆ అందులో ఒకటి తీసివేస్తే మిగిలేది '0'.
◆ సున్నాకి గణితశాస్త్రపరంగా పెద్ద విలువ లేకపోయినా ఆధ్యాత్మిక పరంగా '0' కి ప్రత్యేక స్థానం ఉంది.
అదే పూర్ణత్వం.

🔷 ఈ తొమ్మిది రోజులు తల్లి ఉపాసన చెయ్యడంద్వారా మనలో ఉన్న జీవుడు పూర్ణత్వాన్ని పొందుతున్నాడు.

🔷 *ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలలో ఆరాధన చేసి ఆ తల్లియొక్క కృపాకటాక్షములు పొందే ప్రయత్నం సాధకుడు తన సాధనద్వారా చేసుకుని ఉద్ధరణ దిశగా వెళతాడు.* ఆశ్వయుజ మరియు కార్తీక మాసాలు శరదృతువుతో ఉంటుంది.

🔷 ఈ ఋతువులో యమదంష్ట్ర బయటికి వస్తుంది. అనగా అకాల మరణాలు, ఎక్కువగా అంటురోగాలబారిన పడటం.
🔷 *అమ్మవారు ప్రకృతి స్వరూపిణి* కాబట్టి ఆ తల్లిని ఈ కాలంలో త్రికరణశుద్ధిగా ఆరాధన చెయ్యడంవల్ల అపమృత్యుదోషంనుంచి తప్పించుకోవచ్చు.

🔷 *శరత్కాలం వచ్చేసరికి అప్పటివరకు వర్షఋతువులో ఉన్న వాతావరణం ఒక్కసారి వేడిబడుతుంది. అప్పటివరకు బురదగా ఉండే నేల తేటబడుతుంది. అనగా! బురద అడుక్కి వెళ్లి నీరు పైకి తేరుకుంటుంది.* అలా తేరుకున్న మనసుతో భక్తి మరియు ప్రేమ మిళితం చేసి మనం ఈ నవరాత్రులలో తల్లిని ఆరాధన చెయ్యాలి.

🔷*జగత్మాతృకాస్థానంలో తల్లిని ఆరాధన చెయ్యడం చాలా తేలిక. తల్లి కోరుకునేది ఏముంటుందండి? పిల్లల దగ్గరనుండి ప్రేమ తప్ప. ఆ జగజ్జనని కూడా అంతే....ఆ తల్లి కోరుకునేది పరిపూర్ణమైన తన మనసుని.* అంతే! ఇక రాత్రి ఆరాధన అని అనడానికి కారణం....రాత్రి అనగానే యోగసాధనలో అంతర్ముఖస్థితికి గుర్తు. "తొందరగా మనసు అంతర్ముఖమవుతుంది."

👉 *ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వారివారి కుటుంబ ఆచారం ప్రకారం వారి ఆరోగ్య పరిస్థితిబట్టి 3 రకాలుగా ఉపాసన చెయ్యవచ్చు. ఒకటి....నక్త వ్రతం. ఉదయం అంతా ఉపవసించి రాత్రి భోజనం చెయ్యడం.* అలాగే రెండో రకం....మధ్యాహ్నం ఏదైనా ఉపాహారం తీసుకుని రాత్రికి ఫలాలు తిని ఉపవాసం చెయ్యడం (వారి శరీరం సహకరిస్తేనే).

🔷 *ఇక మూడో రకం....మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకోవడం.* "మనం ఎలా ఉపాసన చేశాము అనే దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అన్నది ప్రధానం."

👉 ఈ శరన్నవరాత్రులలో *మనందరం కూడా శ్రద్ధాభక్తులతో ఆ తల్లిని ఆరాధన చేసి అమ్మవారి కృపాకటాక్షములను పొందెదము గాక* అని ఆ తల్లి పాదాలు పట్టుకుని వేడుకుందాం.●

  అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు.
  "జయ జయ శంకర హర హర శంకర"
       *'సర్వేజనా సుఖినోభవంతు'*
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive