ఆది, అంతంలేని సనాతన, సనూతన ధర్మం హైందవ ధర్మం! అటువంటి అతిపురాతన సంస్కృతికి వారసులమైన భారతీయులమని, పునర్జన్మని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే హిందువులమని ప్రపంచానికి గర్వంగా మనం ఎలా చెప్పగలం? మన అనుపమాన వారసత్వానికి సంకేతమే నుదుటన తిలకం! ప్రతి హిందువు సగర్వంగా ముఖాన ధరించాల్సింది... ఈ బొట్టునే!
ప్రపంచంలోని ఇప్పుడు వున్న అన్ని నాగరికతలు ఏవీ లేనప్పుడు పుట్టింది మన భారతీయ సంస్కృతి. ఎప్పుడు, ఎలా... వంటి ప్రశ్నలకు జవాబే లేదు మేధావుల వద్ద. ఒక విధంగా ఆది, అంతంలేని సనాతన, సనూతన ధర్మం మన హైందవ ధర్మం. మరి అటువంటి గొప్ప వారసత్వం మనది అని చెప్పటానికి సంకేతం ఏంటి? ఒక్కటి వుంది.... దాని వల్ల మనం అతి పురాతన సంస్కృతికి వారసులమైన భారతీయులమని, పునర్జన్మని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మే హిందువులమని అందరికీ చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. ఆ అద్భుత సంప్రదాయమే... నుదుటన బొట్టు పెట్టుకోవటం.
హిందువులు రెండు కనుబొమ్మల మధ్య ముక్కు పై భాగంలో బొట్టు పెడతారు. స్త్రీలే కాదు పురుషులు కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో బొట్టు పెట్టుకోవాలని శాసిస్తుంది ... శాస్త్రం. దేనికి? రెండు కనుబొమ్మల నడుమ యోగ శాస్త్రం ప్రకారం... ఇడా, పింగళ నాడులు కలుస్తాయి. అలాగే, ఆధ్యాత్మిక ప్రగతికి కారణమైన సుషుమ్నా నాడి కూడా ముక్కు పై భాగంలోనే వుంటుంది. ఇలా మూడు యోగ నాడులు కలిసే చోటు కాబట్టే దీన్ని ఆజ్ఞా చక్రమని, మూడో నేత్రమని, త్రివేణి సంగమమని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎలా పిలిచినా... బొట్టు పెట్టుకునే ప్రాంతం ఎంతో కీలకమైంది. అందుకే, ధ్యానం చేసేప్పుడు కూడా ఈ భృకుటి ప్రాంతంలోనే మనసుని నిలపమంటారు.
యోగ పరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైన నుదుటిపైన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? దీనికి సమాధానం... ఎర్రటి కుంకుమ, మాయా స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహానికి కారణం కావటమే. దాన్ని స్త్రీ, పురుషులు నిత్యమూ భృకుటిలో ధరించటం ద్వారా మానసిక శక్తి ఇనుమడిస్తుంది. తేజస్సు పెరిగి ఆత్మ శక్తి ద్విగుణీకృతం అవుతుంది. అంతే కాదు, కనుబొమ్మల నడుమ ఇడా, పింగళ, సుషుమ్నా నాడులు కలిసే చోటిని బొట్టు సూర్య కిరణాల తీక్షణత నుంచి రక్షిస్తుంది.
కుంకుమ కాకుండా గంధం, విభూతి, వైష్ణవులు ధరించే వివిధ ఆకృతుల్లోని నామాలు.... ఇలా ఏవైనా మన సంస్కృతి, సంప్రదాయాలకి సగర్వ సంకేతాలే. అందుకే, హిందువులందరూ తప్పక తమ తమ సంప్రదాయం అనుసారం తిలకం ధరించాలి. దాని వల్ల మన పురాతన వారసత్వం కాపాడబడటమే కాక మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుంది. అయితే, మగవారైనా, ఆడవారైనా బొట్టు పెట్టుకునేప్పుడు స్వచ్ఛమైన కుంకుమ మాత్రమే ధరించాలి.
గంధం, విభూతి లాంటివి కూడా స్వచ్ఛమైనవే వాటిని కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా రసాయనాలు మిళితమైన వాటిని వాడితే మన చర్మానికి హాని జరగవచ్చు, ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. అదే శ్రేష్ఠమైన కుంకుమ ధరిస్తే చర్మ రోగాలు తగ్గు ముఖం పడతాయి కూడా. విభూతి ధారణ వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత నియంత్రింపబడి మానసిక ఉద్వేగం తగ్గుతుంది.

No comments:
Post a Comment