గంగా మహాత్మ్యం.. పార్వతీ దేవి శివుడిని భాగీరధ వృత్తాంతాన్ని,గంగకు భాగీరధి అనే పేరు ఎలా వచ్చింది ఆ విషయాన్ని ఆమె కు చెప్పిన వైనాన్ని అగస్తునికి స్కందుడు చెబుతున్నాడు . గంగ లో పితృ దేవతలు ఎల్లప్పుడు ఉంటారు కనుక వారికి ఆవాహన ,విసర్జన అక్కర లేదు .పితృ ,మాత్రు వంశాలలో మరణించిన వారు ,అగ్ని ప్రమాదం లో చని పోయిన వారు ,విద్యుత్తు ,పులి వల్లా ,పక్షి మృగ క్రిమి కీటకాలను హింసించి చంపినవారు ,ఉరి వేసుకొని చని పోయిన వారు ,విషం చేత ,చచ్చిన వారు ,కుంభీపాక ,రౌరవాది నరకాలలో ఉన్న వారు ,యమ లోకం లో ఉన్న వారు పుత్రులు లేకుండా మరణించే వారు,క్రుతఘ్నులు మిత్రద్రోహులు ,డబ్బు దోచే వారు ,అనాధలు దీనులు మొదలైన వారికి గంగా జలం తొ తర్పణం విడిస్తే వారంతా స్వర్గాన్ని పొంది ,భోగాలను భ విస్తారు .
మూడు లోకాల్లో ఉన్న తీర్ధాలన్నీ కాశి లో ని గంగా జలం లో ఉన్నాయి .ఇక్కడి ఉత్తర వాహిని అయిన గంగా నది ని ‘’స్వర్గ సముద్రం ‘’అంటారు .బ్రహ్మ హత్యా పాతక దోషాన్ని కూడా పరి హరించే సమర్ధత ఉన్నది .ముక్తి క్షేత్రం . .విశ్వ నాధుని అనుగ్రహం తొ అమృతత్వాన్ని పొందుతారు .మహా పాపి కూడా అంత్య కాలం లో గంగా స్నానం చేస్తే పాపం నుండి విముక్తు డవుతాడు .
పూర్వం కళింగ దేశం లో ఒక బ్రాహ్మనుడుందే వాడు ఉప్పు అమ్ముకొని జీవించే వాడు .స్నానం ,సంధ్యా అంటే ఏమిటో అతడికి తెలియదు .అతని పేరు ‘’వాహికుడు ‘’యజ్ఞోప వీతం మాత్రం ఉండేది .ఒక శూద్ర విధవా స్త్రీ ని పెళ్లి చేసుకొన్నాడు .ఆ దేశం లో విప రీతమైన కరువు వచ్చింది .అంతా దేశం వదిలి పోతున్నారు .వీరిద్దరూ కూడా వెళ్లారు దారిలో ఒక పెద్ద పులి అతడిని చంపి తినేసింది . అతడి ఎడమకాలి ని మాత్రం ఒక గ్రద్ద తన్నుకొని పోయింది .ఇంకో గ్రద్ద ఈ మాంసం కోసం దానితో యుద్ధం చేసింది .ఆ గ్రద్ద నోటి నుండి జారిన వాహికుని ఎడమకాలు అదృష్ట వశాత్తు గంగా నదిలో పడింది .యమదూతలు అతన్ని చేరి చరణా కోలు తొ కొట్టి బాధించటం ప్రారంభించారు .అతడి నోరు ,ముక్కుల నుండి రక్తం కారుతోంది .అలాగే వాడిని యమ ధర్మ రాజు వద్దకు తీసుకొని పోయి నిల బెట్టారు .చిత్ర గుప్తుని పిలిచి అతడి పుణ్య ,పాప విశేషాలు చెప్పా మన్నాడు యమధర్మ రాజు .
చిత్ర గుప్తుడు చిట్టా విప్పి చెప్పాడు .అతడు జన్మించిన దగ్గర్నుంచి జాత కర్మ జరగ లేదని ,ఆయుర్బలం వల్ల గర్భ దోశాలేమీ అంతలేదని ,పదకొండో రోజు న నామ కరణం జరగ లేదని ,నాల్గవ నెలలో బయటికి తీసుకొని వెళ్ళ లేదని ,శుభ తిధులలో తండ్రిఅతడిని తన వెంట తీసుకొని వెళ్ళే వాడని ,అన్నప్రాసనా చేయ బడ లేదని తండ్రి మి ఠాయి కొని సూర్యుడికి చూపించి కొడుక్కి పెట్టె వాడని ,చూడా కర్మ ,కర్ణ వేద విధి విధానం లో జరుగ లేదని,స్వర్ణ కారుడేవరో చెవులు కుట్టాడని ,ఎనిమిదో ఏట మౌన్జీ ధారణా జరిగిందని ,దాని విసర్జన శాస్త్ర ప్రకారం చేయ లేదని ,శూద్ర స్త్రీని పెళ్లి చేసుకొన్నాడని ,చిన్నప్పటి నుండి దొంగ గా బతికాడని ,జూదం అదే వాడని ఉప్పు అమ్ముకొనే వాడని ఒక ఆవుదూడ వచ్చి ఉప్పు నాకు తుంటే దాన్ని కొడితే అది మరణించిందని ,తల్లిని చాలా సార్లు కాలితో తన్నాడని ,తండ్రి మాట వినే వాడుకాడని ,చాలా సార్లు ఇతరులతో పోట్లాదాడని, విషం తాగుతానని బెది రించే వాడని ,ఒకప్పుడు అగ్ని చేత దగ్ధ మయాడని ,జంతువులనేక సార్లు కొమ్ములతో ఇతన్ని కుమ్మేశాయని ,కర్రలు పెట్టి అఘాయిత్యం గా తల పగలకొట్టుకొనే వాడని ,చర్మం ,మాంసం ,గోళ్ళు అమ్మే వాడని పగలే స్త్రీ లతో వ్యభిచరించే వాడని కాసే ,పూసే చట్లను నిష్కారణం గా నరికేసె వాడని ఇంతెందుకు వీడు మూర్తీభవించిన పాపమే అని ఏకరువు పెట్టాడు చిత్ర గుప్తుడు .
అతడిని చిత్ర హింసల పాలు చేయమని యముడు ఆజ్న జారీ చేశాడు .ఇంతలో అతని ఎడమ కాలు గంగా నదిలో పడటం వల్ల స్వర్గం నుండి విమానం వచ్చి అప్సరసలు సేవిస్తుండ గా వాహికుడిని స్వర్గానికి తీసుకొని పోయారు .కనుక గంగా నది పుణ్య ప్రదమైంది అని స్కందుడు చెప్పాడు .సదా శివ సంబంధ మైన ఒకానొక శివ సంబంధ శక్తి ఎప్పుడూ గంగ లో ప్రవహిస్తూ ఉంటుంది .దేవదేవుడే జగద్రక్షణ కోసం గంగ రూపాన్ని పొందాడు .శంభుని చే వేదాక్షరాలు వడ కట్ట బడి ఆ గంగా ధరుని చే గంగా జలం గా చేయ బడింది .యోగా ,సాంఖ్య ఉపనిషత్ సారం గంగా జలం ..గరుత్మంతుని చూస్తె పాములు పారి పోయి నట్లు భాగీరధిని చూస్తేనే పాపాలన్నీ పారి పోతాయి .గంగ మట్టిని శిరస్సు న ధరిస్తే సూర్య సమాన తేజం కలుగుతుంది .గంగా స్తుతి ,దర్శనం, స్పర్శనం, పానం, స్నానం సర్వ కామాలను తీరుస్తాయి .నదులలో ఉత్తమ మైనది .చంద్రుని కూడా శోభా వంతుని చేసే లక్షణం ఉంది .గంగయే సర్వ తీర్ధం .అదే తపోవనం .;గంగను మించిన దేదీ లేదు ఇది సత్యం ,పునస్సత్యం .

No comments:
Post a Comment